| పేరు (ఆంగ్లం) | Vemuganti Narasimhacharyulu |
| పేరు (తెలుగు) | వేముగంటి నరసింహాచార్యులు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | రామమ్మ |
| తండ్రి పేరు | రంగాచార్యుల |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 14-07-1930 |
| మరణం | 29-10-2006 |
| పుట్టిన ఊరు | సిద్ధిపేట జిల్లా. |
| విద్యార్హతలు | వరంగల్ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో చేరి సంస్కృతాన్ని తెలుగును కూలంకషంగా అధ్యయనం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం బి.ఓ.ఎల్. |
| వృత్తి | తెలుగు పండితునిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి వేలాది మంది శిష్యులను సాహితీ ప్రియంభావుకులుగా తీర్చిదిద్దారు |
| తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 1946లోనే మదన్ మోహన్ మాలవ్య పరమపదించినప్పుడు ‘ భాష్పాంజలి ‘ పేరుతో వీరు రచించిన పద్యాలు అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడిన తెలుగు ‘ మీజాన్ ‘ పత్రికలో అచ్చయ్యాయి. జాతిపిత గాంధీజీ త్యాగమయ జీవనగాధను ‘ బాపూజీ ‘ అన్న ఖండకావ్యంగా రచించారు.జాతిపిత గాంధీజీ త్యాగమయ జీవనగాధను ‘ బాపూజీ ‘ అన్న ఖండకావ్యంగా రచించారు.శ్రీ వేంకటేశ్వరోదాహరణం, గణేశోదాహరణం వంటి లఘుకృతులు .” మంజీరానాదాలు ” అనే గేయ కావ్యం వీరి గేయ రచనా చమత్ర్కుతికి నిదర్శనం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | వేముగంటి నరసింహాచార్యులు-మంజీరానాదాలు ” అనే గేయ కావ్యం |
| సంగ్రహ నమూనా రచన | వేముగంటి నరసింహాచార్యులు-మంజీరానాదాలు ” అనే గేయ కావ్యం ఏనాటి దానవో ఏవీటి జాణవో గానమై మూగ తెలంగాణ వీణను మీటి పలికింప చకచకచ్చనిత పింఛములిచ్చుకొనుచు నృత్యము చేయు నెమలిరాయని బెడంగు పసిడి వన్నెల మేనిపై నల్లచారల సాగియించు చెబ్బులి సొమ్ముగమ్ము కల కలారావ సంకులమున ప్రకృతిని |
వేముగంటి నరసింహాచార్యులు
వేముగంటి వారికి పద్యమంటే ప్రాణం అయినా వచనాన్ని పలికారు. గేయాన్ని అద్భుతంగా మలిచారు. ఏ ప్రక్రియ పట్ల ఏనాడూ ద్వేషాన్ని గాని, వ్యతిరేక భావాన్నిగాని ప్రకటించని సమభావుకు డాయన . ” మంజీరానాదాలు ” అనే గేయ కావ్యం వీరి గేయ రచనా చమత్ర్కుతికి నిదర్శనం .
” ఏనాటి దానవో ఏవీటి జాణవో గానమై మూగ
తెలంగాణ వీణను మీటి పలికింప
చకచకచ్చనిత పింఛములిచ్చుకొనుచు
నృత్యము చేయు నెమలిరాయని బెడంగు
పసిడి వన్నెల మేనిపై నల్లచారల
సాగియించు చెబ్బులి సొమ్ముగమ్ము
కల కలారావ సంకులమున ప్రకృతిని
పులకింపగాజేయు పులుగు సొగసు
భాసురములగు దీర్ఘపు కేసరములు
కెంపురాయి తురాయిగా సొంపులొలుక
దొరతనము సేయు మృగరాజు నెఱతనమ్ము
గలుగు వనరమా గరిమకు కవన వినుతి ” వనాలనూ, వన్యప్రాణులనూ కాపాడుకొందామనే భావనతో అందమైన సీసపద్యాన్ని అల్లడం వేముగంటి వారికే సాధ్యపడింది. మంజీరనాదాలు అనే గేయకృతిలో వర్షాకాలం ప్రవాహాలన్నిటికీ కొత్తదనాన్నిస్తుందని పలికే సందర్భాలు …
“పీడిత ప్రజ మనసు దూసుక
వెడలు చైతన్య ప్రవాహమొ
దుష్టచేష్టలు ధిక్కరించే
దుర్దరమ్మ గుజనసమూహమొ” అంటారు.
వేముగంటి వారి రచనలను పలు విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా స్వీకరించాయి. తిక్కన కావ్యాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్రవిష్ణువు కావ్యాన్ని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, గుల్బర్గా విశ్వవిద్యాలయం పాఠ్యాంశాలుగా స్వీకరించాయి. తెలంగాణా ప్రభుత్వం వీరి మంజీరానాదాలను పాఠ్యాంశంగా స్వీకరించింది.
———–