| పేరు (ఆంగ్లం) | vedagiri rambabu |
| పేరు (తెలుగు) | వేదగిరి రాంబాబు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | భార్గవి |
| తండ్రి పేరు | పూర్ణచంద్రరావు |
| జీవిత భాగస్వామి పేరు | సంధ్యారాణి |
| పుట్టినతేదీ | 14/10/1952 |
| మరణం | 18/08/2018 |
| పుట్టిన ఊరు | చుండూరు, గుంటూరు జిల్లా |
| విద్యార్హతలు | డిగ్రీ |
| వృత్తి | తెలుగు రచయిత, తెలుగు సీరియల్ రచయిత, వివిధ పుస్తకాల ప్రచురణ కర్త. హైదరాబాదు గ్లోబల్ హాస్పిటల్స్, మీడియా విభాగాధిపతి నిమ్స్‌లో ఒ.ఎస్.డి (మీడియా) |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | https://www.facebook.comvedagiri.rambabu |
| స్వీయ రచనలు | 1. సముద్రం,2. వయసు కథలు,3. విముక్తి,4. కస్తూరి,5. ఈ కాలమ్ కథలు,6. పేచీ కథలు,7. వేదగిరి రాంబాబు కథానికలు,8. వ్యంగ్య కథానికలు,9. అవయవదాన కథానికలు,10. మరణం నుండి మరణం దాకా,పరిశోధనా గ్రంథాలు,1. జైలు గోడల మధ్య,2. పాపం పసివాళ్ళు,3. అగ్నిసాక్షి,4. వీళ్ళేమంటారు?,చరిత్ర గంథాలు,1. నాలుగు శతాబ్దాల నగరం,2. ఆంధ్రుల చరిత్ర,బాలల గ్రంథాలు,1. బాలరాజు (రెండు పిల్లల నవలలు),2. చిన్ని కథలు,3. అలవాట్లు పొరపాట్లు,4. ఐదు కథలు,5. మన హైదరాబాద్,6. బాలల బొమ్మల గురజాడ,7. విజయచంద్ర (పిల్లల నవల),8. బుజ్జి కథలు,9. ఆబాల గోపాలం,జర్నలిజం,1. వెలుగుదారిలో తెలుగు పత్రికలు,2. తెలుగు పత్రికలు – రచనా థోరణులు (సిద్ధాంత గ్రంథం),3. ప్రజలను ప్రభావితం చేస్తున్న మాధ్యమాలు,వైద్య గ్రంథాలు,1. అందరికీ ఆరోగ్యం,2. ఆరోగ్యానికి మార్గాలు,3. గుండె గుట్టు,4. ఊపిరితిత్తుల ఊసు,5. మూత్రపిండాల మర్మం,6. మెదడుమాట,7. కీళ్ళు కండరాలు,8. జీర్ణం జీర్ణం,9. శతాధికంగా వ్యాసాలు, పరిచయాలు,10. “మన ఆరోగ్యం” మాసపత్రికకు గౌరవ సంపాదకత్వం.,ఆధ్యాత్మిక గ్రంథాలు,1. ఆధ్యాత్మిక అడుగు జాడలు,2. ఒక మంచిమాట,విమర్శ గ్రంధాలు,1. తెలుగు కథానిక తేజోరేఖలు,2. సాహితీ రేఖలు,3. తెలుగు కథానికకు వందేళ్ళు,4. కథనరంగం,5. కథా సదస్సు కొత్త కదలిక,6. కథానిక లక్ష్యం – లక్షణాలు,జీవిత రేఖా చిత్ర గ్రంథాలు,1. మన గురజాడ,2. ఆధునిక ధృవతార,3. గిడుగు పిడుగు,4. సౌందర్యాధకుడు బుచ్చిబాబు,5. పాలగుమ్మి పద్మరాజు,6. వెయ్యిన్నొక్క నవలల కొవ్వలి,7. తెలుగు పత్రికలు,8. ఆధునిక తెలుగు కథానిక |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | గురజాడ పురస్కారం మహాకవి గురజాడ అప్పారావు 153వ జయంతి పురస్కరించుకుని సెప్టెంబర్ 21 2015 న గురజాడ పురస్కారం అందజేసారు. ఆయన సుమారు రెండు వేలకు పైగా గురజాడకు సంబంధించిన కథలు, కథానికలు రచించారు. తొలిసారిగా ఆధునిక కథ ఆయనే రచించారని చెప్పారు.[ పురస్కారాలు 1. సముద్రం గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కథానిక సంపుటి పురస్కారమ్ 2. పాపం పసివాళ్ళు ధారావాహికం – రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది 3. అడవి మనిషి – టెలిఫిల్ం – రజత నంది 4. ఆకాశవాణిలో జింగిల్స్ కి ప్రసారభారతి పురస్కారం 5. రాష్ట్ర ప్రభుత్వం నుండి గురజాడ స్మారక పురస్కారం 6. గిడుగు పురస్కారం 7. కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం. |
| ఇతర వివరాలు | మానవ జీవన వైకల్యాలు, సంక్లిష్ట మానవ సంబంధాలు అరిషడ్వార్గాల ఆటలు, అస్తిత్వ వేదనలు సెంటిమెంటల్‌లోతులు, ఏ రసమైనా మానవ స్వభావ పరిధిలోనే యిమిడ్చి రాంబాబు చెప్పడం – విమర్శకులకు నచ్చే విషయం. బహుళ ప్రమోదాన్విత రచనల ఆర్ద్రతతో తడిసిపోయినవాడు, అందుకనే అతడు నిర్నిద్రరచనా వ్యగ్రుడైనాడు. తన అభివ్యక్తీకరణలో అక్షరశక్తి కన్నా భావుక పరిణతకే పట్టాభిషేకం చేసినవాడు. . సాహితీ కారునిగాఅతనికి యర్రంశెట్టి సాయి రచనలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ప్రముఖ రచయితలైన యర్రంశెట్టి సాయి, ఆదివిష్ణు, విహారిలు లను గురుతుల్యులుగా అతను భావిస్తాడు. 1974 సంవత్సరంలో డిగ్రీ ఫైనలియర్‌లో చదువుతుండగా ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీకి సరదాగా పంపిన తన తొలికథ ‘సముద్రం’ బహుమతి సాధించిపెట్టింది. తెలుగు కథానికలపై వాటిని చిన్నచూపు చూసే వారిపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉండేవాడు. ఏనాటికైనా వాటికి కూడా జాతీయస్థాయి గుర్తింపు తేవాలని ఆయన ఉద్దేశం. వంద కథానికల పూర్తి వివరాలతో ’తెలుగు కథానిక డాట్ కామ్’ కూడా ప్రారంభించాడు. 23 జిల్లాల కథానిక తీరుతెన్నులగూర్చి పోటీపెట్టి వ్యాసాల్ని సేకరించాడు. ఈ వ్యాస సంకలనాలను జయంతి సభలో ఆవిష్కరించాడు. అలాగే రచయిత ల చిరునామాలతో ఒక డైరెక్టరీని తీసుకొచ్చాడు. శ్రవ్య, దృశ్య మాధ్యమాల్లో కూడా ఈ సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని చూపించడానికి కృషి చేసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎవరు, ఎక్కడ ఎటువంటి కథానిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా తన వంతు సహకారాన్ని అందిస్తుంది శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ . ఇది కథానిక కోసం అవతరించిన సంస్థ. కథానికకే అంకితమైన సంస్థ. ’కథానిక కొత్త కదలిక కదులిక’ అనేది ఈ సంస్థ నినాదం! ఈ కార్యక్రమాలన్నీ ఎవర్నించీ ఎటువంటి సహాయం స్వీకరించక కేవలం తన సొంత సంపాదనతో నిర్వహిస్తున్నారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | వేదగిరి రాంబాబు కథానికలు |
| సంగ్రహ నమూనా రచన | వేదగిరి రాంబాబు కథానికలు |