| పేరు (ఆంగ్లం) | Jonnavittula Sriramachandra Murthy |
| పేరు (తెలుగు) | జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | లక్ష్మీనరసమ్మ |
| తండ్రి పేరు | రామకృష్ణ శర్మ |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని కోపల్లె |
| విద్యార్హతలు | – |
| వృత్తి | కవి, రచయిత, అనువాదకుడు స్టార్ మా తెలుగు ఛానెల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ |
| తెలిసిన ఇతర భాషలు | సంస్కృత, ఆంగ్లO.,కన్నడ |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | • వలస దేవర[3] (1998)- ‘ఆటా’ తొలి నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన.[4] • జంగమదేవర (2013) • అంతర్యామి(1998-200 ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహిక) • సాక్షాత్కారం(2017 ఆంధ్రభూమి నవలలపోటీలో ఎంపికైంది.) కథాసంపుటాలు • ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్ [5] (2008) • ఈ కథకి శిల్పం లేదు (2014)[6][7] • జొన్నవిత్తుల చదువు కథలు (ప్రచురణలో ఉంది) అనువాదాలు • జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార నాటకం గుళ్ళకాయజ్జి, కేంద్ర సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కారం పొందిన బోళువారు మహమ్మద్ కుణ్హి “పాపుగాంధి-గాంధి బాపు ఆద కథె” ను భలేతాత మన బాపూజీ, పేరుతోనూ తెలుగులోకి అనువదించాడు. • “మాతే ఇల్లదాగ” అనే పలమనేరు బాలాజీ కవితా సంపుటం, పెరుగు రామకృష్ణ కవితా సంపుటుల్ని కన్నడంలోకి అనువదించాడు. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | వలసదేవర” కి అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన తొలి నవలల పోటీలో ప్రథమ బహుమతి • “జంగమదేవర”కి సంయుక్త ఆంధ్రప్రదేశ్ భాషాసాంస్కృతికశాఖ నిర్వహించిన తొలి నవలల పోటీలో బహుమతి. • “ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్” కథాసంపుటానికి ఆంధ్రసారస్వత సమితి, మచిలీపట్నం వారి ఉత్తమ కథాసంపుటం పురస్కారం, కాకినాడవారి మాకినీడి సాహిత్య పురస్కారం, ఒంగోలు ఫాతిమా సాహిత్యపీఠం పురస్కారం. • వంజె కథకి అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ ఉత్తమ కథా పురస్కారం లభించింది. దీనిని గత శతాబ్దపు 100 ఉత్తమ కథల్లో ఒకటిగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రకటించింది. గత శతాబ్దపు 100 ఉత్తమ కథల సంపుటి కథా సాగర్ లోనూ అపురూప కథాప్రభలోనూ ఈ కథ సంకలితం అయింది. • రాసిన యాభై కథల్లో ఇరవై నాలుగు కథలకు అజొ విభొ, ఆటా, అమెరికా భారతి, కథామహల్, ఆంధ్రప్రదేశ్, రంజని, గురజాడ స్మారక సాహిత్య పురస్కారం వంటి ఉత్తమ కథా పురస్కారాలు లభించాయి. |
| ఇతర వివరాలు | అతను పాఠశాఅన నిర్వహిస్తున్న కాలంలో ఒక పత్రిక నిర్వహించిన కథల పోటీ అతనిలోని సృజనాత్మకతను తట్టిలేపింది. రాసిన మూడో కథ (పంజె), తొలి నవల (వలస దేవర) కు బహుమతులు రావటంతో తనకు సాహిత్య ప్రపంచంలో గొప్ప పౌరసత్వం మాత్రమే దొరికిందని అనుకున్నాడు. అయితే అతని ప్రతిభ తనను హైదరాబాదులోని దిల్‌ఖుష్ నగర్ కు తీసుకుపోయింది. అంతటితో ఆగకుండా కన్నడంలో కూడా రచనలు చేసాడు. తన జీవితంలో చీకటి కాలమని ఆయన అనుకున్న ఇరవై యేళ్ల జీవితం ఆయన రచనల్లో వ్యక్తీకరించబడి సాహిత్య గౌరవాన్ని అందుకుంటుంది. [2] అతను రాసిన “పంజె” అనే కథకు ఆంధ్రప్రభ వారపత్రిక పోటీలో బహుమతి వచ్చింది. ఇతని కథలన్నింటికీ చిత్తూరు జిల్లాలోని కలకడ మండలంలోని ముష్టూరు వేదిక. అతను రాసిన వలసదేవర నవలకూ అదే భూమిక. ముష్టూరు కల్పిత పట్టణం కాదు. ఇది ప్రస్తుతం పాపిరెడ్డిపల్లెగా పిలువబడుతుంది. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి -2280-_TheDeathofLastIndian |
| సంగ్రహ నమూనా రచన | జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి -2280-_TheDeathofLastIndian |