| పేరు (ఆంగ్లం) | R Karnakar |
| పేరు (తెలుగు) | కర్ణాకర్ ఆర్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఈ నేలన ఓటు కావాలే… ఓటుకు నోటు కావాలే: రాజ్యమా మన్నించమ్మా |
| సంగ్రహ నమూనా రచన | రేపటి రోజున నువ్వు ఏ రోడ్డు పక్కనో వీధి అంచునో చెత్త కుప్పలనో తలకిందులుగానో శిథిల రూపంగానో కనిపించవచ్చు… అలా జరిగిన చోట మమ్మల్ని మన్నించమ్మా |
ఆర్. కర్ణాకర్
ఈ నేలన ఓటు కావాలే… ఓటుకు నోటు కావాలే: రాజ్యమా మన్నించమ్మా అంటూ కర్ణాకర్ కవిత
రాజ్యమా… మన్నించమ్మా… ఒక నాడు నీవు మా అస్తిత్వ పతాక నేడు మరో ఝండా రెపరెపలకి ముందస్తు ప్రయోగ నాళిక… అంటూ జమ్మికుంట నుండి ఆర్. కర్ణాకర్ రాసిన కవిత “రాజ్యమా…మన్నించు… !! ” ఇక్కడ చదవండి
రేపటి రోజున నువ్వు
ఏ రోడ్డు పక్కనో
వీధి అంచునో
చెత్త కుప్పలనో
తలకిందులుగానో
శిథిల రూపంగానో
కనిపించవచ్చు…
అలా జరిగిన చోట మమ్మల్ని మన్నించమ్మా
ఈ నేలన… ఓటు కావాలే…
ఓటుకు నోటు కావాలే
చీర కావాలే
సారె కావాలే
ముక్క కావాలే సుక్కా కావాలే
బ్రాండైన బ్రాందీ సారా కావాలే
కులం మతం వర్థిల్లనీకీ
భవనాలు కావాలే
పెద్ద పెద్ద బాసన్లు కావాలే
నేడు నువ్వు కావాలే
నీ వెనకాలే నేనూ…
నా ఝండా -ఎఝండా ఎగరాలే
రాజ్యమా… మన్నించమ్మా…
ఒక నాడు నీవు మా అస్తిత్వ పతాక
నేడు మరో ఝండా రెపరెపలకి
ముందస్తు ప్రయోగ నాళిక…
దేశమా మన్నించమ్మా ….
కరుణాకర్. ఆర్ కవిత: ఔ.. ఇంతకేమంటావు మరీ..?
బంధం భాంధవ్యాలు ఎంత లోతైనవో కవి కర్ణాకర్. ఆర్ రాసిన ఈ కవితలో చదవండి
బంధం భాంధవ్యాలు
మొక్కజొన్న లేత కంకిపైవాలిన పక్షులలాంటివి..!
అందం ఆస్తీ
అమాయకపు మనిషి
నిలువెళ్ళా పసిడివేసుకుని
కిరాతక దొంగలగుంపునకి
ఎదురెళ్ళడంలాంటిది..!
కోపం నవ్వూ
మనసులుకలవని
ఆలుమగల సంసారంలాంటివి..!
ప్రణయం
బతుకు ప్రళయంముందు
కూని రాగంలాంటిదే..!
సర్కారు ఉద్యోగం
పెద్దపాలేరు…చిన్నపాలేరు
ఏలే రాజుల కనుసన్నల్లో ఆడే
నెల జీతపు బసువన్నబతుకు..!
కాంట్రాక్టు నౌకరీ
పొద్దుగుత్తకి పోయే
దినసరి కైకిలి లాంటిది..!
ఊపిరీ -జీవితం
కరోనా కౌగిలిలో
శతాయుష్మాన్ భవ అనుకుని
భ్రమపడడం లాంటిది..!
గడిచిన గడియలో
ఒక నిముష కాలం లాంటిది..!
బతుకెంతో బరువైనదే
దానికిమించిన బాధ్యతైనది కూడా..!
———–