రమా నెల్లుట్ల (Rama Nellutla)

Share
పేరు (ఆంగ్లం)Rama Nellutla
పేరు (తెలుగు)రమా నెల్లుట్ల
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12-01-1962
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుGraduate
వృత్తిCRO at Andhra Bank
తెలిసిన ఇతర భాషలు
చిరునామాఘనపూర్, తెలంగాణ
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttps://www.facebook.com/ramadevi.nellutla
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలురమా నెల్లుట్ల ఒక సాహితీ స్రవంతి , మాటలు, రాతలు హాస్యంగ రాయటం ఆమె కే చెల్లు. ఆమె ప్రతిభాపాటవాలు, సాహితీరంగంలో సుమాల మాల .
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబతుకమ్మ ‘ లో కొత్త కాలమ్ ‘ రమాయణం
సంగ్రహ నమూనా రచనఅమ్మ నన్ను రెండేళ్లు దాటి మూడో ఏడు రాగానే బడికి పంపించానని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇప్పుడంటే ప్లే స్కూల్స్ , ప్రి స్కూల్స్ , కిండర్ గార్టెన్లూ వచ్చాయి గానీ అరవైల్లో అందరూ ప్రభుత్వ బడుల్లో చదివిన వారే.
‘అయ్యో , అంత చిన్న పిల్లను అప్పుడే బడికి తోలుడు ఏంది ? అదేమన్న ఉద్యోగం చెయ్యాల్నా , ఊళ్లు ఏలాల్నా ?! ‘ అని మా నాయనమ్మ నన్ను కాపాడే ప్రయత్నం కొంత చేసిందట గానీ , మా నాన కూడా ఆమెకు సపోర్ట్ చేయకపోవడంతో ఫలితం లేకపోయింది .

 రమా నెల్లుట్ల

రోజటి 11 .09 .2022 నమస్తే తెలంగాణాఆదివారం అనుబంధంబతుకమ్మలో నా కొత్త కాలమ్రమాయణంమొదలయింది. వీలైతే చూడండి. ఫీచర్ ఎడిటర్ జనార్దన్ గారికి , సంపాదకులు తిగుళ్ల కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు !

1 . బడికి వెళ్లిన విధంబెట్టిదనిన :

అమ్మ నన్ను రెండేళ్లు దాటి మూడో ఏడు రాగానే బడికి పంపించానని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇప్పుడంటే ప్లే స్కూల్స్ , ప్రి స్కూల్స్ , కిండర్ గార్టెన్లూ వచ్చాయి గానీ అరవైల్లో అందరూ ప్రభుత్వ బడుల్లో చదివిన వారే.

అయ్యో , అంత చిన్న పిల్లను అప్పుడే బడికి తోలుడు ఏంది ? అదేమన్న ఉద్యోగం చెయ్యాల్నా , ఊళ్లు ఏలాల్నా ?! ‘ అని మా నాయనమ్మ నన్ను కాపాడే ప్రయత్నం కొంత చేసిందట గానీ , మా నాన కూడా ఆమెకు సపోర్ట్ చేయకపోవడంతో ఫలితం లేకపోయింది .

అలాగని నన్నేదో ఐఏఎస్ ఆఫ్ ఇండియా చేసెయ్యాలని కాదు, నా గోల భరించలేక సతాయింపుని కొద్దిసేపైనా ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసే గొప్ప ఆలోచనతో మా అమ్మ పథకం వేసి బళ్ళో అయితే కాస్త భయభక్తులతో నిశ్శబ్దంగా ఉంటానని అనుకుని ఉండొచ్చు.

నేను అల్లరి చేశానంటే పెద్ద రౌడీననుకునేరు. అస్సలు కాదు. పనికి రాని ప్రశ్నలు వేసేదాన్నట.

భూమి ఎందుకు నల్లగా ఉంది ? మరి చెట్లు అందులోంచే వచ్చాయి గదా .. ఇవి ఎందుకు ఆకుపచ్చగా ఉన్నాయి? ఆకాశాన్ని నిలబెట్టే స్తంభాలేవీ లేవు కదా .. ఆకాశం కింద ఊడిపడదా?’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఒకదాని వెనుక ఒకటి అడిగి విసిగిస్తూ ఉండేదాన్ననుకుంటా.

నా గోల పడలేకఎప్పుడో రోజు ఆకాశం ఊడి కింద పడుతుందిలే!’ అని చెప్పింది అమ్మ. ఇక చూసుకోండి , ప్రతి రోజూఅమ్మా ! ఆకాశం ఇవాళ కింద పడుతుందా, రేపా ? పొద్దున్నే పడుతుందా , సాయంత్రమా ?!’ అని మొదలు పెట్టేదాన్నట.

అంతే కాదు, నాకు ఆకలేస్తే ఏదో సారి అడిగి ఊరుకోకుండాఅమ్మా ! ఆకలి అయితుంది ! ‘

ఆకలి అగుచున్నది !” అవ్వా ! ఆకలైతాంది!’ ‘ అమ్మా! నాకు ఆకలేస్తోంది!’ అని నేను విన్న గ్రామ పంచాయితీ రేడియో పరిజ్ఞానంతో రకరకాల మాండలికాల్లో ( అప్పటికి మాట నాకు తెలియదు), ఒక్కొక్క మాడ్యులేషన్ లో సారి చొప్పున వెనక వెనక తిరుగుతూ అడిగేదాన్నట.

పాపం .. మై పూర్ మదర్ .. ఏం చేస్తుంది? ఉదయం అయిదు గంటలకు లేచిందంటే పని , పని , పనితోనే గడిచిపోయి రాత్రి పదింటికో పక్క మీద వాలేది. పెద్ద ఉమ్మడి కుటుంబం…..వచ్చేవాళ్ళూ, పోయేవాళ్లూ, మడిగా కొందరికీ , విడిగా కొందరికీవాళ్ళ రుచుల మేరకు , కోరికల మేరకు వండి వార్చడం , వడ్డించడం , ఇతర మర్యాదలు చేయడం తోనే గడిచిపోయేది.

ఇక వంట చేస్తున్నప్పుడు నేనిలా విసిగిస్తే , ఏం చెయ్యాలో తోచక కనీసం తన పనయ్యేదాకానైనా నా గోల తప్పుతుందని బడికి పంపి ఊపిరి పీల్చుకుని ఉంటుంది. మా అక్క ముందటి ఏడాది నుంచే బడికి వెళ్తుండేది.

మాకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు . పెద్ద సారూ , చిన్న సారూ ! పెద్ద సారు క్యాడర్ పెద్దది కాబట్టి మాకు పలక మీద ఓనమాలు చిన్న సారే పెట్టించేవాడు. ఆయనకు పెద్ద మీసాలు ఉండేవి. అవి చిన్నబుచ్చుకుంటాయనేమో ఎప్పుడూ దువ్వుతూ ఉండేవాడు. పిల్లలంతా ఈయనకి కూడా భయపడేవారు. నేను ఆయన అక్షరాలు పెట్టించగానే రెండు నిముషాల్లో దిద్దేసిఅయిపొయింది సార్!’ అంటూ పరిగెత్తేదాన్ని. ఆయనఅట్ల కాదమ్మా ! అక్షరాలు మొత్తం పలకంతా అయేదాక దిద్ది అప్పుడు రావాలె !’ అని చెప్పి మళ్ళీ మీసాలు దువ్వుకుంటూ ఉండిపోయేవాడు.

ఇట్లాగుందా నీ పని !’ అనుకుని నేను వాయువేగంతో అక్షరాల్ని పలకంతా అయ్యేలాగా ఒక టెక్నిక్ తో దిద్ది మళ్ళీ చూపెట్టేదాన్ని. ఆయన ఉక్రోషంగాగిట్ల దిద్దంగనె గాదు, సూడకుండ రాసుడు రావాలెఅనేవాడు. ‘ నాకు వొచ్చుఅనేదాన్ని నేను ధీమాగా.

ఏదీ , పలక తుడిపి తీస్కచ్చి నా ముంగట సూడకుంట రాయిఅనేవాడు అసహనంగా.

నాకేం భయం ! లేమిటివాటి తాతల్ని కూడా రాస్తానన్నట్లు అక్షరాలన్నీ చూడకుండా రాసిపడేసేదాన్ని. దిగ్భ్రాంతి చెందినవాడైఎప్పుడు నేర్చుకున్నవ్ ?’ అనేవాడాయన. మా ఇంట్లో వర్ణమాల పటం ఉందని ఆయనకి తెలియదు. ‘ నీకొస్తె అయిపాయెనా ? అందరికి రావొద్దా ?! సరే , పోయి కూచో !’ అనేవాడు ఇక ఏమనాలో తోచక .

అందరికీ రావడానికి నేనేం చెయ్యాలో తెలియక ..నేను నా జాగాలో వెళ్లి కూచుని క్షణాల్లో గోడకానుకుని గాఢనిద్రలోకి జారుకునేదాన్ని. కొద్ది సేపటికి గమనించిఅరేయ్ తుకారాం, అమ్మాయిని వాళ్ళింట్ల దింపి రారా!’ అని సార్లు చెప్పేవారు. తుకారాం , అక్కయ్య అనే ఇంకో అబ్బాయి నా పాలిటి మగ దేవతలు . నాల్గో తరగతిలో ఉండేవారు గానీ చాలా పెద్దవాళ్ళు. బహుశా వాళ్ళు ఇళ్లల్లో నాలాగా ప్రశ్నలు వేసే వాళ్ళు కారేమోవాళ్ళిద్దరి తల్లులూ చాలా ఏళ్ల వరకూ బడికి పంపలేదనుకుంటా.

ఎక్కువసార్లు తుకారాం నన్ను భుజం మీద వేసుకుని , చేతిలో నా పలకా, నేను ఇంటినుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న చిన్న చాపా తీసుకొచ్చి మా ఇంట్లో దింపేవాడు . నాకు జ్ఞానం వచ్చిన చాలా ఏళ్లకు ఎలాగైనా తుకారాం ఋణం తీర్చుకోవాలని ప్రయత్నించాను. ఏదో ఊర్లో బియ్యం గిర్నీలో బస్తాలు మోస్తూ హమాలీ పని చేస్తున్నాడన్నారు గానీ , అతడు ఎక్కడున్నాడో తెలియలేదు.

———–

You may also like...