| పేరు (ఆంగ్లం) | C.V. Suresh |
| పేరు (తెలుగు) | సి.వి సురేష్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | సి.వి. సురేష్ : కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. సాహితీ ప్రేమికులు. 2013 నుంచి సాహిత్య వ్యాసంగంలో ఉన్నారు. చారిత్రక ప్రతీకలు అరుదైన సిమిలీలతో సాగే వీరి కవితలు పాఠకహృదయాల ఆదరణ పొందాయి. అనుసృజనలు వీరి ప్రత్యేకత. ఇప్పటివరకూ డెబ్భై కు పైగా కవితలు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి.. ఎనభై పై చిలుకు కవితలు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. అందులో క్లిష్టమైన సూఫీ పోయెట్రీ సంగం పోయెట్రీ కూడా ఉన్నాయి. కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ లో ప్రతి బుధవారం “కవిత్వానువాదం” శీర్షిక, ప్రజాపాలన పత్రిక ‘విభిన్న’ సాహిత్య పేజీల నిర్వహణ, రస్తా మరియు సారంగ వంటి ప్రముఖ వెబ్ మేగజైన్స్ లో కాలమ్స్ నిర్వహిస్తున్నారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | మనమధిరోహించిన పర్వతం |
| సంగ్రహ నమూనా రచన | 1998 లో లాస్ ఏంజెల్స్ లో జన్మించింది. ఆమె తల్లి జాన్ విక్స్. 6th గ్రేడ్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు. సింగల్ మదర్. అమండ గోర్మన్ మరియు గబ్రియలి ఇద్దరూ కవల పిల్లలు. టెలివిజన్ సౌకర్యం కూడా తక్కువగా ఉన్న ప్రాంతం, వాతావరణం లో పెరిగింది. |
సి.వి సురేష్
మనమధిరోహించిన పర్వతం
ఇన్నాళ్ళూ …
మనలో మనమే అనుకొంటూ
ఎదురు చూసిన రోజొకటి మనముందు నిలిచినప్పుడు…
ఇంతవరకూ మనం మోసిన కష్టాన్నీ..
ఆదీ అంతం లేని చీకటిలో..వెలుగునూ
మనమెక్కడని చూడాలి?
ఖచ్చితంగ… మనమో సముద్రాన్ని దాట గలగాలి.
ఇప్పుడిప్పుడే
ఓ మృగాన్ని చీల్చి చెండాడే ధైర్యాన్ని చేసాము
మిన్నకుండి పోవడమెప్పుడూ…
శాంతిగా భ్రమించ రాదనీ తెలుసు కున్నాము
అంతే కాదు ,
న్యాయ నిబంధనల్ని …అందులోని భావాల్నీ కనుక్కొన్నాము.
అదెప్పుడూ, కరిగే మంచు కాదని తెలిసింది.
రేపటి ఉదయం మనదేనని తెలుసుకొనేలోగా,
ఆ ఉదయాన్ని ఏదోఒకలాగ స్వంతం చేసుకొన్నాము.
విచ్ఛిన్నమవ్వని ఈ దేశ ఉనికిలో మనముంటూ ..
అందుకు సాక్షీభూతమయ్యాము
కానీ, అప్పుడే అది పరిపూర్ణం కాదు.
ఈ దేశకాలమానాలకు వారసులుగా –
బానిసల కంటే ఇంకా కిందకు జారి, ఒక తల్లి పెంపకంలో పెరిగిన
బక్కపలచటి నల్ల పిల్ల
ఈ దేశ అధ్యక్షురాలినవ్వాలన్న కలగనగలిగింది.
అది కూడా,
కేవలం తనను తాను తెలుసుకోవడానికే.
అవును,
మేము మా సహజ స్థితి లో ఉండటానికీ,
మమ్మల్ని మేము మెరుగు పరచుకోవదానికీ..
చాల దూరంగా ఉంటూవచ్చాము.
అలా అని,
నిర్దిష్టంగా సంఘటితమవ్వడానికి
బాగా శ్రమ పడినామన్నట్లు కాదు.
ఇలా సంఘటిత శక్తిగా మారాడనికి ..
మేము ప్రయత్నించడం వెనక ఓ కారణముంది
ఈ దేశ సంప్రదాయాల్నీ, రంగుల్నీ,
ఇక్కడి వ్యక్తిత్వాలనీ, మనిషి స్థితిగతులపై
కట్టుబడి ఉన్న ఈ దేశాన్ని క్రమబద్ధీకరించడం కోసమే!
అందుకే, మా మధ్య ఉన్న అంతరాల కంటే,
మా ఎదుట నిలిచిన అడ్డంకులపైనే ఎక్కువగా దృష్టి సారించాము.
మాలోనే మేము విభజింపబడటాన్ని అడ్డుకట్ట వేశాము.
ఎందుకంటే, మాకు తెలుసు,
సమున్నత భవిష్యత్తు కోసం
మొట్ట మొదటగా, మా మధ్య విభేదాలకు స్వస్తి పలకాలని.
మనమొకరికొకరం కలిసి కట్టుగా
ఉండేందుకు , మన బాహువుల్ని కిందికి దించేద్దాం
మా తపన, అందరి సామరస్యం కోసమే తప్ప,
ఎవరికి కీడు చేయడం కోసం కాదు.
ఇంకోటేదీ లేకపోతే,
ఇదే ఇదే నిజమని, ఈ భూగోళం మొత్తం చెప్పనివ్వాలి.
మనం దుఃఖ పడినప్పటికీ, ఎదిగాము.
మనం గాయపడినప్పటికీ దృఢవిశ్వాసం తో వుండినాము
అలసినప్పటికీ, ప్రయత్నాన్ని ఆపలేదు
శాశ్వత బందీలమైనప్పటికీ, విజేతలుగా నిలిచాము.
ఓటమినెప్పుడూ చూడమని చెప్పడం కాదు కానీ,
ఇక ఎప్పుడూ విబేధాలు తలెత్త కూడదనే మా తపన.
***
మనల్ని ..
ఏ శక్తీ భయపెట్టే స్థితి లో ఉండకూడదని,
మనమెప్పుడూ స్వయం నిర్మితమై ఉండాలని
మన పురా గ్రంథాలు స్పష్టంగా చెపుతాయి.
మనం నిర్దేశించుకొన్న కాలం లో మనం జీవిస్తే,
విజయమెప్పుడూ కష్టాల వెనుక దాగిఉండదు.
మనం నిర్మించిన అన్ని వారధులూ
ఈ సంక్లిష్ట అడవుల్ని ధాటి పచ్చిక బయళ్ళు చేరవేసేవే..
మనమదిరోహించిన పర్వతం
మనం సాహసించినప్పుడే సాధ్యపడింది.
మనం వారసత్వంగా సంక్రమింప చేసుకున్న
ఆ కీర్తి కన్నా…..మనం అమెరికన్లు గా మనగలగడమే గొప్పది
***
మనమెలా అడుగులు వేసామో..
మనమెలా చక్కదిద్ధామో అన్నది గతం.
సమైక్యమవ్వడం లో ,
మన జాతిని…భాగస్వాములను చేయకుండా..
చెల్లాచెదురు చేసిన ఒక శక్తిని చూసాము.
ప్రజాస్వామ్యాన్ని సాధించడం కాస్త ఆలస్యమైనా.
అది ఎప్పటికీ శాశ్వతంగా ఓడింపబడదు!
***
ఈ నిజం లో …. మనం నమ్మే ఆ నమ్మకంలో
మనమెప్పుడైతే మన దృష్టి భవిష్యత్తు పై ఉంచుతామో,
చరిత్ర మన పైన దృష్టి పెడుతుంది.
ఇది కేవలం ఒక విముక్తి అయ్యే యుగమే.
అది ఎలా మొదలవుతుందోనన్న భయమే ఇప్పటికీ!
భయానకమైన గతానికి
వారసులుగా ఉండేందుకు మేము సిద్ధంగా లేము.
కానీ, ధృఢమైన నమ్మకం తో పాటు సంతోషాన్ని
మనకు మనమే అందించుకోనేందుకు, ఆ దారుణ గతం నుండే
ఒక నూతన అధ్యాయాన్ని రచించే శక్తి ని కనుగొన్నాము.
***
ఆ మహా విపత్తుపై ,
మేమెలా విజయాన్ని సాధించగలిగామని అడిగినట్లయితే
ఆ మహా విపత్తు మాపై విజయాన్నెలా సాధించిందో…..
ఇప్పుడిప్పుడే అంచనా వేయగలుగుతున్నాము
భవిష్యత్తు లో మేమెలా ముందుకు నడవాలో
అన్న ఆలోచన తప్ప .. గతం పై వెనక్కు చూసే ప్రసక్తే లేదు.
ఈ దేశం మొత్తం గాయమైనప్పటికీ
అది సాహసోపేతంగా , కరుణగా, భీకరంగా, స్వేచ్ఛగా ఉంటూనే వచ్చింది.
***
బెదిరింపులవల్ల కలిగే అవాంతరాలతో…
మేమెక్కడా వెనుతిరగము
ఎందుకంటే, మా యొక్క నిష్క్రియాత్మకత మరియు జడత్వం
మా రాబోయే తరాలకు అది వారసత్వమని మాకు తెలుసు.
మా తప్పులు భవిష్యత్తరాలకు భారమవుతాయనీ తెలుసు.
కానీ, ఒకటి మాత్రం నిశ్చయం …..
మా బలాన్ని , దయార్ద హృదయంతో కలిపి
సరైన దిశగా కదిలితే
ప్రేమ మా వారసత్వమవుతుంది.
అప్పుడు మా పిల్లల జన్మ హక్కు మార్చబడుతుంది.
***
కాబట్టి,
ఇప్పుడు మనకు విడిచి వెళ్ళిన దేశం లాంటిది కాకుండా,
మనమొక మంచి దేశాన్ని మన రాబోయే తరాలకందివ్వాలి.
ఉక్కు నిర్మితమైన నా ఛాతీ నుండి
విడుదలయ్యే ప్రతి శ్వాస
ఈ గాయపడిన ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతుంది.
ఈ దేశపు ..
స్వర్ణ భరిత దక్షిణ పర్వతాల నుండీ…
నైరుతి సుడిగాలుల నుండి ఉదయిస్తాం
అక్కడే మన పూర్వీకులు
మొదటగా విప్లవ చైతన్యవంతులయ్యారు.
సరస్సులతో నిర్మితమైన
మధ్య -పశ్చిమ రాష్ట్రాల నుండి మేము ఉద్భవిస్తాం
మండే సూర్యుడితో ప్రజ్వరిల్లే ఆ దక్షిణాన్నుండి ఉదయిస్తాం.
***
మేమీ దేశాన్ని
పునర్నిర్మిస్తాం, పునరుద్ధరిస్తాం, పునరుజ్జీవింప చేస్తాం.
ఈ దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ,
మనదేశమని పిలవబడే ప్రతి మూలనున్న ప్రజలు,
భిన్నంగాఉన్నా, దెబ్బతిన్నా అందంగా ఉద్భవిస్తారు.
ప్రతి ఉదయాన్నే, నీడల నుండీ,
జ్వలిస్తూ, నిర్భీతి తో అడుగు బయట పెడతాం
స్వేఛ్చ చేరే కొద్దీ సరికొత్త సూర్యోదయం వికసిస్తుంది.
మేము ధైర్యంగా చూడగలిగినప్పుడూ…
అంతే ధైర్యంగా అందులో ఉన్నప్పుడు మాత్రమే
అక్కడంతా కాంతి విస్తరించే ఉంటుంది.
———–