| పేరు (ఆంగ్లం) | Kandalai Raghavachar |
| పేరు (తెలుగు) | కందాళై రాఘవాచార్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | నిజామాబాద్ |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | 87905 93638 |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కవితలు: ఏకధార కవిత్వం చివరి పంక్తులు!? చెడగొట్టు గూడంత దీపం! |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కందాళై రాఘవాచార్య కవిత : చివరి పంక్తులు!? |
| సంగ్రహ నమూనా రచన | కందాళై రాఘవాచార్య కవిత : చివరి పంక్తులు!? |
కందాళై రాఘవాచార్య
కందాళై రాఘవాచార్య కవిత : చివరి పంక్తులు!?
చివరి పంక్తులు అంటే పతాక సన్నివేశమే అంటూ నిజామాబాద్ నుండి కందాళై రాఘవాచార్య రాసిన కవిత చివరి పంక్తులు !? ఇక్కడ చదవండి
ఇదేమి ? మొదలే చివరి పంక్తుల మాటలా !
ఏదో మూటంతా ఇప్పుడే విప్పి చూపినట్లు
నోట్లోని చివరి పంక్తులు ఎప్పుడూ
మేలు మేలుగా విలువైనవే —
రికార్డు చేసుకునేంత !
అంతిమ సమయంలో నత్తినత్తిగా
మాట్లాడినా చెవి యొగ్గి ఆశగా
వినాల్సిందే –‐–
తాత నిధి రహస్యం చెప్పవచ్చు
మీ తరతరాలు కుబేరులు కావచ్చు
చివరి మాటలు ఓర్పుగా వినాలి
అన్యమనస్కం ఎందుకు ???
ఉపాధ్యాయుడు పాఠం చివరగా
ఇంటి పని చెపుతాడు
వినకుంటే తెల్లవారి అరచేతుల
గోరింటాకు పండినట్లే
నూరు మార్కులు ఎలా వస్తాయి
విక్రమార్కుడవు ఎలా అవుతావు
కవితా పఠనంలో చివరి పంక్తులు అద్భుతంగా ముగుస్తాయి
జీవిత రహస్యం బట్టబయలు చేసినట్లు —
వినకపోతే కవి హృదయం ఎలా తెలుస్తుంది
కావ్యాల్లో అందుకే ఫలశృతులు
చివరి పంక్తులు అంటే
పతాక సన్నివేశమే —
మొదటి సంగతి అంతా
చివర్లోనే–
చితికాడనే మనిషి కీర్తి అపకీర్తి
డప్పు చాటి చెపుతారు
చివరి పంక్తులే బతుకున
చివరకు మిగిలి పోతాయి !!
Last Updated Oct 19, 2022, 12:38 PM IST
కందాళై రాఘవాచార్య తెలుగు కవిత: చెడగొట్టు
మనిషి చెడగొట్టు తానాన్ని కందాళై రాఘవాచార్య చక్కగా తమ కవితలో వివరించారు చదవండి.
అడవి పై వల వేసి
ఎడారిలో తప్పిపోతాడు ?!
* * *
నదులను ఆమ్లఆమ్లంచేసి
గుక్కెడు గుక్కెడు నీటికోసం
గుక్క పెట్టి ఏడుస్తాడు ?!
* * *
తెలివి మీరి
తన తల పై తానే
చేయి పెట్టుకుని
బూడిద బొమ్మై పోతాడు !?
* * *
మనిషి
పుట్వడిగా
ఎంత ఎంత గొప్పో
అంత చెడగొట్టు ?!
* * *
స్వర్గాన్ని
నరకం చేసుకుని –
కడాయిలో
జీవితాంతం ఈదుతుంటాడు !?
Last Updated Dec 3, 2020, 10:21 AM IST
గూడంత దీపం!
గుమ్మానికి కుడివైపు, ఎడమవైపు గూట్లో దీపాలు
గూట్లో దీపాలు ఇంటికి రెండు కన్నుల్లా చమక్ చమక్..
దీపాల వెలుగులో వాకిలంతా
కాంతితో కల్లాపి!
చీకటిని ఆదిమి పెట్టినట్లు దీపాలే దీపాలు
చీకటి అసురుని అంతానికి
ఈ దీపాలు వెలుగు జెండాలు
గూట్లో దీపాలకు రాత్రంతా జాగరణ పర్వం
కదులుతున్న జ్యోతులు వత్తి మీద కిరీటాలు
గూడంత దీపమే అయితేనేం
లోకానికంతా వెలుగుల పండగ
చిత్రం! అమాస నాడు వెలుగు అంగడి!
-కందాళై రాఘవాచార్య , 87905 93638
———–