| పేరు (ఆంగ్లం) | Nanduri Ramamohanarao |
| పేరు (తెలుగు) | నండూరి రామమోహనరావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | రాజేశ్వరి |
| పుట్టినతేదీ | 24/04/1927 |
| మరణం | 03/09/2011 |
| పుట్టిన ఊరు | విస్సన్నపేట, కృష్ణాజిల్లా |
| విద్యార్హతలు | రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు |
| వృత్తి | రచయిత , సంపాదకుడు, అనువాదకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | విజయవాడ |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | • నరావతారం • విశ్వరూపం • విశ్వదర్శనం – భారతీయ చింతన • విశ్వదర్శనం – పాశ్చాత్య చింతన • అనుపల్లవి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం) • చిరంజీవులు (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం) [1] • వ్యాసావళి (ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం) • అక్షరయాత్ర (సాహిత్య, సాహిత్యేతర వ్యాససప్తతి) • ఉషస్విని (కవితా సంపుటి) • చిలక చెప్పిన రహస్యం (పిల్లల నవల) • మయూర కన్య (పిల్లల నవల) • హరివిల్లు (పిల్లలగేయాలు) అనువాదాలు • కాంచన ద్వీపం (ఆర్.ఎల్.స్టీవెన్సన్ ట్రెజర్ ఐలాండ్ కి తెలుగు అనువాదం) • కథాగేయ సుధానిధి (మూలం:ఏసోప్స్ ఫేబుల్స్) • టామ్ సాయర్ (మూలం: మార్క్ ట్వేన్ నవల – అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్) • హకిల్బెరీ ఫిన్ (మూలం: మార్క్ ట్వేన్ నవల – అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెరీ ఫిన్) • రాజు-పేద (మూలం: మార్క్ ట్వేన్ రచన – ప్రిన్స్ అండ్ పాపర్) • టామ్ సాయర్ ప్రపంచయాత్ర (మూలం: మార్క్ ట్వేన్ రచన – టామ్సాయర్ అబ్రాడ్) • విచిత్ర వ్యక్తి (మూలం: మార్క్ ట్వేన్ రచన – మిస్టీరియస్ స్ట్రేంజర్) • బాలరాజు (ఆస్కార్ వైల్డ్ కథలు తెలుగు అనువాదం) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు |
http://pustakam.net/?p=8125 |
| పొందిన బిరుదులు / అవార్డులు | • అభినందన (హైదరాబాదు) సంస్థ నుంచి ముట్నూరి కృష్ణారావు అవార్డు (1988). • జూలూరి నాగరాజారావు (హైదరాబాదు) స్మారక అవార్డు (1989) • మద్రాసు తెలుగు అకాడెమీ “ఉగాది వెలుగు” అవార్డు (1989) • కళాసాగర్ (మద్రాసు) అవార్డు • అభిరుచి (ఒంగోలు) సంస్థ వారి “పాత్రికేయ రత్న” అవార్డు. • “జమీన్ రైతు” వజ్రోత్సవంలో నెల్లూరి వెంకట్రామానాయుడు స్మారక అవార్డు (1990) • ఆలూరి నారాయణరావు స్మారక ట్రస్టు (విజయవాడ) వారి సి.వై.చింతామణి అవార్డు • తెలుగు యూనివర్సిటీ వారి ఆనరరీ డాక్టరేట్ (1991) • అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి “శిరోమణి” అవార్డు (1992) • క్రాంతి విద్యా సంస్థల (విజయవాడ) నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1994) • రామకృష్ణ జైదయాళ్ హార్మొనీ అవార్డు (1994) • సిద్ధార్త కళా పీఠం (విజయవాడ) వారి విశిష్ట వ్యక్తి అవార్డు (1994) • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1996) • తెలుగు యూనివర్సిటీ వారి “తాపీ ధర్మారావు స్మారక అవార్డు” (1997) • అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి “ప్రతిభామూర్తి” అవార్డు (1998) |
| ఇతర వివరాలు | 1960 నుంచి 1994 దాకా… అంటే 34 సంవత్సరాల కాలం అతను ‘ఆంధ్రజ్యోతి’లో అక్షర యాత్ర చేశారు. అతను ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. సూటిగా, సరళంగా ఉండే అతను సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980 లో నండూరి రామమోహనరావు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. అతను 1962, 1978, 1984, 1992 లలో అమెరికా లోను, 1982లో రష్యా లోను పర్యటించారు. బాపు – రమణలు నండూరిని ‘అనువాద హనుమంతుడు’ అని కొనియాడారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచనలను అచ్చ తెలుగులో, అందరికీ నచ్చేలా, తనదైన ప్రత్యేక శైలిలో అనువదించడమే దీనికి కారణం. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | లలిత పిన్ని_నండూరి రామమోహనరావు |
| సంగ్రహ నమూనా రచన | లలిత పిన్ని_నండూరి రామమోహనరావు |