శాంతి నారాయణ (Santhi Narayana)

Share
పేరు (ఆంగ్లం)Santhi Narayana
పేరు (తెలుగు)శాంతి నారాయణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/7/1946
మరణం
పుట్టిన ఊరుఅనంతపురం జిల్లా, బండమీదపల్లె గ్రామం
విద్యార్హతలుఎం.ఎ., పి.హెచ్.డి
వృత్తిప్రముఖ రచయిత.
తెలుగు పండితుడిగా రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదకొండు సంవత్సరాలు పనిచేసి అదే కళాశాలలో మరో పది సంవత్సరాలు జూనియర్ లెక్చరర్‌గా పనిచేశాడు. తరువాత పదోన్నతి పొంది అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1992 నుండి 2001వరకు పనిచేశాడు. 2001లో కొంతకాలం ప్రిన్సిపాల్‌గా సేవలను అందించాడు. 2001 సెప్టెంబరు నుండి అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి 2004 జూన్ 30వ తేదీన పదవీవిరమణ చేశాడు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు1. కళ్యాణవాణి (ఆశావాది ప్రకాశరావు వివాహసందర్భంగా వెలువడిన ప్రత్యేక సంచిక) (సంపాదకత్వం)
2. కొండచిలువ (కథల సంపుటి)
3. ఇనుపగజ్జెల తల్లి (కథల సంకలనం) (సంపాదకత్వం)
4. నమ్ముకున్న రాజ్యం (కథల సంపుటి)
5. నాగలకట్ట సుద్దులు (వార్త దినపత్రికలో ఫీచర్)
6. పల్లేరు ముళ్లు[2] (కథల సంపుటి)
7. రక్తపు ముద్ద పిలిచింది (కథల సంపుటి)
8. వొరుపు (కవితా సంకలనం) (సంపాదకత్వం)
9. రస్తా (కథల సంపుటి)
10. పెన్నేటి మలుపులు (నవల)
11. నడిరేయి నగరం (కవితా సంపుటి)
12. అనంత కథావికాసం (పరిశోధన)
13. జక్కన విక్రమార్క చరిత్ర – సమగ్ర పరిశీలన (పరిశోధన)
14. మాధురి (నవల)
15. ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://kathanilayam.com/writer/1047
పొందిన బిరుదులు / అవార్డులు• 1997 – శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారిచే సన్మానం
• 1999 – విశాల సాహితి అవార్డు[3]
• 2000 – అనంత ఆణిముత్యం అవార్డు
• 2000 – స్వర్ణభారతి సాహితీ పురస్కారం
• 2003 – మాతృభాషాపురస్కారం
• 2003 – కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం[4].
• 2009 – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభాపురస్కారం మొదలైనవి.
ఇతర వివరాలుఇతని నవల పెన్నేటి మలుపులు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తరగతులకు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది.
ప్రాంతాలలో 1978 వరకు సుమారు 12 అష్టావధానాలు చేశాడు. భువనవిజయ సభలలో అయ్యలరాజు రామభద్రకవిగా, పింగళి సూరనగా పాత్రలను పోషించి సభలను రంజింపజేశాడు. ఆశావాది ప్రకాశరావు, షేక్ దరియా హుసేన్లు ఇతనికి సన్నిహిత సాహితీమిత్రులు. సుమారు ఒక దశాబ్దకాలం పద్యకవిసమ్మేళనాలలో పాల్గొనడం, అవధానాలు చేయడం వంటివి చేశాడు. తర్వాత కథాసాహిత్యం వైపు మొగ్గుచూపాడు. ఇతడు అనేక సాహిత్య సభలు, సమావేశాలలో వివిధ విషయాలపై ప్రసంగాలు చేశాడు. ఆకాశవాణి కడప, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి కేంద్రాలనుండి అనేక ప్రసంగాలు, కథానికలు ఇతనివి ప్రసారం అయ్యాయి. అనంతపురం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, గౌరవాధ్యక్షుడిగా పనిచేశాడు. జాషువా శతజయంతి కమిటీ, సీమసాహితి, రాయలకళాగోష్ఠి, కథావేదిక, సాహితీకళాసమితి, స్పందన సాహిత్య సమితి, దళిత అధ్యయన వేదిక, అధికార భాషా సంఘం (జిల్లా యూనిట్), జన విజ్ఞానవేదిక (జిల్లా యూనిట్), అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం వంటి అనేక సంఘాలకు ప్రాతినిధ్యం వహించాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఈ పయనం ఎక్కడికి- శాంతి నారాయణ
సంగ్రహ నమూనా రచనఈ పయనం ఎక్కడికి- శాంతి నారాయణ

You may also like...