కుందుర్తి కవిత (Kanduri Kavitha)

Share
పేరు (ఆంగ్లం)Kanduri Kavitha
పేరు (తెలుగు)కుందుర్తి కవిత
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2021/11/%e0%
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునా పేరు కుందుర్తి కవిత. వచన కవితా పితామహుడిగా పేరెన్నికగన్న కుందుర్తి ఆంజనేయులు గారి మనవరాలిని కావటం వలనా,  వారు మొదలు పెట్టిన ఫ్రీవెర్స్ ఫ్రంట్ బాధ్యతని తదనంతరం కొనసాగించిన కుందుర్తి సత్యమూర్తి గారి కూతుర్ని కావటం వలనా,  బాల్యం నుంచీ ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కార సమావేశాలకు వెళ్ళటం, ప్రముఖులైన కవులతో,  వారిపుస్తకాలతో సంబంధబాంధవ్యాల వల్లనా, కవిత్వం రాయాలనే తపనతో కొంతకాలంగా రాస్తున్నాను. ప్రస్తుతం సింగపూర్లో నివాసం. ఇది కాక, ఏ పనైనా సృజనాత్మకతతో చేయడం నాకు సరదా. రంగవల్లికలు వేయడం, బొమ్మలు గీయడం, పెయింటింగ్ నా హాబీలు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికస్వదేశం (కవిత)
సంగ్రహ నమూనా రచనవిదేశంలో ఉంటూ దేశభక్తిమీద కవితేంటని మొదట వ్యంగ్యంగా నవ్వుకున్నా…

ఆలోచనలు ఏదో అజెండా తో

గిర్రున వెనక్కి తిరిగి

జ్ఞాపకాల వీధిలో జెండా పాతాయి…

కుందుర్తి కవిత
స్వదేశం (కవిత)

విదేశంలో ఉంటూ దేశభక్తిమీద కవితేంటని మొదట వ్యంగ్యంగా నవ్వుకున్నా…
ఆలోచనలు ఏదో అజెండా తో
గిర్రున వెనక్కి తిరిగి
జ్ఞాపకాల వీధిలో జెండా పాతాయి…
పదిహేనేళ్ళ నా పూర్వం
పరదేశంలో తన పునాదులు వెతికింది!!
ఆరునెలలకు మించి ఇంటికెళ్ళకపోతే
మనసు మనసులో ఉండకపోవడం…
మన దేశం నుంచి ఎవరొచ్చినా
సొంతవాళ్ళలా మర్యాదలు చేయడం…
మన జాతీయ హస్తకళలతో ఇంటినంతా నింపుకోవడం
మన దేశపు చిన్ని భాగాన్నైనా
ఇంట్లో బంధించామని పొంగిపోవడం…
పిల్లలకి దేశభక్తి పాటలు నేర్పుతూ ,
“ఏ దేశమేగినా, ఎందుకాలిడినా”
అని మైమరిచి పాడటం..
జణగణమన తరువాత జై హింద్ కి ప్రతీసారీ
అప్రమేయంగా చేయెత్తి జై కొట్టడం…
ఇవన్నీ దేశాభిమానానికి నిదర్శనం కాదా?!
మన సినిమాల ప్రీమియర్ షోల కి వెళ్ళి ఈలలు వేయడం నుంచీ…
మార్స్ మంగళ్ మిషన్ సఫలానికి
గుండె గర్వంతో ఉప్పొంగిపోవడం వరకూ..!!
ఆనాటి క్రికెట్ వరల్డ్ కప్పులో టీం ఇండియాకి
పై కప్పులెగిరేలా ఛీర్ చేయడం నుండి
మొన్న ఒలంపిక్సులో సింధు కంచుపతాకానికి
కంచు కంఠంతో అరవడం వరకూ !!
అన్నిట్లో దేశారాధరోదన వినిపించలేదా ?!
కాషాయవన్నె ధైర్యం వెన్నంటే ఉంచుకుని
తేటతెల్లని మమతలు మనసులో నింపుకొని
అభివృద్ధికై పచ్చటి శుభసంకల్పంతో
ధర్మసందేశాన్ని విస్తరించే విహంగాలై
వినీలాకాశంలో విహరిస్తూ
త్రివర్ణ తత్వాన్ని త్రికరణశుద్ధిగా పాటిస్తున్న మనం..
ప్రవాసంలో కూడా స్వదేశ ఛాయలనే
కదా వెతుక్కుంటున్నది?!
దేశభక్తుడంటే…
దేశాన్ని ఉద్ధరించే సంఘసంస్కర్తలే అవనక్కర్లేదు,
సరిహద్దుల్లో పోరాడే సైనికుడే కానక్కర్లేదు,
దేశంపై హద్దుమీరిన ప్రేమని గుండెల్లో నింపుకొని…
జీవనపోరాటానికి దూరదేశాలకి వలస వెళ్ళినా…
మన సంస్కృతినీ సంస్కారాలనీ బ్రతికిస్తూ…
మనదేశ గౌరవాన్ని నిలబెడుతూ…
మన ఉనికిని స్మరించుకుంటూ…
దేశ శ్రేయస్సు కాంక్షిస్తున్న ప్రతి ఒక్కరూ,
ఏ దేశంలో ఉన్నా , ఏ పని చేస్తున్నా…
టైం జోను ఏదైనా, పాస్ పోర్టు ఏ రంగైనా…
దేశభక్తులే, దేశాభిమానులే
భావితరాలకు బాధ్యత నేర్పే
భరతమాత ముద్దుబిడ్డలే !!

https://www.neccheli.com/2021/11/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%82-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/

———–

You may also like...