| పేరు (ఆంగ్లం) | Lakkaraju Vani Sarojini |
| పేరు (తెలుగు) | లక్కరాజు వాణి సరోజిని |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | విజయవాడ |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | మానస రవళి కవితా సంపుటి. సమాజ దర్పణం ఇది ఒక పద్య శతకం గీర్వాణ భాషా వైభవం స్వప్న లోకం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | వాణి సరోజిని గారు “స్వప్న లోకం”[నోట్ 2] అనే శీర్షిక క్రింద, విజయవాడ పట్టణాన్ని స్వర్గలోక పురమైన అమరావతి అందాలతో పోల్చిన వైనం చాలా హుర్ద్యముగా ఉంది. ఇందులో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణా నదిని “కులుకు తళుకు లొలుకు కృష్ణవేణీ … ” అని చాలా సొంపుగా అభివర్ణించారు. మరో చోట విజయవాడ పట్టణం లోని బహుళ అంతస్తుల భవనాలు స్వర్గ లోకంలోని భవంతులను పోలి వుంది అని “ఇంద్రనగరి బోలు ఇంపైన భవనాలు” ఇలా పోలిక చూపారు. మార్గమునకు ఇరుపక్కలా ఉన్న పూల తోటలు పూల మొక్కలతో నగరం అంతా శోభాయమానంగా వెలిగి పోతుంది అని “రంగురంగుల పూల రమణీయ అందాల నగరి శోభ వెలిగె నవ్యరీతి” వ్రాసారు. విజయవాడ పట్టణం గురించి ప్రస్తావన వొచ్చినప్పుడు ఇంద్ర కీలాద్రి పై వెలిసిన ఆ తల్లి దుర్గా దేవి గురించి చెప్పకుండా ఎవరైనా ఉంటారా? అందుకే కాబోలు కవి “దుర్గతల్లి మేని ధగధగ కాంతులతో ప్రజ్వలించె” అని వ్రాసారు. చివరిగా పుష్కలమైన పాడిపంటలతో ప్రజలు అందరూ సుఖ శాంతులతో తుల తూగాలని “పాడి పంటలెల్ల పొంగిపొరలునచట ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల” ఆశిస్తూ ముగించారు . |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | గీర్వాణ భాషా వైభవం – లక్కరాజు వాణి సరోజిని |
| సంగ్రహ నమూనా రచన | గీర్వాణ భాషా వైభవం – లక్కరాజు వాణి సరోజిని గీర్వాణ భాషా వైభవం అనే శీర్షిక క్రింద కవి లక్కరాజు వాణి సరోజినిగారు సంస్కృత భాషా వైభవాన్ని 5 ద్వంద్వ పద్యాల (అనగా పది పద్యాలు – ద్వంద్వ పద్యము లేక జంట పద్యము – అంటే ఒక సీస పద్యం దానికి తోడు ఒక ఆటవెలది గానీ తేటగీతి పద్యం గానీ ఉంచటం తెలుగు కవులు తరచూ వ్రాస్తూవుంటారు) ద్వారా చాలా గొప్పగా అభివర్ణించారు. |
లక్కరాజు వాణి సరోజిని
గీర్వాణ భాషా వైభవం – లక్కరాజు వాణి సరోజిని
గీర్వాణ భాషా వైభవం అనే శీర్షిక క్రింద కవి లక్కరాజు వాణి సరోజినిగారు సంస్కృత భాషా వైభవాన్ని 5 ద్వంద్వ పద్యాల (అనగా పది పద్యాలు – ద్వంద్వ పద్యము లేక జంట పద్యము – అంటే ఒక సీస పద్యం దానికి తోడు ఒక ఆటవెలది గానీ తేటగీతి పద్యం గానీ ఉంచటం తెలుగు కవులు తరచూ వ్రాస్తూవుంటారు) ద్వారా చాలా గొప్పగా అభివర్ణించారు. భాషలందు గీర్వాణ భాషా అయిన సంస్కృత భాషని రాజ భాషగా ఇలా “భాషలందున రాజ భాష గీర్వాణమై” పేర్కొన్నారు. అంతే కాక వేద వేదాంగాలు చెప్పబడిన భాషగా కీర్తించారు. ఆది కవి వాల్మీకి నుంచి, ఆది శంకరా చార్యు, కాళిదాసు, విష్ణు శర్మ, బతృహరి మొదలగు వారి సంస్కృత భాషలో చేసిన కావ్య రచనలను కొనియాడినారు. అలాగే సంస్కృతాంధ్ర భాషా కోవిదులు ఐన నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న కవులను ఈ కవిత ద్వారా కొనియాడినారు. చివరిగా “… జన్మ ధన్యత నొందగ జగతి నందు… తల్లి భారతి సేవించి తనరి రిలను.” వీరిందరూ భరతమాతను సేవించి ధన్యులయినారు అని వివరించారు. పూర్తి పద్యం నోట్స్ లో చూడవచ్చు.
↑ గీర్వాణ భాషా వైభవం
పద్యం #1
సీసం2-పూర్వభాగము:
….
వేద వేదాంగాల వెల్లి విరిసి నట్టి –సత్యవాక్కుల జాటు సౌమ్య భాష
….
ప్రాచీన భాషగా ప్రాచుర్య మొందిన –అద్భుతమైనట్టి అమర భాష
ఆటవెలది:
ఆది నుండి కవిత కాలవా లమనగ
….
కవులు పండితులకు ఘనకీర్తి నొసగుచు
….
పద్యం #2
సీసం2-పూర్వభాగము:
….
అష్ట పదులతోడ నిష్ట దేవత గొల్చి –జయదేవ కవి పొందె జగతి కీర్తి
….
భర్త్రు హరి రచించి భాష గీర్వాణాన –భక్తి వైరాగ్య సుభాషితముల
తేటగీతి :
రాజ పూజ్యంబుగ వెలుగు రమ్య భాష
….
శబ్ద మాధుర్య రసభావ లబ్ది నొంది
….
పద్యం #3
సీసం2-పూర్వభాగము:
వాల్మీకి కృతముగ వరలె రామాయణం –సంస్కృతాన జనులు సన్నుతింప
….
ఆచార్య శంకరుం డాద్భుత స్తోత్రాలు –సంస్కృత భాషలొ సంకలించె
….
తేటగీతి:
….
కవుల కారాధ్యమైనట్టి కావ్య భాష
….
భాష గీర్వాణమును బోలు భాష కలదె.
పద్యం #4
సీసం2-పూర్వభాగము
భరత దేశము నందు భాష లంద౦న్నింట –మూలమై నిల్చు నమూల్య భాష
….
సంస్క్రుతోద్భవ గ్రంధ సముదాయము లనెన్నొ-ఆంధ్రీకరించిరి ఆదికవులు
….
తేటగీతి:
మంత్ర తంత్రాల కాధార మైన యట్టి
….
….
ఆచరించగా తోడ్పడు ఆది భాష .
పద్యం #5
సీసం2-పూర్వభాగము:
….
ఆదికవులు నాడు యాంధ్రీకరించిన –గీర్వాణ గ్రంధాలు గణుతి కేక్కె
ఉభయ భాషలలోన యుద్దండ రచనల –ప్రతిభ చాటిరి వారు ప్రజ్న తోడ
….
తేటగీతి:
….
ఆణి ముత్యములను బోలు ఆది కవులు
….
తల్లి భారతి సేవించి తనరి రిలను.
↑
స్వప్నలోకం
కులుకు తళుకులొలుకు కృష్ణవేణీ తటిని కనులవిందు చేయు కళల నగరి
….
ఇంద్రనగరి బోలు ఇంపైన భవనాలు హరిత ఉద్యానాలు హంగుమీర
రంగురంగుల పూల రమణీయ అందాల నగరి శోభ వెలిగె నవ్యరీతి
….
దుర్గతల్లి మేని ధగధగ కాంతులతో ప్రజ్వలించె నగరి పసిడి కాంతి
పరుగుపరుగు పారు పంటకాలువలతో పైరుపచ్చదనాల పరవశింప
ధాన్యరాశి తోడ ధనరాశి పెరుగంగ సిరులు వెల్లువలై సుఖములొసగె
….
బాట ప్రక్కలందు బహువిధ పూపొదలు పరిమళాలు చల్లె పరవశింప
సుందర నగరి చుట్టి శోభిల్లు గిరులు కోటగోడ వోలె కొలువుతీరి
….
స్వప్న మందు కన్న సుందర నగరం విజయవాడ తప్ప వేరుకాదు
తెలుగువారి గుండె వెలుగుల నడిబొడ్డు ఆంధ్ర రాజధాని ఆ రాచనగరి
….
పాడి పంటలెల్ల పొంగిపొరలునచట ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల
———–