| పేరు (ఆంగ్లం) | Aravinda (A.S. Mani) |
| పేరు (తెలుగు) | అన్నంరాజు సుగుణమణి ‘అరవింద’ (A.S.మణి) |
| కలం పేరు | ఏ.ఎస్.మణి ,‘అరవింద’ |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | దేశిరాజు సుబ్రహ్మణ్యం |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 14/04/1934 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | ఏలూరు |
| విద్యార్హతలు | గ్రాడ్యుయేట్ |
| వృత్తి | రచయిత్రి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | జెమ్షెడ్పూర్ |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | నవలలు :,అవతలి గట్టు,జలసూర్య, జీవనది, ఒక జడ అమ్మాయి ,”ప్రేమ మాతృక” అనే పిల్లల నవల,కథలు :,అరుంధతి అలక-జంట పువ్వు,అల్లుని మంచితనం,. ”అడవిపువ్వు” ,ఓ కప్పు కాఫీ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ”ప్రేమ మాతృక” అనే పిల్లల నవలకి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ రచయిత్రి బహుమతి, గృహలక్ష్మి స్వర్ణకంకణం, జ్యేష్ట లిటరరి అవార్డ్‌లేకాక ఆమె కథాసంకలనానికి రచయిత్రి ఉత్తమ గ్రంథం అవార్డు కూడా వచ్చింది. |
| ఇతర వివరాలు | పందొమ్మిది వందల అరవై నుంచీ ఎనభై వరకూ ప్రముఖ వార మాస పత్రికలు స్త్రీ రచయితలను ప్రోత్సహించడం ద్వారా తమ ప్రాచుర్యాన్ని పెంచుకున్నాయి. అది నవలల కాలం…విరివిగా వచ్చిన ఆ నవలలన్నీ ”పల్ప్” సాహిత్యంగా సాహిత్య విమర్శకులు పరిగణించడం వలన స్త్రీలు వ్రాసిన కొన్ని మంచి నవలలు కూడా ఆ వరదలో కొట్టుకుపోయాయి. అయితే అదే కాలంలో మంచి కథలు వ్రాసిన స్త్రీ రచయితలు వున్నారు. ఆనాటి స్త్రీల జీవితాలలోనూ ఆలోచనావిధానాలలోనూ వస్తున్న పరిణామాలనూ వారి ఆకాంక్షలనూ పట్టించుకుని వ్రాసిన వారున్నారు. అట్లా తన ఫార్మెటివ్ యియర్స్‌లోని సాంఘిక వాతావరణాన్ని, ఆ నేపథ్యంలో తనలో కుదురుకుంటున్న అభిప్రాయాలను చదివించే మంచికథలుగా మలచినవారిలో ”అరవింద” ఒకరు. స్వాతంత్య్రానికి పూర్వమే స్త్రీలని చైతన్యీకరించాల్సిన అవసరాన్ని భారతదేశం గుర్తించింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళకే ఆమెకు విద్యా ఉద్యోగావకాశాలకి తలుపులు తెరిచింది. అరవింద కథల్లో స్త్రీలు ఆలోచన కలవారు. తెలివైనవారు. ఆడవాళ్లు తమ భావాలను వ్యక్తం చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా వున్న రోజుల్లో కథారచన చేసిన అరవింద ఆడవాళ్ళు ముఖ్యంగా చదువుకుంటున్న యువతులు ఎట్లా వుండాలో ఆలోచించి వ్రాశారు. పురుషులుఎట్లా వుంటే బాగుంటుందో కూడా చెప్పారు. పేపర్ చదివి వ్రాయడం కాక తనకు తెలిసిన విషయాలనే వ్రాస్తాననే అరవింద కథలు వాస్తవచిత్రాలే కానీ అభూతకల్పనలు కానేకావు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అవతలి గట్టు- అరవింద (A.S.మణి) |
| సంగ్రహ నమూనా రచన | అవతలి గట్టు- అరవింద (A.S.మణి) జీవితమనే నదిలో ఈదుతుంటే అవతలిగట్టు చేరగలమా, మునిగిపోకుండా బయటపడగలమా అని మనిషి తల్లడిల్లిపోతాడు. అవతలి గట్టు చేరుకున్న వారంతా అదృష్టవంతుల్లాగ కనిపిస్తారు. జీవితంలో చవిచూడవలసిన కష్టాలూ, దుఃఖాలూ, మానసిక వేదనలూ అన్నీ చవిచూసి లీల ‘అవతలిగట్టు’ చేరుకున్నది. ఈ సుదీర్ఘమైన జీవనయాత్రలో ‘లీల’ అనే విద్యావంతురాలైన మహిళకు సున్నితమైన మానసిక సమస్యలు ఎదురైనాయి. శారద విచిత్ర ప్రవర్తన వెనుకగల బాధాయమ గాథ…. ప్రభు నిర్లిప్తత వెనుకగల గూఢ పశ్చాత్తాపము… రవిలో జ్వలించే విప్లవ జ్వాలలు…. లీల ఇన్నింటిని చూసింది. కొన్ని అనుభవాలు ఆమెలో ఆలోచనలను రేకెత్తించి విజ్ఞానజ్యోతిని వెలిగించాయి. |