పొట్లూరి మోహన రామ ప్రసాదు (Potluri Mohana Rama prasad)

Share
పేరు (ఆంగ్లం)Potluri Mohana Rama prasad
పేరు (తెలుగు)పొట్లూరి మోహన రామ ప్రసాదు
కలం పేరు
తల్లిపేరుఅన్నపూర్ణాదేవి
తండ్రి పేరుకృష్ణమూర్తి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలంలోని తెన్నేరు
విద్యార్హతలువాణిజ్య శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశాడు. పూణే విశ్వవిద్యాలయం నుండి 1987 లో లా డిగ్రీ ని పొందాడు.
వృత్తితెలుగు కవి, కథా రచయిత, న్యాయవాది. ప్రధానంగా హైకూ కవి
తెలిసిన ఇతర భాషలు
చిరునామావిజయవాడ
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమా ఊరు ఒక హైకూ[1] మా బడిలో హైకూలు[2], పూల రేకులు[3], తనేను[4] అను నాలుగు హైకూ సంపుటాలు వెలువరించాడు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఈ హైకూల రచనాకాలం 1995. ఈ పుస్తకం అట్లూరి రాజ మనోహరం అట్లూరి రాజగోపాల రావులకు అంకితమివ్వబడినది. ఈ పుస్తకానికి శ్యామ్ కుమార్ కర్రి ముఖచిత్రం వేశాడు. ఈ పుస్తకానికి కవిత్వం తొడుక్కున్న ఊరు_కనురెప్పల నిశ్శబ్దమోహనరాగం అంటూ ప్రముఖ విమర్శకులు, ఆంగ్లాచార్యులు, పత్రికా సంపాదకులు డాక్టర్ సశ్రీ ముందుమాట రాశాడు. ఇందులో కొన్ని హైకూలు “చింత తోపుల్లోంచి/ చందమామని చూస్తే/మా ఊరు కనిపిస్తుంది”, “ఊళ్లో రైలు ఆగేది/ఎక్కింది దిగింది/లెక్కేలేదు”, “జడలాగినమ్మాయిని/మా ఆవిడకి చూపించా/ఇద్దరూ నవ్వుకున్నారు”.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికహైకూలు-పొట్లూరి మోహన రామ ప్రసాదు
సంగ్రహ నమూనా రచనఈ పుస్తకంలోని హైకూలు 1995 1996 కాలంలో రచించబడినవి. ఇందులోని కొన్ని హైకూలు…”మా బడికెళ్ళా/వేసిన గోడకుర్చీ/కనిపించలేదు”, “మాబడికెళ్ళా/బెంచీల మీద పేర్లు/చెరగలేదు”, “బడి గుర్తొస్తే/సిరామరకలన్నీ/గుర్తుకొస్తాయి”.

పొట్లూరి మోహన రామ ప్రసాదు

పొట్లూరి మోహన రామ ప్రసాదు
హైకూలు

చింత తోపుల్లోంచి
చందమామని చూస్తే
మా ఊరు కనిపిస్తుంది

ఊళ్లో రైలు ఆగేది
ఎక్కింది దిగింది
లెక్కేలేదు

జడలాగినమ్మాయిని
మా ఆవిడకి చూపించా
ఇద్దరూ నవ్వుకున్నారు
మా బడిలో పొట్లూరి మోహన రామ ప్రసాద్ చినుకు పబ్లికేషన్స్ విజయవాడ సెప్టెంబర్ 2020
ఈ పుస్తకంలోని హైకూలు 1995 1996 కాలంలో రచించబడినవి.

ఇందులోని కొన్ని హైకూలు
మా బడికెళ్ళా
వేసిన గోడకుర్చీ
కనిపించలేదు.

మాబడికెళ్ళా
బెంచీల మీద పేర్లు
చెరగలేదు.

బడి గుర్తొస్తే
సిరామరకలన్నీ
గుర్తుకొస్తాయి

పూల రేకులు-పొట్లూరి మోహన రామ ప్రసాదు- చినుకు పబ్లికేషన్స్ విజయవాడ ఫిబ్రవరి 2021

ఈ పుస్తకానికి ముఖచిత్రం శ్యామ్ కుమార్ కర్రీ వేశాడు. హైకూ మోహన సమ్మోహనం పూలరేకులు అంటూ చిత్తలూరి సత్యనారాయణ ఈ పుస్తకానికి ముందుమాట రాశాడు.

అందులోని కొన్ని హైకూలు
బంతి చేమంతి
తోటలోనే రాలాయి
కోయలేదుగా

వానచినుకు
కొమ్మల మీద పడి
పువ్వులైనాయి.

నల్లని మబ్బు
తోటమీంచి వెళుతూ
పూలనిచ్చింది.

తనేను – పొట్లూరి మోహన రామ ప్రసాద్-చినుకు పబ్లికేషన్స్ విజయవాడ ఆగస్టు 2021

ఇందులోని కొన్ని హైకూలు
ఆమె వెళ్ళింది
కొన్ని అక్షరాలని
కవిత చేసి

ఆమె లేకుంటే
ప్రపంచమే లేదుగా
ఉన్నా అంతేగా

తోటలో పూలు
పూస్తున్నా రాలవేంటి
ఆమె వచ్చిందా?

———–

You may also like...