వెంకటేష్ పువ్వాడ (Venkatesh Puvvada)

Share
పేరు (ఆంగ్లం)Venkatesh Puvvada
పేరు (తెలుగు)వెంకటేష్ పువ్వాడ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2020/09/%e0%b0
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునా పేరు వెంకటేష్ పువ్వాడ, మా స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర గార్లపేట గ్రామం. కవిత్వం ఎలిమెంటరీ స్కూల్ నుంచే రాయడం అలవాటు అప్పుడప్పుడు కధలు కూడా రాస్తుంటాను. ప్రస్థుతం బెంగళూర్ లో Kisaanpey అనే అప్లికేషన్ ని ప్రారంభించి దాని పనులు చూసుకుంటున్నాను.అలాగే సినిమా కథలకి కూడా అసిస్టెంట్ రైటర్ గా పని చేస్తుంటాను, ఆంధ్రజ్యోతి బెంగళూర్, ప్రజాశక్తి, నవ తెలంగాణ పత్రికల్లో నా కవితలు కొన్ని ప్రచురణ అయ్యాయి. సమయం సందర్భాన్ని బట్టి కొన్ని ఆన్లైన్ వెబ్ సైట్స్ కి సామాజిక రాజకీయ సంబంధమైన వ్యాసాలు కూడా రాస్తుంటాను.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవర్షానికి ప్రేమ లేఖ (కవిత)
సంగ్రహ నమూనా రచనఒక ఉష్ణ ధామ హృదయం

ఊసులు బాసలు ఉడుకుతున్న సాయంకాలం వేల

దేహమంతా పగుళ్లు

ఉచ్వాశ నిశ్వాసాలనిండా విరహ గేయం

వెంకటేష్ పువ్వాడ
వర్షానికి ప్రేమ లేఖ (కవిత)

ఒక ఉష్ణ ధామ హృదయం

ఊసులు బాసలు ఉడుకుతున్న సాయంకాలం వేల

దేహమంతా పగుళ్లు

ఉచ్వాశ నిశ్వాసాలనిండా విరహ గేయం

పశ్చిమ మలయ మారుత వింజామరాల హాయి లాలనలో

లోలనమై ఊగుతున్న క్షణాన ఒక కణాన

సంధ్య తో సంధి కుదిరింది

కుదరక ఏంచేస్తుంది ఇద్దరి రందీ ఒకటే మరి

అల గడ్డి పోచల మెత్త పై వొళ్ళు వాల్చి

కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నా

మబ్బుల పందిరికేసి

మరో ఉదయం కోసం కాదు

వాన కోసం

నా చినుకులు చిన్నదాని కోసం

 

అవును నీ కోసమే చూస్తున్నా

నువ్వు తెచ్చే మట్టి పరిమళాల

సుగందాల శ్వాస కోసం

నేలకి సాగిలపడి

యవ్వన వసంత ఉద్రేకంతో ఎదురు చూస్తున్నా

నా పాటకీ, మాటకీ సాకీ నువ్వే సఖీ

ఓసారి వచ్చిపో చెలీ!

 

నీకోసమే చూస్తున్నా

ఇంద్రధనుస్సు అంచు నీలి చీరలో

వడపోసిన అందాలన్నీ కుండపోత

వలకపోతలో వనాల జలకాలాటలలో

తడిసిన చెట్టు ముంగురుల స్పర్శ కోసమే

ఈ విరహ వేదన

నువ్వొస్తావని కృష్ణానది ఒడ్డున

గవ్వల మువ్వల్ని కువ్వలు చేశాను

కానుక చేసి ఇవ్వాలని

ఓసారి వచ్చిపో చెలీ!

 

నీకోసమే చూస్తున్నా

మెరుపుల విరుపుల పెలపెలల

అందెల సప్పుడై నువ్వోస్తే

ఎండిన నాగేటి సాల్లన్నీ

పచ్చల హారాలై పుడమి మెడలోకి

అలంకారమైతే చూడాలని ఉంది

నువ్వొస్తావని పంట కాలువ మలుపులో

మద్య రాత్రిలో మిణుగురులకి దూరంగా

మంటేసుకు కూర్చున్నా

ఓసారి వచ్చిపో చెలీ!

 

నీకోసమే చూస్తున్నా

గాలిమామ ఈలల మేళ తాలలతో

నువ్వోస్తే కిలకిలమని పిచ్చుకలు

పచ్చికపైకి దూకి రెక్కల్ని రెపరెపలాడిస్తే

చూడాలనివుంది చిత్రం

నువ్వొస్తావని మా గిజిగాడి ఎండు తీగల

వెండి ప్యాలస్ పైకెక్కి ఎదురు చూస్తున్నా

ఓసారి వచ్చిపో చెలీ!

నీ జడి లేక నేల గర్భం మండుతుంది

నీ మడి లేక/ నాన్న ఎండుతున్న పంటకు

కాటికాపరయ్యి దిగాలై పోతున్నాడు

నీ తడి లేక వాగులు, వంకలు

నదీ ప్రవాహ దారులు ఇసుక ఎడారులై

ఒట్టి పోతున్నాయి/ మా చిన్నోళ్లు చేసిన

కాగితం పడవలు నేలపై దోగాడుతున్నాయి

నువ్వు రాక మనిషి మాయమై పోతున్నాడు

నువ్వు లేక నేను వలస పక్షి నై

బాట లేని బాటసారినై

ఎక్కడికిపోతున్నానో ఎటుపోతున్నానో

తెలియడం లేదు/ఓసారి వచ్చిపో చెలీ!

వేకువలో తెల్ల చీరతో వస్తావో!

సాయం సంధ్యలో ఎర్ర చీరలో వస్తావో నీ ఇష్టం

ఒక్కసారి అంబరం వదలిరా! నేల సంబరం చూసి పో!నీకోసమే చూస్తున్నా! ఓసారి వచ్చిపో చెలీ!

ఓసారి వచ్చిపో చెలీ!

———–

You may also like...