మందలపర్తి కిషోర్ (Mandalaparti_Kishore)

Share
పేరు (ఆంగ్లం)Mandalaparti_Kishore
పేరు (తెలుగు)మందలపర్తి కిషోర్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిరచయిత, కవి, అనువాదకులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను8179691822
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీ కే ఎన్ వై పతంజలిగారి గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , ‘మోటు మనిషి ‘, ‘తోటి వేటగాళ్లు ‘, ‘సీతమ్మ లోగిలి ‘ కథలపై విశ్లేషణలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు. మొదటి భాగం ‘కన్యాశుల్కం పలుకుబడి’. ఆ నాటకానికి సంబంధించిన స్ధానిక, కాలిక, భాషా విశేషాలను ఇందులో సమకూర్చేందుకు ప్రయత్నించాను. గురజాడ కవితలూ, కథలూ, వ్యాసాల్లోని భావార్థ విశేషాలను రెండో భాగంలో సమకూరుస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు అనేక గ్రంథాలు గొప్పగా ఉపయోగపడ్డాయి. ఆయా గ్రంథాల రచయితలు, కూర్పరులు, ప్రచురణకర్తలకు కృతజ్ఞతలు. – మందలపర్తి కిషోర్‌
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకవన వాంగ్మూలం- మందలపర్తి కిషోర్
సంగ్రహ నమూనా రచనకవన వాంగ్మూలం- మందలపర్తి కిషోర్

 మందలపర్తి కిషోర్

పచ్చని పూలతోట కాలుతున్న కమురుకంపు –
తాతలు, తండ్రులు కట్టుకున్న తాటాకు లోగిలి
తగలడిపోతున్న వాసన!
కట్టుబట్టలతో వీధినపడిన కుటుంబం –
గొంతులో గరగరమంటున్న గరళం!
ఆదర్శాన్ని అపహాస్యం చేస్తోన్న అసహనం-
అడుగడుగునా అంగుష్ఠమాత్రుల వీరవిహారం!
నాగరికత గొందుల్లో నగ్నంగా నర్తిస్తున్న
నడిమితరగతి నలికెల పాములు!
సరిహద్దుల్లో సంపాతి ఎదురుచూపులు –
శవపేటికల కోసం తెగిపడుతున్న దేవదారు వనాలు!
కన్నులు కరిగి కురుస్తున్న కరి మబ్బులు-
కారుచీకటిలో నూలుపోగు నెలవంక!
ఎవరో అన్నట్టు,
పగలడానికేగా ఉంది ఈ పాపిష్టి గుండె!
రాయని మాటలే కన్నీటి మూటలు!!
ఏ మాటకామాట –
ఎగసిపడే మంట ఎంతోసేపుండదు!
అనుకుంటాం గానీ,
ఇన్ని దారుణాలు తట్టుకుని
బతికిబయటపడిన హృదయం కన్నా
ఇనుమూ, ఉక్కూ ఇంకేముంటాయి?
– మందలపర్తి కిషోర్, 8179691822

———–

You may also like...