శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు (Sri Kovvali Lakshmi Narasimharao)

Share
పేరు (ఆంగ్లం)Sri Kovvali Lakshmi Narasimharao
పేరు (తెలుగు)శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు
కలం పేరు
తల్లిపేరుకాంతమ్మ
తండ్రి పేరులక్ష్మీనారాయణ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ03-26-1905
మరణం27612
పుట్టిన ఊరుపశ్చమ గోదావరి జిల్లా తణుకు, ఆంధ్రదేశం
విద్యార్హతలుస్కూల్ ఫైనల్
వృత్తిరచయిత , నవలాకారుడు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం
చిరునామాద్రాక్షారామం , ఆంధ్రప్రదేశ్
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకొవ్వలి నవలలు కొన్ని , తానాజీ , మహేంద్రజాలం , జగజ్జాణ, మంత్రాలయ , మాయారంభ , చాటుమనిషి .
ఇతర రచనలుhttps://www.logili.com/home/search?q=Kovvali%20Lakshmi%20Narasimharao
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకొవ్వలికి మద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు మాన్యతా పత్రాలు (సర్టిఫికెట్స్ ఆఫ్ ఆనర్ ) ఇచ్చి గౌరవించింది.భారత ప్రభుత్వ విద్యాశాఖ కూడా వీరిని సముచితంగా గౌరవించింది
ఇతర వివరాలు‘‘కొవ్వలి’’ ఎవరూ? అని అడిగేవాళ్ళకి సమాధానం యీ పుస్తకం. ఇరవై అయిదేళ్ళవయసుకే నాలుగు వందల నవలలు, 35 ఏళ్ళ వయసుకి 600 నవలలు, జీవిత కాలంలో మొత్తం 1001 నవలల్ని రాసిన మహా రచయితని, నవలా సాహిత్య సార్వభౌముడ్ని సమీక్షించాలంటే ‘ఎవరికి సాధ్యం?Ñ మత్స్యయంత్రం అర్జునుడు మాత్రమే కొట్టాడు. శివధనుస్సు రాముడు మాత్రమే విరిచాడు. కొవ్వలిని డా. సుశీలమ్మ మాత్రమే సమీక్షించింది, ఇటు జీవితాన్ని ` అటు జగజ్జాణ నవలని.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవిషకన్య – శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు
సంగ్రహ నమూనా రచన
“దాహం – దా — హం — దా — హం ”
అనే ఆర్తనాదం వినేటప్పటికీ, శంభునాథుని గుండెలు ఘల్లుమన్నాయి. ఆ మాట లెక్కడనుంచి ? ఎవరున్నారు? భయంకరమైన యి కీకారణ్యంలో, మానవ సంచారంలేని ప్రశాంతవరణంలోంచి ఎక్కడనుంచబ్బా ఆ మాటాలు? శంభునాథుడు వెంటనే తన గుఱ్ఱము నాపూజేశాడు. అన్ని వైపులా పరకాయించాడు. ఎవరు కనిపించలేదు. కానీ తిరిగి అవే మాటలు –

 శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు
కొవ్వలి నవలలు కొన్ని

సామాన్య జనాన్ని రంజింప చేసిన 1000 నవలలను రూపొందించిన ప్రముఖ రచయిత, కర్మయోగి, నిరాడంబరుడు, సాహితీ తపస్వి శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1912లో పశ్చమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి కాంతమ్మ, తండ్రి ప్లీడరు గుమాస్తా వృతిని అవలంబించి రాజమహేంద్రవరానికి నివాసం మార్చుకున్నందున లక్ష్మీనరసింహారావుకు కూడా అదే స్వస్థలం అయింది. తల్లి చిన్నప్పుడే గతించడంవల్ల తండ్రే తక్కిన సోదరులతో పాటుగా ఆయనను పెంచి పోషించారు. 14 సంవత్సరాలు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. స్థానిక గ్రంధాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివారు. కొంతకాలం దేశ సంచారం చేశారు.
ఆనాటి సామాజిక, సాహిత్య పరిస్థితులను తీసుకొని శృంగారము, ప్రేమ మొదలగు వానిని జోడించి వ్యావహారిక భాషలో 2, 3 గంటల్లో చదవడానికి అనువైన నవలలను ముఖ్యంగా ‘కాలక్షేపపు నవలలు’ 1000 రాసి ‘వేయి నవలల కొవ్వలి’ అయ్యారు.
కొవ్వలి రచనలలో పైకి ప్రేమ, శృంగారం ఎక్కువగా కనబడినా సాంఘిక దురాచారాల నిర్మూలన, వితంతు వివాహోద్యమం, బాల్య వివాహ నిరసన, వృద్ధ వివాహాల అవహేళన, స్త్త్రి విద్య, కులమత విభేద నిర్మూలన ఇతివృత్తాలుగా వుండి సముచిత ఆదరణ పొందగలిగాయి. అంతేకాక అందరినీ ఆకట్టుకునే రీతిలో రసవత్తరంగా ముఖ్యంగా మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా తన రచనలను రూపొందించారు. ఆ రోజుల్లో (1940 లలో) ఆంద్ర సాహిత్య చదువరులకు చలువ పందిళ్లు కప్పించిన మహా రచయిత శ్రీ కొవ్వలి.
1940లలో శ్రీ కొవ్వలి పేరు ఊరూరా, వాడవాడలా చదువరులున్న ప్రతి ఇంటా జపించబడింది. ఆబాలగోపాలాన్ని ఆనంద డోలికల్లో ముంచి తేల్చింది.
యావత్ ప్రపంచంలోనూ 1000 నవలలు రచించిన ఖ్యాతి శ్రీ కొవ్వలికే దక్కింది.ఆయన రచనలను ఆదరించినంతగా ఆనాడు మరొకరి నవలలను ప్రజలు ఆదరించలేదు. చదువులను ఎగ్గొట్టి వారి నవలలు విస్తారంగా చదివిన ఆనాటి పసివాళ్ళల్లో ఈనాటి పెద్దలెందరో ఉన్నారు.
కొవ్వలికి మద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు మాన్యతా పత్రాలు (సర్టిఫికెట్స్ ఆఫ్ ఆనర్ ) ఇచ్చి గౌరవించింది.భారత ప్రభుత్వ విద్యాశాఖ కూడా వీరిని సముచితంగా గౌరవించింది.

విషకన్య

“దాహం – దా — హం — దా — హం “
అనే ఆర్తనాదం వినేటప్పటికీ, శంభునాథుని గుండెలు ఘల్లుమన్నాయి. ఆ మాట లెక్కడనుంచి ? ఎవరున్నారు? భయంకరమైన యి కీకారణ్యంలో, మానవ సంచారంలేని ప్రశాంతవరణంలోంచి ఎక్కడనుంచబ్బా ఆ మాటాలు? శంభునాథుడు వెంటనే తన గుఱ్ఱము నాపూజేశాడు. అన్ని వైపులా పరకాయించాడు. ఎవరు కనిపించలేదు. కానీ తిరిగి అవే మాటలు –
“దాహం – దా — హం — దా — హం “
ఏమి అర్ధంచేసుకోలేక, అతడు విభ్రాంతుడయినాడు. వేగంగా కొట్టుకొనే గుండెలతో , ఆ ధ్వనివస్తున్న ఆ ప్రాంతపు చెట్టువైపు తలనెత్తి చూచాడు . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

అపూర్వ చింతామణి
ఒకానొక అందగాడు, ఒక మహారణ్యంలో గుఱ్ఱం మీద శేరవేగoతో పోతున్నాడు. పొగా, పోగా, కొన్ని లతలు, పొదలు అడ్డమొచ్చాయి. గుఱ్ఱం ముందుకు సాగేందుకు వీలులేకపోయింది. నుఱగలు గుక్కుకుంటూ ఆగిపోయింది. గుఱ్ఱంమీద యువకుడు కిందకి దిగాడు. ఒరలోనించి కత్తి దూశాడు. అడ్డొచ్చిన లతలు, పొదలు తెగ నరికాడు. దారి చేశాడు. తిరిగి గుఱ్ఱంమీద కెగిరి కూర్చుని పరుగెత్తించాడు. మరి కొంతదూరం సాగాడు.
“అన్నా ! అన్నా !” యెవరో పిలవడం వినిపించింది. మనిషి సంచారంలేని ఆ మహారణ్యంలో తన్నేవరా అంత ఆప్యాయంగా పిలుస్తున్నారని తెల్లబోయాడు. గుఱ్ఱాన్ని నిలిపాడు. నలుదిక్కులూ పరకాయించాడు. ఒక గున్నమామిడి మీద రామచిలుక మాత్రం కనిపించింది. అదే – “అన్నా!అన్నా!” ముద్దుగా మల్లి పిలిచింది. గుఱ్ఱంమీద యువకుడు యెంతో మురిసిపోయాడు. తన గుఱ్ఱాన్ని అటు పోనిచ్చాడు.తీరా చిలకవున్న గున్నమామిడిచెట్టు సంపించటప్పటికీ, ఆ చిలుక కాస్తా అక్కడనుంచి తుర్రుమన్నది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు
-కొవ్వలి లక్ష్మీనరసింహారావు.

———–

You may also like...