| పేరు (ఆంగ్లం) | Shivakumar Vajjala |
| పేరు (తెలుగు) | వఝల శివకుమార్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | రాధాబాయి |
| తండ్రి పేరు | సాంబ శివశర్మ |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 03/08/1956 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | వేములవాడ జిల్లా:కరీంనగర్ తెలంగాణ రాష్ట్రం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | కవి, రచయిత., కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్ పనిచేసి పదవీ విరమణ పొందారు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | వేములవాడ జిల్లా:కరీంనగర్ తెలంగాణ రాష్ట్రం |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | • కలల సాగు 1) మితృలతో కలిసి ‘లయ’ (2) గోగుపువ్వు, (3) పాలకంకుల కల (4) దాఖలా (5.) కలల సాగు (6) ఆఖ్ రీ మౌఖా (స్వీయ కవితల అనువాద సంకలనం)( అనువాదకులు శ్రీమతి శాంతసుందరి గారు. • ‘కవి దృశ్యం’ కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ సమర్పణ లో వెలువరించిన తొలి వచన కవితల వీడియోలోని 7 గురు వచనాలను కవులలో ఒకరు. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | • గోగుపువ్వు- కుందుర్తి’ఫ్రీవర్స్ ఫ్రంట్’ అవార్డ్ ‘ఉత్తమ వచన కవితా పురస్కారం’ 1994 • డా.*సి.నారాయణ రెడ్డి ‘సినారే’ఉత్తమ వచనకవితా పురస్కారం’ • ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్టణం) ఉత్తమ వచన కవితా పురస్కారం 2002 • కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వారి 2015 సంవత్సరపు ‘ఉత్తమ గ్రంథపాలకుడు’ పురస్కారం (ఇన్సెంటివ్ అవార్డు). • మల్లోఝల సదాశివుడు స్మారక ఉత్తమ కవి పురస్కారం, 2017 • దాశరథి సాహితీ పురస్కారం (2018) – తెలంగాణ ప్రభుత్వం • ‘గంధర్వ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ హైదరాబాద్ వారిచే 2019 ‘సాహితీ గంధర్వ’ బిరుదు |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | వఝల శివకుమార్ రాసిన కవిత – ‘దుఃఖం’ |
| సంగ్రహ నమూనా రచన | వఝల శివకుమార్ రాసిన కవిత – ‘దుఃఖం’ |
వఝల శివకుమార్
వఝల శివకుమార్ రాసిన కవిత – ‘దుఃఖం’
దుఃఖం
గుండె తలుపు తట్టే
ఆహ్వానం లేని అతిథి
అమాంతం ముంచెత్తే ప్రమేయం లేని ప్రభావం
ప్రమాదం అంచు మీది ఆమోదం
మన అంగీకారాలు అనంగీకారలతో ప్రమేయం లేని
ఆగమనం
తీరాలను ముంచెత్తే అల్పపీడనం
ప్రాంగణంలో నిరాశానిస్పృహలు నాటి
జీవచ్ఛవాల్ని వదిలి పోయే
నిరర్థక నిష్క్రమణం
ఓదార్పు స్పర్శకే తలొగ్గే భూమిక
పలకరింపుకే పులకించిపోయే పాచిక
నిరాసక్త జీవిక.
-వఝల శివకుమార్
ఓదార్పు స్పర్శకే తలొగ్గే భూమిక – తలవంచితే తరలించుకుపోయే తొండాట అంటూ వఝల శివకుమార్ రాసిన కవిత ” తొండాట ” ఇక్కడ చదవండి:
దుఃఖం
గుండె తలుపు తట్టే
ఆహ్వానం లేని అతిథి
అమాంతం ముంచెత్తే ప్రమేయం లేని ప్రభావం
ప్రమాదం అంచు మీది ఆమోదం
మన అంగీకారాలు అనంగీకారలతో ప్రమేయం లేని
ఆగమనం
తీరాలను ముంచెత్తే అల్పపీడనం
ప్రాంగణంలో నిరాశానిస్పృహలు నాటి
జీవచ్ఛవాల్ని వదిలి పోయే
నిరర్థక నిష్క్రమణం
ఓదార్పు స్పర్శకే తలొగ్గే భూమిక
పలకరింపుకే పులకించిపోయే పాచిక
నిరాసక్త జీవిక
నమ్మకాన్ని తొక్కిపట్టే
గాలితిత్తి తండ్లాట
తలవంచితే తరలించుకుపోయే తొండాట.
———–