కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి (Kotla Venkateshwar Reddy)

Share
పేరు (ఆంగ్లం)Kotla Venkateshwar Reddy
పేరు (తెలుగు)కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిఉపాధ్యాయుడు , తెలుగు కవి, రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామామహబూబ్ నగర్
ఈ-మెయిల్
ఫోను94402 33261
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు1. నూరు తెలంగాణ నానీలు (నానీలు)
2. నాన్నా! నాలా ఎదుగు (దీర్ఘ కవిత)
3. మనిషెల్లిపోతుండు (వచన కవితలు)
4. గుండె కింద తడి (వచన కవితలు)
5. రహస్యాలు లేని వాళ్ళు (వచన కవితలు)
6. రంగు వెలసిన జెండా (వచన కవితలు)
7. హరితస్వప్నం
8. అంతర్వాహిని
9. మనుమసిద్ది
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1. తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం, “వివిధ ప్రక్రియలు” విభాగం, 2016 మే 12
2. 2019 కాళోజీ స్మారక పురస్కారం, తెలంగాణ ప్రభుత్వం, 2019 సెప్టెంబరు 9
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఇంటి దీపాలు వన దేవతల్లా… కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి
సంగ్రహ నమూనా రచనఇంటి దీపాలు వన దేవతల్లా… కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి

తోబుట్టువులంతా ఇంటికి వస్తే
బతుకమ్మ పండుగ నాడు
ఇల్లు ఇల్లంతా పూల వనమౌతుంది!
ఊరు ఊరంతా
ఊరేగే పూల జాతరవుతుంది!
ఇన్నాళ్ళూ సకల దేవతలనర్చించిన పూలన్నీ
పూజార్హతను పొందుతాయి

కోట్ల వెంకటేశ్వరరెడ్డి

ఇంటి దీపాలు వన దేవతల్లా…
తోబుట్టువులంతా ఇంటికి వస్తే
బతుకమ్మ పండుగ నాడు
ఇల్లు ఇల్లంతా పూల వనమౌతుంది!
ఊరు ఊరంతా
ఊరేగే పూల జాతరవుతుంది!
ఇన్నాళ్ళూ సకల దేవతలనర్చించిన పూలన్నీ
పూజార్హతను పొందుతాయి
ఒక్కో పూవు
ఒక్కో పాటై పరిమళిస్తది!
ఎవరింట చూసినా
అనుబంధాల లతలల్లుకొని ఉంటాయి
ఆడబిడ్డలంతా గౌరమ్మ పాటలు పాడుతుంటే
ఆత్మగౌరవ గీతాలాలపిస్తున్నట్లుంటాయి!
అదే పాత ఇల్లు
పెద్దక్క వచ్చాక దాని హోదా పెరిగింది
ఆ పూరి గుడిసె
చిన్న చెల్లె రాకతో
మురిపెంతో తుళ్లి తుళ్లి పడుతున్నది!
బాల్యమంతా రాశిపోసినట్లు
వాళ్ళున్నంత సేపు
వింత సోయగాలీనుతూ
అరమరికలు లేని ఆట స్థలమవుతుంది!
ఎవడన్నాడో మనుమాత్రుడు నోరుజారి
ఆడపిల్లల్ని ఎదమీది కుంపట్లని
చూడండి వాళ్ళే నిజమైన ఇంటి దీపాలు
విస్తరింపజేసే అనుబంధాల చలన గీతాలు!!


నాన్నా! నాలా ఎదుగు!
(దీర్ఘకవిత)
-కోట్ల వెంకటేశ్వరరెడ్డి
వెల: రూ.50/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
9440233261
**
నాన్నపై రెండు మూడు కవితా సంకలనాలు వచ్చాయి. వాటిల్లో కొన్ని కవితలు నాన్నను మరో కోణంలో చూపించినవి ఉన్నాయి. అయితే కోట్ల వెంకటేశ్వరరెడ్డి పూర్తిగా నాన్నని భిన్నంగా చూపించారు. అమ్మ నాన్నలపై సామాన్యంగా అనుకూలంగానే రాస్తారు. కోట్ల వారు మరో నాన్నను చూపించారు. కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవి, విమర్శకుడు.
‘కోట్ల పిల్లలను పిల్లల దృష్టిలో చూడమంటున్నాడు ఈ కవితలో’ అని ఎన్.గోపి అనటం నిజమే.
నిజానికి ఈ దీర్ఘ కవిత 2003లోనే వచ్చింది. ఇప్పుడిది ద్వితీయ ముద్రణ. అప్పటి కంటె ఇప్పుడే ఈ కవిత అవసరం కూడాను. పిల్లల ఇష్టాయిష్టాలతో పని లేకుండా తామే ‘అధినాయకుల’మని తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దే నాన్నలు ఎక్కువవుతున్న సమయమిది. ఈ దీర్ఘ కవిత
‘నాన్నా! నన్ను కంట కనిపెట్టండి
పెంచండి, పోషించండి
అంతేకాని నా కలలు కూడా మీరే కనకండి’
అంటూ ప్రారంభమవుతుంది. ఈ పంక్తులే కోట్ల కవితకు మూలాలు. ఎంసెట్, ర్యాంకులు, విదేశాలు.. ఇవే ఇవాళ్టి చాలామంది నాన్నల కలలు. ర్యాంకుల కలల ఆగ్నికి భావిభారత పౌరులు ఆహుతై పోతున్నారు.
‘డాలర్ల వేటలో మానవ సంబంధాల
ఎముకలు విరిగిన చప్పుడు వినిపించదు’
కవి వాక్కు అక్షర సత్యం కదా! మన కళలు, సంస్కృతి, ఆటపాటలు, ఆహారాలు అన్నీ తెరమరుగై ఎన్నారైలుగా పిల్లల్ని రోబో యంత్రాలుగా తయారుచేస్తున్నది నాన్నలే. నాన్నపై కోపం, కసి కనిపించదు. ఈ కవిత అమ్మాయి మాట్లాడినట్టుగా రాయటంవల్ల ఆర్ద్రత కలుగుతుంది.
‘నువ్వో బాలుడివై నాతో ఉండిపో’ ఎదగాలి నాన్నా ఎదగాలి. పిల్లలెత్తు ఎదగాలి’ అనే పంక్తులు కొంతమంది నాన్నలకి ఆర్యోక్తుల వంటివి. ఈ దీర్ఘ కవిత తెలుగుతోపాటు ఎ.రాజేంద్రబాబు ఆంగ్లానువాదం కూడా ఉంది. సరైన సమయంలో పునర్ముద్రణ పొందిన మంచి కవిత్వమిది.

———–

You may also like...