వెనిగళ్ళ రాంబాబు (Venigalla Rambabu)

Share
పేరు (ఆంగ్లం)Venigalla Rambabu
పేరు (తెలుగు)వెనిగళ్ళ రాంబాబు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరురేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
విద్యార్హతలుఎంఏ-ఎంఫిల్-పీహెచ్‌డీ పట్టా
వృత్తిపాటల రచయిత, కవి. రేడియో వ్యాఖ్యాత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు• నిన్నే ప్రేమిస్తా – 2000
• సింహరాశి – 2001
• మీ శ్రేయోభిలాషి – 2007
• మనోరమ – 2009
• దేవరాయ – 2012
• ఈ మనసే – 2014
• రెడ్ అలర్ట్ – 2015
• రాజా చెయ్యి వేస్తే – 2016
• ఓ మల్లి – 2016
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు• ఉత్తమ గీత రచయిత – చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి (మీ శ్రీయోభిలాషి) 2007[6][7]

• భరతముని అవార్డు
ఇతర వివరాలుడి.రామానాయుడు నిర్మించిన ‘ప్రేయసి రావే’ సినిమాలో ‘తెంచుకుంటే తెగి పోతుందా దేవుడు చేసిన బంధం’ అనే పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు.[3] 2007లో వచ్చిన మీ శ్రేయోభిలాషి సినిమాలోని చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి అనే పాటకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నాడు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచిరునవ్వులతో బ్రతకాలి-వెనిగళ్ల రాంబాబు
సంగ్రహ నమూనా రచనచిరునవ్వులతో బ్రతకాలి-వెనిగళ్ల రాంబాబు
*సాకీ* :
ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా

*పల్లవి :*

*చిరునవ్వులతో బ్రతకాలి*
*చిరంజీవిగా బ్రతకాలి* (3)
ఆనందాలను అన్వేషిస్తూ
అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి ॥

వెనిగళ్ళ రాంబాబు


పాట *చిరునవ్వులతో బ్రతకాలి*
చిత్రం : *మీ శ్రేయోభిలాషి(mee Shreyobhilashi) (2007)*
రచన : *వెనిగళ్ల రాంబాబు(venigalla rambabu)*
సంగీతం : *కోటి(koti)*
గానం : *ఎస్.పి.బాలు(S.P.balu)*


*సాకీ* :
ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా


*పల్లవి :*


*చిరునవ్వులతో బ్రతకాలి*
*చిరంజీవిగా బ్రతకాలి* (3)
ఆనందాలను అన్వేషిస్తూ
అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి ॥


*చరణం : 1*


బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే
నింగినంటే ఎవరెస్టైనా
నేలనుండి మొదలౌతుంది
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
ఉరకలు వేసే కిరణం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి
చిరుదివ్వెలుగా వెలగాలి (2)
లోకం నిండిన శోకం తుడిచే
వేకువలా ఉదయించాలి
వెన్నెలనే కురిపించాలి ॥


*చరణం : 2*


ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి
అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి
కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా
మట్టితోటి అనుబంధాన్ని
చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్నా
అందరి బృందావనమే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి
శ్రీకారంలా బ్రతకాలి (2)
గతమంతా కనుమరుగవుతున్నా
నిన్నటి స్వప్నం నిలవాలి
నీ సంకల్పం గెలవాలి ॥


*చరణం : 3*


ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణుంటే
అద్భుతాలు నీ సొంతం
ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి
చిగురాశలతో బ్రతకాలి (2)
అంతిమ విజయం అనివార్యమని
ఆశిస్తూ నువు బ్రతకాలి
ఆశయాన్ని బ్రతికించాలి ॥


*చరణం : 4*


నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వె లుగుదా
నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి
వరదలా మృత్యువే తరుముతున్నా
ఆరని అగ్నిజ్వాలే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో
జీవించాలనుకోవాలి
నువు జీవించే తీరాలి ॥


*చరణం : 5*


విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు
విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు
చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే
అది అందేవరకు సహనంతో
సాగాలి పయనమే
అంతరాత్మ గొంతే నులిమి
శాంతి కోరుకుంటావా
అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా
అలజడే నిలువునా అలుముకున్నా
అలుపెరుగని చైతన్యం జీవితం॥

———–

You may also like...