రేడియమ్ (Radium)

Share
పేరు (ఆంగ్లం)Radium
పేరు (తెలుగు)రేడియమ్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తికవి,
తెలిసిన ఇతర భాషలు
చిరునామాహైదరాబాద్ పాతనగరం
ఈ-మెయిల్
ఫోను9291527757
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరేడియమ్ కవిత : ఈటె
సంగ్రహ నమూనా రచనరేడియమ్ కవిత : ఈటె
ఓటు హక్కు ఉన్నా ఈటె విసరడం తెలియదు అంటూ రేడియమ్ రాసిన కవిత ” ఈటె ” ఇక్కడ చదవండి :
యుద్ధాల్లో మునిగి
పతనమైనదొకటి
యుద్ధాల్లో గెలిచి
నష్టపోయినదొకటి
ఆనాటి కట్టడాలు
బీటలు పోయిన కోటలు
నేడు దర్శనీయ స్థలాలు

 రేడియమ్

రేడియమ్ కవిత : ఈటె
ఓటు హక్కు ఉన్నా ఈటె విసరడం తెలియదు అంటూ హైదరాబాద్ పాతనగరం నుండి రేడియమ్ రాసిన కవిత ” ఈటె ” ఇక్కడ చదవండి :
యుద్ధాల్లో మునిగి
పతనమైనదొకటి
యుద్ధాల్లో గెలిచి
నష్టపోయినదొకటి
ఆనాటి కట్టడాలు
బీటలు పోయిన కోటలు
నేడు దర్శనీయ స్థలాలు…
నూతన విజ్ఞాన దారులు
మారిన ఆలోచన సరళి
ప్రజాస్వామ్యంతో మారిన మానవాళి
ఆర్థిక పునాదులే
ప్రభుత్వాలకు బలం
పునాదులే పేక ముక్కలైతే
పేదరికంలో దేశాలు…
అనాలోచిత
ఉచితాల ఉరితాళ్లు
ప్రభుత్వాల ఆర్థిక పతనాలు
గెలుపు కొరకు
ఎన్నికల ప్రణాళికలు
అమలు అమావాస్య చంద్రుడు…
ప్రజాప్రయోజనాలకు తిలోదకాలు
స్వలాభాలకు వెన్నెల దారులు
ఆస్తుల రక్షణకు కుర్చీ
రాజకీయం నేడు వ్యాపారం
ప్రజలు చూడ బానిసలు
రాచగబ్బిలాల పురాతన సంకేతాలు
రాతి గోడల్లో మొలచిన మఱ్ఱి వెర్రి
మెదళ్లో కుట్రల ముళ్ల దారులు…
ఓటు హక్కు ఉన్నా
ఈటె విసరడం తెలియదు
తెలిసిన నాడు
ఓడలు బండ్లు
Last Updated Oct 28, 2022, 11:52 AM IST
రేడియమ్ కవిత : మరోవేకువ – Asianet News Telugu
బెల్లం ముక్కిచ్చి పండుగ చేసుకోమంటే పథకాల రథచక్రాల కింద నలిగి పోయెదెవరు? అంటూ హైదరాబాద్ పాతనగరం నుండి రేడియమ్ రాసిన కవిత ఇక్కడ చదవండి :
ఉచితానుచితాలు సాగితే
ఉచితాలకు ఆర్థిక వ్యవస్థ
లంకాదహనం మైపోదా
బాగా కుడుములు తిన్నాక
అది వమనం కాకమానదు
పేరు గొప్పకు పోయి
ఊరు దిబ్బచేసుకుంటే
చరిత్ర విక విక నవ్వుతుంది
ప్రజా పాలనలో
పాలన తిరోగమనం పడుతుంది
ధరలు వామనునిలా పెరిగి పోయి
జనం బతుకు భారమై పోయి
పోరు బాట పడుతుంది
గెలుపు కొరకు ప్రజల డబ్బును
దారి మళ్లించడం
దారద్ర రేఖకు దిగువకు నెట్టడం
పాలన కాదు
మోసపూరిత లాలన
బెల్లం ముక్కిచ్చి
పండుగ చేసుకోమనడం
పథకాల రథచక్రాల కింద
నలిగి పోయెదెవరు?
నీరు నీరనుకుంటూ పోతే
డబ్బు నీరై పారిపోదా!
ఆత్మబంధువు అంటూ కూర్చుంటే
రొక్కం రూటు మారదా!
ఇంకెక్కడ పురోగతి
ఇక ప్రగతి అధోగతి
జనం నిజాన్ని నిలదీసినపుడు
కోటలు కూలిపోలేదా!
అందుకె అందుకే
వేకువను ఎవరు ఆపలేరు

———–

You may also like...