| పేరు (ఆంగ్లం) | Dasika Suryaprakasarao |
| పేరు (తెలుగు) | దశిక సూర్యప్రకాశరావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 10/04/1898 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | నూజివీడు, కృష్ణాజిల్లా |
| విద్యార్హతలు | బి.ఎ. |
| వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 1. వినోబాజీ సన్నిధిలో 2. నవీనవిద్య 3. బాపూజీ మాతృప్రేమ 4. బాబూ రాజేంద్రప్రసాద్ ఆత్మకథ 5. గాంధీజీ యుగంలో పూచిన అడవిమల్లెలు 6. భక్తమాల 7. త్యాగధనులు 8. గాంధివాణి 9. గాంధి దర్శనమే పావనము 10. లోకోత్తరుడు 11. గాంధీజీ విద్యార్థి జీవితము 12. తులసీ మానస సుధ 13. వ్యాస రత్నావళి 14. శ్రీ జమునాలాల్ దంపతులు 15. కథాపారిజాతం మొదలైనవి. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | జాతీయవాది తేకుమళ్ల వెంకాజీరావు శిష్యుడైన దశిక సూర్యప్రకాశరావు 1922లో నూజివీడులో కల్లు దుకాణాలవద్ద పికెటింగ్‌లో పాల్గొన్నాడు. ఫలితంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో 3 నెలలు, కడలూరు జైలులో 6 నెలలు శిక్షను అనుభవించాడు. కడలూరు జైలులో కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం, తెన్నేటి సత్యనారాయణ, కళా వెంకటరావు, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి హేమాహేమీలతో కలిసి శిక్షను అనుభవించాడు. 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని బళ్లారి జైలులో శిక్ష అనుభవించాడు. అక్కడ చక్రవర్తి రాజగోపాలాచారి, దండు నారాయణరాజు, నరసింహదేవర సత్యనారాయణ వంటి ప్రముఖులు ఇతని సహచరులుగా ఉన్నారు. 1932లో స్వరాజ్య కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొని రాజమండ్రి జైలులో 7 నెలలు జైలుశిక్ష అనుభవించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో అల్లీపూర్ జైలులో శిక్షను అనుభవించాడు. ఇతనికి భారతప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | మహావీరుడు – దశిక సూర్యప్రకాశరావు |
| సంగ్రహ నమూనా రచన | మహావీరుడు – దశిక సూర్యప్రకాశరావు |