రమణ వెలమకన్ని (Ramana Velamakanni)

Share
పేరు (ఆంగ్లం)Ramana Velamakanni
పేరు (తెలుగు)రమణ వెలమకన్ని
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తికవి, విమర్శుకుడు, నటుడు, సమీక్షకులు
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ చీఫ్‌ మేనేజర్‌ ప్రధాన వృత్తి నుంచి పదవీ విరమణ చేసినారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను9866015040
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతన తొలి సంకలనాన్ని ప్రత్యక్ష్యదైవం అమ్మతో ఆరంభించారు,రెం డో సంకలనం ‘నా చిరునా మా’ పేరుతో వెలువరిం చారు.,గుర్తింపు తెచ్చిన కవిత ‘లొల్లి’,ఖమ్మం కథలు పై సమీక్ష ,ఇప్పటి వరకు దాదాపు 200 పుస్త కాలపై ఆయన సమీక్షలు రాశారు. ఇంకా రాస్తున్నారు. చాలా పత్రికల్లో అవి ప్రచురితమ వుతున్నాయి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుమచిలీపట్నం ఆం ధ్రసారస్వత సమితి ఇచ్చిన పురస్కారం తన జీవితంలో మరిచిపోలేనిది అన్నారాయన. జగి త్యాలలో బావేరా సాహిత్య అవార్డు, బాసరలో మూఢా నాగభూషణ్‌ గుప్తా సాహిత్య పురస్కా రం తీసుకున్నారు. కిరణ్‌ సాంస్కృతిక సమా ఖ్య, విజయవాడ మానస ఆర్ట్స్‌, తేజ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌, వంశీ విజ్ఞాన సంస్థల ద్వారా పలు పురస్కారాలు స్వీకరించారు. వేద చంద్రయ్య సాహితీ పురస్కారం పొందారు.
ఇతర వివరాలుప్రముఖ కవి సి.నారాయణ రెడ్డి రాసిన పుస్తకంపై రమణ రాసిన సమీక్ష ఆయనను మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నక్సలైట్లపై రాసిన రంగవల్లి అనే పుస్తకంపై రాసిన సమీక్ష పలు పత్రికల్లో ముద్రితమై చక్కటి గుర్తింపు తె చ్చిపెట్టింది. ఇప్పటి వరకు దాదాపు 200 పుస్త కాలపై ఆయన సమీక్షలు రాశారు. ఇంకా రాస్తున్నారు. చాలా పత్రికల్లో అవి ప్రచురితమ వుతున్నాయి.
కవిగా ..
కవిగా ఆయన రాసిన ‘లొల్లి’ అనే కవిత విశేషమైన పేరు తెచ్చిపెట్టింది. ఒక కవితకు ఇంత స్పందన ఉంటుందా అని దీనితోనే తన కు తెలిసివచ్చిందని చెప్పారాయన. ఎక్కువగా కవితలే రాస్తారు. నవతెలంగాణ, వార్తా, ఆం ధ్రప్రభ, నేటినిజం, నెలవంక, నెమలీక అనే పత్రికలకు కవితలు, సమీక్షలు రాస్తున్నారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆ క్షణం…- రమణ వెలమకన్ని
సంగ్రహ నమూనా రచనఆ క్షణం…- రమణ వెలమకన్ని

కారణం ఏదయినా
ప్రాణం తీసుకొంటే ఎలా?
అనుకున్నవి సిద్ధిస్తే
ఆస్వాదించడమేనా?
అనుకోనివి సంభవించినా… స్వీకరించాలిగా!

రమణ వెలమకన్ని

ఆ క్షణం…

కారణం ఏదయినా

ప్రాణం తీసుకొంటే ఎలా?

అనుకున్నవి సిద్ధిస్తే

ఆస్వాదించడమేనా?

అనుకోనివి సంభవించినాస్వీకరించాలిగా!

విజయం అధిరోహించడమేకాదు

అపజయం అధిగమించడమూ తెలియాలి

జీవన గమనంలో

సమస్యా ముగింపు కాదుమలుపు మాత్రమే

యిదే ముగింపు అని ఆగిపోతే

దారులన్నీ ఊపిరి ఆడనంత చిరాకులు.

వేటు పడితే ఓడిపోవడం కాదు

ఆగిపోవడం అంతకన్నా కాదు

గెలుపుకోసం పరుగెట్టడం

ఈసారైనా లక్ష్యాన్ని ఒడిసి పట్టుకోవడం

విశ్వవిజేతలంతా

ఓటమి సంకెళ్ళు ఛేదించుకున్నవాళ్ళే!!

ఏదో లేదనీయింకేదో కావాలనీ

అన్నీ ఉన్నవాడిదే ఆరాటం.

వికలాంగులది కేవలం అంగవైఫల్యం

మరినీదోభావవైకల్యం

హత్య పాపమయితే

ఆత్మహత్య మహా పాపం

కన్నవారికి కడుపు శోకం రగిల్చి

నమ్ముకున్న వారికి నరకం మిగిల్చి

సాధించాల్సింది మధ్యలోనే వదిలేసి

పిరికిపందలా చరిత్రలో మిగిలిపోతే

జన్మకు సార్థకత ఏదీ?

చరిత్ర పుటల్లో నీకు చోటేదీ?

నాకు తెలుసు

నిముషంలో నీకు కావలసింది ఓదార్పు

ఒక ఆత్మీయ సాంత్వనం

చల్లని పలుకునేనున్నానే భరోసా?

తెలియాల్సిందల్లా

క్షణం దాటేస్తే

దారుణం ఆగేది…. మరణం తప్పుకునేది!!

రమణ వెలమకన్ని, 9866015040

———–

You may also like...