భార్గవి (bhargavi)

Share
పేరు (ఆంగ్లం)bhargavi
పేరు (తెలుగు)భార్గవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2020/04/%e0%b0%92%
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుప్రవృత్తి—–సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి,అభిరుచి
బదరీ పబ్లికేషన్స్ తరుఫున ప్రచురించిన పుస్తకాలు
1.ప్రముఖ సినీ సంగీత విశ్లేషకులు వి.ఎ.కె. రంగారావుగారి వ్యాస సంకలనం “ఆలాపన”
2.కస్తూరి నరసింహ మూర్తి గారి ఉమర్ ఖయ్యా మ్ రుబాయీల తెలుగు అనువాదం “మధుకన్య”
3.టాగూర్ “గీతాంజలి”కి తెలుగు అనువాదం,ప్రఖ్యాత చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్ వర్ణ చిత్రాల సహితంగా——స్వీయరచన
4.వివిధ విషయాల గురించి రాసిన వ్యాస సంకలనం “ఒక భార్గవి”—స్వీయ రచన
5.అమెరికా,గుజరాత్  ల ప్రయాణవిశేషాలను వివరించే “ఒక భార్గవి-రెండు ప్రయాణాలు”
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికలలిత-ఒకలలితమైన రాగం
సంగ్రహ నమూనా రచన“లలిత” – ఇది శక్తి రూపమైన అమ్మవారి పేర్లలో వొకటి

లలితా దేవిని వేయి పేర్లతో అర్చిస్తారు భక్తులు “లలితా సహస్ర నామం” పేరిట

లలిత అనేది శాస్త్రీయ సంగీతంలో వొక రాగం పేరుకూడా చిన్న చిన్న తేడాలతో హిందూస్థానీలో దీనిని “రాగ్ లలిత్ “అంటారు

భార్గవి
లలిత-ఒకలలితమైన రాగం

“లలిత” – ఇది శక్తి రూపమైన అమ్మవారి పేర్లలో వొకటి
లలితా దేవిని వేయి పేర్లతో అర్చిస్తారు భక్తులు “లలితా సహస్ర నామం” పేరిట
లలిత అనేది శాస్త్రీయ సంగీతంలో వొక రాగం పేరుకూడా చిన్న చిన్న తేడాలతో హిందూస్థానీలో దీనిని “రాగ్ లలిత్ “అంటారు
మాయా మాళవ గౌళ రాగంలో జన్యమైన యీ రాగంలో సర్వ సంపదలకూ కారణమైన లక్ష్మీ దేవిని స్తుతిస్తూ కీర్తనలూ ,కృతులూ రాశారు వాగ్గేయకారులు
వాటిలో ముత్తుస్వామి దీక్షితర్ రాసిన “హిరణ్మయీ లక్ష్శీ”శ్యామశాస్త్రి రాసిన “ననుబ్రోవవే లలితా”ప్రముఖమైనవి
“నటనల భ్రమయకు నా మనసా “,(యం.యస్ .సుబ్బలక్ష్మి పాడినది ) “జయలక్ష్మి ,వరలక్ష్మి, సంగ్రామ వీరలక్ష్మి “(గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పాడినది )అనే అన్నమయ్య పదాలు కూడా చాలా బాగుంటాయి
ఈ రాగం వింటుంటే వొక రకమయిన ప్రశాంతతా పవిత్రతా ఆవరిస్తుంది
తామరల సువాసనను మోసుకొచ్చే చెరువు గాలి జ్ఞాపకానికొస్తుంది
ఇంకా కార్తీకమాసం సాయంత్రం చిరుచలిలో తులసికోటలో నిశ్చలంగా వెలిగే నూనె దీపంలా అవుతుంది మనసు
సినిమా పాటలలో అతి తక్కువగా వాడిన రాగం
“రహస్యం “లో ఘంటసాల స్వరపరిచిన మూడు రాగాలతో ముప్పేటగా అల్లిన పాట “లలిత భావ నిలయా “లో మూడవ చరణం “నిటల లోచన నయన సారా” అన్నది వున్నది లలిత రాగంలోనే
రుద్రవీణ సినిమాలో ఇళయరాజా స్వరపరిచిన “లలిత ప్రియ కమలం విరిసినది” యెంత బాగుంటుందో స్వరాలతో ఆడుకున్న ఆస్వరజ్ఞాని చేసిన ట్యూన్ కి అంతే అద్భుతమైన అర్థవంతమైనపదాలతో సయ్యాటలాడుకున్నది “సిరివెన్నెల “నిజంగా వెన్నెలకురిపించారు
పాడిన యేసుదాస్ ,చిత్ర వారు తప్ప ఆ పాటకు ఇంకెవరూ న్యాయం చేయలేరనిపించారు
సాహిత్యాన్ని గమనిస్తూ పాట వినండి
లలిత ప్రియ కమలం విరిసినదీ
కన్నుల కొలనిని
ఉదయ రవి కిరణం మెరిసినదీ
ఊహల జగతిని
అమృత కలశముగ ప్రతి నిముషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన
అరుదగు వరమిది”లలిత “
రేయీ, పవలూ కలిపే సూత్రం సాంధ్య రాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేలా నింగీ కలిపే బంధం ఇంద్ర చాపం
కాదా మన స్నేహం ముడి వేసే పరువం
కలల విరులవనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపులు చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసులతొణికిన మిలమిల
పాడుతున్నది యెద మురళీ
రాగఝరి తరగల మృదు రవళీ
వూగుతున్నది మరులవనీ
లేత విరి కులుకుల నటనగనీ
వేల మధు మాసముల పూల దరహాసముల మనసులు విరిసెను “లలిత “
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం
చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజాకుసుమం
మనసు హిమగిరిగ మారినదీ
కలసినమమతల
స్వరఝరి పశుపతి పదగతి కాగా
లేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వముగ నిలిచెను కాలం
పూల పవనము వేసెను తాళము
హేయమైనది తొలి ప్రాయం
రాయమని మాయని మధు కావ్యం
స్వాగతించే ప్రేమపథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకుని పరుగిడి వడి వడి
విని రాయడానికే ఇంత కష్టంగా వుంది ట్యూన్ కి యెలా రాశాడో మహానుభావుడు

———–

You may also like...