| పేరు (ఆంగ్లం) | Chandaluri Narayanarao |
| పేరు (తెలుగు) | చందలూరి నారాయణరావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | హైస్కూల్ఉపాధ్యాయులు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి |
| ఇతర రచనలు | https://www.neccheli.com/2022/01/% |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తప్పని తరింపు (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | రెపరెపలాడే చూపులే ఎగిసే కెరటాలు. మిణుకుమనే మాటలే దుమికే గుర్రాలు. |
చందలూరి నారాయణరావు
తప్పని తరింపు (కవిత)
రెపరెపలాడే చూపులే
ఎగిసే కెరటాలు.
మిణుకుమనే మాటలే
దుమికే గుర్రాలు.
అరిగిన ఎముకలనే
ఆసరాగా బతికే ఆశ
పాదాలను ములుకర్రతో అదిలించి
ఇరుకు దారిలోనూ ఉరుకుపట్టిస్తుంది.
ప్రకృతి చట్టానికి లోబడే
వయసు వదర ముప్పులో చిక్కినా…
లోపలి మనసులో
గుండెల్లో కొండలు పేలినా
దారి నడకల్ని కూల్చినా
కొట్టుకుపోని జీవసంబంధానికి
కొనఊపిరికి
మిణుకుమిణుకులను ముడేసి
ఆఖరి క్షణాలకు
రెపరెపలను పెనేసి…
ఉక్కుబంధంతో
తెగినచోట తపన తాపడంతో
తనువు తహతహలాడటం
ప్రతి ఒక్కరి కథలో
తప్పని తరింపేమో!
https://www.neccheli.com/2022/01/%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%aa%e0%b1%81-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/
———–