దువ్వూరి వేంకట రమణ శాస్తి (Duvvuri Venkataramana Sastry)

Share
పేరు (ఆంగ్లం)Duvvuri Venkataramana Sastry
పేరు (తెలుగు)దువ్వూరి వేంకట రమణ శాస్తి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1897
మరణం1972
పుట్టిన ఊరుమసకపల్లె, తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్
విద్యార్హతలువిజయనగర సాంస్కృత కళాశాల నుంచి విద్వాన్ పట్టా (1914-1918)
వృత్తికవి , రచయిత
60 సంవత్సరాలకు పైగా విశాఖపట్నం, గుంటూరు పరిధి లో వివిధ కళాశాల లలో తెలుగు వ్యాకరణ ఉపాధ్యాయుడిగా పని చేసారు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు“రమణీయం” – ఒక అద్భుత వ్యాకరణ గ్రంధం , భాషా నియమాల్ని మాత్రమే చెప్పే వ్యాకరణాంశాలను , సరళంగా మరియు రమణీయంగా వ్రాసిన తీరు చదివే మనసులకు ఆహ్లాదం కలిగిస్తుంది .,పింగళి సూరన్న గారి కళాపూర్ణోదయం సంస్కృత కావ్యాన్ని “మధురలాలస ” పేరుతొ తెనిగించారు.70 ఏళ్ళు పై బడిన పిదప చేసిన రచన “స్వీయచరిత్ర ” “ఈ పుస్తకం చదివిన వారందరికీ కూడా జీవితాన్ని ఎంత సౌందర్యవంతంగా మలుచుకొవచ్చో తెలుస్తుంది! మనకున్న వాక్చమత్కృతితో – చాతుర్యంతో ఇతరులకు హాని కలిగించకుండా మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించవచ్చో నేర్పుతుంది.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకళాప్రపూర్ణ
ఇతర వివరాలుఈ తెలుగు కరువు కాలంలో ఈ తెలుగు బీడుమీద కురిసిన జడివానే ఈ స్వీయచరిత్ర”.
“అచ్చం తెలుగు జీవితాలనూ, తెలుగు చదువుల్నీ, తెలుగు గురువుల్నీ, తెలుగు శిష్యుల్ని కలవరిస్తాడు, పలవరిస్తాడు. ఈ పుస్తకం నిండా తెలుగు జీవితాలు తూనీగలైపోయి. ఈ తెలుగు మకరందాన్ని గ్రోలడమే పాఠకులుగా మనకి మిగిలింది
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజానకితో జనాంతికం-దువ్వూరి వేంకట రమణ శాస్తి
సంగ్రహ నమూనా రచనజానకితో జనాంతికం
తల్లిగా జానకీ! మనం మాట్లాడుకుని చాలా రోజులైందమ్మా – అప్పుడప్పుడూ భద్రాచలం వస్తూనే ఉన్నాను. అయిదారు రోజులు ఆగుతూనే ఉన్నాను. అమ్మని పలకరించడానికి అవకాశమే కనబడదు. వచ్చే జనానికి అంతూ పొంతూ లేదాయె. వచ్చిన వాళ్ళు తమకి వావాల్సిందేదో ఆయనతో మాట్లాడుకుని వెళ్తారేమో అంటే ఆయన పిలిస్తే పలకడాయెను… పలుకే బంగారమట! అంత ఇదేమిటో? పలక్కపోతే మన అదృష్టం ఇంతే అనుకుని పోనీ ఆ వచ్చినవాళ్ళు తిరిగి పోతారా…ఊహూ. పక్కన నువ్వున్నావుగా జాలిపడే తల్లివి. ‘సీతమ్మ తల్లీ! నీవైనా చెప్పవమ్మా’ అని కొందరు, ‘విభునికి మా మాట వినిపించవమ్మా’ అని కొందరు కూనిరాగాలు తీస్తూ నీ చుట్టూ మూగుతారు. నీకీ సిఫార్సులతోనే సరిపోతుంది. ఎప్పుడూ ఇదే మేళం. ఇంక నీ దగ్గర కూచునేదప్పుడు?…..

దువ్వూరి వెంకటరమణశాస్త్రి

జానకితో జనాంతికం (వాక్‌ చిత్రం) స్వీయ చరిత్ర (దువ్వూరి వేంకట రమణ శాస్త్రి)


రాజాచంద్ర ఫౌండేషన్‌ తన నాలుగవ ముద్రణగా కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర, వారు ఆలిండియా రేడియోలో చేసిన వాక్‌ చిత్రం ‘జానకితో జనాంతికం’ కలిపి ప్రచురించారు.
జానకితో జనాంతికం
తల్లిగా జానకీ! మనం మాట్లాడుకుని చాలా రోజులైందమ్మా – అప్పుడప్పుడూ భద్రాచలం వస్తూనే ఉన్నాను. అయిదారు రోజులు ఆగుతూనే ఉన్నాను. అమ్మని పలకరించడానికి అవకాశమే కనబడదు. వచ్చే జనానికి అంతూ పొంతూ లేదాయె. వచ్చిన వాళ్ళు తమకి వావాల్సిందేదో ఆయనతో మాట్లాడుకుని వెళ్తారేమో అంటే ఆయన పిలిస్తే పలకడాయెను… పలుకే బంగారమట! అంత ఇదేమిటో? పలక్కపోతే మన అదృష్టం ఇంతే అనుకుని పోనీ ఆ వచ్చినవాళ్ళు తిరిగి పోతారా…ఊహూ. పక్కన నువ్వున్నావుగా జాలిపడే తల్లివి. ‘సీతమ్మ తల్లీ! నీవైనా చెప్పవమ్మా’ అని కొందరు, ‘విభునికి మా మాట వినిపించవమ్మా’ అని కొందరు కూనిరాగాలు తీస్తూ నీ చుట్టూ మూగుతారు. నీకీ సిఫార్సులతోనే సరిపోతుంది. ఎప్పుడూ ఇదే మేళం. ఇంక నీ దగ్గర కూచునేదప్పుడు?…..
“ఈ పుస్తకం చదివిన వారందరికీ కూడా జీవితాన్ని ఎంత సౌందర్యవంతంగా మలుచుకొవచ్చో తెలుస్తుంది! మనకున్న వాక్చమత్కృతితో – చాతుర్యంతో ఇతరులకు హాని కలిగించకుండా మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించవచ్చో నేర్పుతుంది. ముఖ్యంగా ఆ కాలం నాటి వారి విద్యా వ్యాసంగం, వారు నిలబెట్టుకున్న విలువలు, వారి జీవితంలోని ప్రాధమ్యాలు, నేటితరం వారికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది”.— డాక్టర్ ధూళిపాళ అన్నపూర్ణ

 

స్వీయచరిత్ర

“ఈ జీవితంలోకి ఎందుకొచ్చామో, ఎప్పుడోచ్చామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఏమిచేశామో, ఏమి చెప్పామో, ఏమి విన్నామో, ఏమి తెలిసిందో అని సింహావలోకనంగా ఒక్కసారి వెనక్కి చూసుకుని, అంతే ఇక ముందుకెళ్ళిపోయాడు. ఆ ప్రయాణమూ, ఆ మలుపులే దువ్వూరి వెంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర. ఈ తెలుగు కరువు కాలంలో ఈ తెలుగు బీడుమీద కురిసిన జడివానే ఈ స్వీయచరిత్ర”.
“అచ్చం తెలుగు జీవితాలనూ, తెలుగు చదువుల్నీ, తెలుగు గురువుల్నీ, తెలుగు శిష్యుల్ని కలవరిస్తాడు, పలవరిస్తాడు. ఈ పుస్తకం నిండా తెలుగు జీవితాలు తూనీగలైపోయి. ఈ తెలుగు మకరందాన్ని గ్రోలడమే పాఠకులుగా మనకి మిగిలింది”.— సాకం నాగరాజు
“ఈ పుస్తకం చదివిన వారందరికీ కూడా జీవితాన్ని ఎంత సౌందర్యవంతంగా మలుచుకొవచ్చో తెలుస్తుంది! మనకున్న వాక్చమత్కృతితో – చాతుర్యంతో ఇతరులకు హాని కలిగించకుండా మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించవచ్చో నేర్పుతుంది. ముఖ్యంగా ఆ కాలం నాటి వారి విద్యా వ్యాసంగం, వారు నిలబెట్టుకున్న విలువలు, వారి జీవితంలోని ప్రాధమ్యాలు, నేటితరం వారికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది”.
— డాక్టర్ ధూళిపాళ అన్నపూర్ణ

———–

You may also like...