కంచరాన భుజంగరావు (Kancharana Bhujangarao)

Share
పేరు (ఆంగ్లం)Kancharana Bhujangarao
పేరు (తెలుగు)కంచరాన భుజంగరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుబడగాం గ్రామం, నందిగాం మండలం, శ్రీకాకుళం జిల్లా
విద్యార్హతలుB.Sc.,B.Ed,M.A.(English), M.A.(Telugu)
వృత్తిఅధ్యాపక వృత్తి , కవిత్వం ప్రవృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను94 41 58 96 02.
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువీరి ప్రచురితమైన రచనలు: వలస పక్షుల విడిది – తేలినీలాపురం (2005), కొంగా! నా గోరు మీద పువ్వెయ్యవా… (నానీ సంపుటి) (2010). వీరి కవితలు అన్ని ప్రముఖ తెలుగు దిన,వార,మాస పత్రికలలోనూ,ఈమాట, లోగిలి, తంగేడు, నిత్య, కొలిమి, మాలిక,సంచిక,దిక్సూచి వంటి ఆన్లైన్ (వెబ్) మ్యాగజైన్స్ లోనూ ప్రచురితమైనాయి. మరికొన్ని పాటలు కూడా ప్రాచుర్యం పొందాయి. ఆలిండియా రేడియో, విశాఖపట్నం కేంద్రం నుండి యువవాణి కార్యక్రమంలో కథానిక, కొన్ని కవితలు ప్రసారం అయ్యాయి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుపూర్వ విద్యార్థి సంఘం,బారువ వారి కవితా బహుమతి (2000),ప్రముఖ సంఘ సేవకులు శ్రీ బి.యస్.శాస్త్రి పేరిట బహుమానం (2001),కళాలయ కవితా పురస్కారం, పాలకొల్లు (2014),కళామిత్ర మండలి, ఒంగోలు వారి దశమ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిభా పురస్కారం పొందారు.
ఇతర వివరాలు. ఒకరు నేర్పిస్తే నేర్చే విద్య కాదు కవిత్వ రచన. కవి ఒక అరాచక స్థితిని పొంది; ఆ దుఃఖాన్ని తట్టుకోడం కోసం పదాలలో, ఓ వేట ప్రారంభిస్తాడు. ఈ కవితలో ఒక నిర్దిష్ట తడుములాట కనిపిస్తుంది. ఒక గొప్ప కవిత ఎలా సాధించాలో, ఎలా రాయాలో ఈ కవితలో ప్రతి పద్య పాదం నిరూపిస్తున్నది. పద్యంలో అన్ని పాదాలు చాలా గొప్పగా కవి అల్లిక చేశాడు. ఇది అనితర సాధ్యమైన ఒక గొప్ప ఉత్కృష్ట ప్రయోగ రీతి. కవి గార్కి అందుకు ముందుగా దణ్ణం పెడుతున్నాను
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఉదాహరణనౌతా!- కంచరాన భుజంగరావు
సంగ్రహ నమూనా రచనఉదాహరణనౌతా!
నాలోకి నేను పొలమారుతూ
ఒక నిత్య విశేషాన్ని తర్కిస్తాను
విత్తుకు సత్తువనిచ్చీ, మొక్కకు ప్రాణంపోసే
ఒక రచనా వ్యాసంగాన్ని గమనిస్తాను
దృశ్యాదృశ్య సౌందర్య పోషకమైన
మట్టి దృష్టాంతమేమిటోనని శోధిస్తాను
మనసున్న మన్ను..
మనిషిపై చిలికే మమత గురించి
పదాల ప్రయోగశాలలో అనియతంగా పరీక్షిస్తాను.

కంచరాన భుజంగరావు

ఉదాహరణనౌతా! – కంచరాన భుజంగరావు
నాలోకి నేను పొలమారుతూ
ఒక నిత్య విశేషాన్ని తర్కిస్తాను
విత్తుకు సత్తువనిచ్చీ, మొక్కకు ప్రాణంపోసే
ఒక రచనా వ్యాసంగాన్ని గమనిస్తాను
దృశ్యాదృశ్య సౌందర్య పోషకమైన
మట్టి దృష్టాంతమేమిటోనని శోధిస్తాను
మనసున్న మన్ను..
మనిషిపై చిలికే మమత గురించి
పదాల ప్రయోగశాలలో అనియతంగా పరీక్షిస్తాను.
నాలోని దిగుడుబావిలోకి దిగుతూ ఎక్కుతూ
ఒక వర్తమాన ఋణగ్రస్తతను తలపోస్తాను
చావుని హత్తుకుంటున్న అనివార్యత వద్ద
దాని దయనీయతకు కారణాలు వెదికి చూస్తాను
మట్టి గుండెలో పొగిలే సమకాలీన సాగు దుఃఖాన్ని
ముల్లిపికంపలు మొలిచిన అప్పుల సాలుల్లో
కవి పదానికీ, రైతు పాదానికీ మధ్య వలపోస్తాను
నింగికన్నూ,నీటికన్నూ నడుమ వరదగుడిలో
ఒక్కోసారి నీలిగ్రహమవుతాను
ఒక్కోసారి హరిత గృహమవుతాను
కన్రెప్పల మేఘాన్నై నాలోకి నేను వర్షిస్తాను
ఆకురాలు కాలం ఆఖరవ్వని రుతువులో..
పొలానికి మళ్ళే చెమటవాన లాంటి
కుర్ర కాలవలేవీ కనిపించవేమని దిగులవుతాను
ఎడారుల్ని పరిమార్చే మట్టిమడుగు
తడి పిడికిళ్ల గురించి
ఇసుక రేణువుల అంతరంగాలను ఆరాపడతాను
ఎవరూ పోని దారిలో కొత్తగా కురిసే
ఒక తొలకరి పరిణామాన్ని ఊహిస్తాను
నింగి అంతర్గ్రుహం నుండి
నేల అంతరిక్షం వరకూ
నాగలి ఉనికిని వెతుక్కుంటాను
జీవనిర్జీవ సంపదల్ని పదిలంగా దాచి ఉంచిన
మట్టి మహాపేటిక రహస్యాలను గాలిస్తాను
పరిశీలించిన ప్రతిచోటా..
పరిశోధించిన ప్రతిసారీ..
బ్రతుకు భూమిక మట్టేనన్న గ్రహింపుకొస్తాను
ఏ నాగరికతల వికాస వేదికయినా మన్నేనని
నిరంతరాయంగా ఎలుగెత్తుతాను
తడి స్పర్శకు పులకల మొలకయ్యే తల్లితనానికి
నన్ను నేను ఒక ఉదాహరణగా మలచుకుంటాను.
– కంచరాన భుజంగరావు

———–

You may also like...