| పేరు (ఆంగ్లం) | Bomma Hemadevi |
| పేరు (తెలుగు) | బొమ్మ హేమాదేవి |
| కలం పేరు | దేవిరమ, యమున |
| తల్లిపేరు | గంగాదేవి |
| తండ్రి పేరు | రామాగౌడ్ |
| జీవిత భాగస్వామి పేరు | బొమ్మ నారాయణగౌడ్ |
| పుట్టినతేదీ | 14/09/1931 |
| మరణం | 26/11/1996 |
| పుట్టిన ఊరు | నిజామాబాద్, తెలంగాణ |
| విద్యార్హతలు | మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూలు |
| వృత్తి | నవలా రచయిత్రి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | హైదరాబాద్ |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | నవలలు 1. భావన భార్గవి 2. నవధాన్యాలు 3. నవరసాలు 4. దీప 5. తార 6. లవ్‌స్టోరీ 7. తపస్విని 8. కుంకుమ పూలు 9. నవభారతి 10. వనజ – అడవి పుత్రిక 11. ప్రేమే నేరమౌనా? కథలు 1. అన్నపూర్ణ 2. అభయ 3. ఆలింగనము 4. ఇజా జత్ హై 5. ఏక్ స్కూటర్ కీ వాపసీ 6. కమ్ లీ 7. కుంకుమపూలు 8. కుంజ్ కిషోర్ 9. చిరుదీపం 10. ఛోటీ ఛోటీ బాతేఁ 11. నవతరం 12. ఫాల్స్ ప్రైడ్ 13. బాంచెన్ దొరసానీ! 14. బాంధవి 15. మానవులు 16. మిస్టర్ అనంత్ 17. మేఘన 18. రామాయణంలోని… 19. శాంతినిలయం రేడియోనాటికలు 1. పొగమంచు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://kathanilayam.com/writer/1854 |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | ఈమె దేవిరమ, యమున అనే కలం పేర్లతో 1960ల నుంచి 40కి పైగా నవలలు, కథలు, విస్తృతంగా వ్రాసింది. ఈమె మొదటి నవల 1960లో వెలువడిన భావన భార్గవి. 1973 లో తన కోడలి పేరు హేమాదేవి పేరుతో వ్రాసిన “కుంకుమ పూలు” అనే కథకు మొదటి బహుమతి లభించింది. అప్పటి నుండి ఆమె బొమ్మ హేమాదేవి అనే పేరుతో రచనలు చేసింది. ఈమె రచనలు జయశ్రీ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ప్రజాతంత్ర, తరుణ, కళాసాగర్, అనామిక, సామ్య, ప్రభవ మొదలైన పత్రికలలో ప్రచురితమయ్యాయి. వనజ – అడవి పుత్రిక నవలను 1995వ సంవత్సరంలో వ్రాసింది. ఇది విప్లవోద్యమంలో, దళాలలో పనిచేసిన ఒక మహిళ ఆత్మకథ. వనజ (పద్మక్క) ఉద్యమ జీవితాన్ని ఈ నవలలో చక్కని శైలితో చిత్రించింది. ఈమె దాదాపు వంద కథలు వ్రాసింది. తెలుగులో తొలి బిసి స్త్రీ వాద రచయిత్రి]. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2017, డిసెంబరు 14వ తేదీన హైదరాబాద్ లో సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో “బొమ్మ హేమాదేవి కథలు” పుస్తకం వెలువడింది |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అన్నపూర్ణ – బొమ్మ హేమాదేవి |
| సంగ్రహ నమూనా రచన | అన్నపూర్ణ – బొమ్మ హేమాదేవి |