| పేరు (ఆంగ్లం) | P. Lakshman Rao |
| పేరు (తెలుగు) | పి.లక్ష్మణ్ రావ్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | కవి, అసిస్టెంట్ రిజిష్ట్రార్ ,సహకార శాఖ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | విజయనగరం |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | 9441215989 |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | గడ్డిపరక (కవితా సంపుటి) చిరుదీపం (నిత్య సత్యాలు కొంచెం నిప్పు కొంచెం నీరు గాజుముక్క (వచన కవిత్వం) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | విధ్వంసపు చరిత్ర గురించి, ఇంటి దొంగ గురించి, దిగులు మబ్బు గురించి, బాల్యం గురించి, పల్లె జనం గురించి, ఇలా తన చుట్టూ జరుగు దాని గురించి, సామ్రాజ్యవదం గురించి, గ్లోబల్ ఉక్కుపాదం గురించి ఈ కవి ఎంతో స్పృహలో ఉన్నాడు. ఇవన్నీ అతని కవితావస్తువులే. విషయ స్పష్టత ఉంది, లక్ష్య స్పష్టత ఉంది. ఇది దీర్ఘకాలిక సాధన అని తెలుసు. ఆగకుండా సాగుతున్న లక్ష్మణ్‌రావ్ గారికి, సాగుతున్న కవిత్వ చరిత్రలో ‘రుచి’ని కనుగొన్న లక్ష్మణ్‌రావ్‌గారికి అభినందనలు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అంతస్సూత్రం కవిత- పి.లక్ష్మణ్ రావ్ |
| సంగ్రహ నమూనా రచన | అంతస్సూత్రం కవిత- పి.లక్ష్మణ్ రావ్ |
పి.లక్ష్మణ్ రావ్
అంతస్సూత్రం కవిత- పి.లక్ష్మణ్ రావ్
****
మండుతున్న అగ్ని కొలిమిపై
భూతలాన్ని పెనంగా పెట్టి
చంద్రుడ్ని అట్టుగా
పోస్తుంది అమ్మ !
అట్టు మధ్య
చిన్నచిన్న రంధ్రాలే
చంద్రునితో జత కలిసే తారలు !
ముఖస్తంగా చంద్రుడు
వెన్నెలై మెరుస్తున్నా
క్రింద అమావాస్య చీకటి
దాగి వుందనేది నర్మగర్భం !
అట్టుని
అటూ ఇటూ తిరగేయడమే
శుక్ల పక్షం, కృష్ణ పక్షం !
ఓ చిన్నారీ !
వెన్నెల కురిపించే చంద్రునికే
చీకటి వెలుగులున్నట్లు
జీవితంలో
కష్టసుఖాలు సమానమే తండ్రీ !
నోరూరించే అట్టులోనూ
దాగివున్న రహస్యమదే!
ఒకవైపే వుంటే మాడిపోద్ది
రెండు వైపులా తిరగేస్తుంటేనే
రుచులు పంచుతాది !
పి.లక్ష్మణ్ రావ్
అసిస్టెంట్ రిజిష్ట్రార్
సహకార శాఖ
విజయనగరం
9441215989
———–