డా.కె.దివాకరాచారి (Divakar Kothagattu)

Share
పేరు (ఆంగ్లం)Divakar Kothagattu
పేరు (తెలుగు)డా.కె.దివాకరాచారి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2021/04/%e0%b0%9a%e0/
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఉమ్మడి రాష్ట్రం లో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశాక, 2007 నుండి ప్రధానాచార్యుడిగా, హిందీ అకాడెమీ సంచాలకునిగా పనిచేసి పదవీ విరమణ చేశాను. ఆంధ్ర మహిళా సభ విద్యాలయాల గౌరవ కార్యదర్శిగా పనిచేస్తూ నా కిష్టమైన సాహిత్య రంగంలో అభిరుచిని తిరిగి పొందుతూ, మంచి సాహిత్యాన్ని, ఇష్టమైన సభలను హాజరవుతూ, మంచి ఆరోగ్యకరమైన సమాజం కోసం తపించటం ప్రస్తుతం చేస్తున్న వ్యాపకం. హృదయాన్ని కదిలించే సంఘటనలపై స్పందించి కవితలను వ్రాయటం ఇష్టమైన పని. ‘ లయ – గతి’ కవితా పుస్తకాన్ని ప్రచురించటం జరిగింది. శ్రీ శ్రీ కవిత్వం నన్ను ఇప్పటికీ కదిలిస్తూనే ఉంటుంది. రావి శాస్త్రి, తిలక్, చలం, శివసాగర్ లు అభిమాన రచయితలు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచెరగని చిరునవ్వులు (కవిత)
సంగ్రహ నమూనా రచనసృష్టిలో వెలకట్టలేని కొనలేని
అరుదైనది ఏమిటో తెలుసా?
ప్రేమతో పలకరిస్తేనే చాలు
ప్రతిగా దొరికే అపురూపమైన
మురిపాల ముద్దులొలికే
మన చిట్టి పసిడి కూనల
అలౌకిక చిరునవ్వులే కదా ?

డా.కె.దివాకరాచారి

సృష్టిలో వెలకట్టలేని కొనలేని
అరుదైనది ఏమిటో తెలుసా?
ప్రేమతో పలకరిస్తేనే చాలు
ప్రతిగా దొరికే అపురూపమైన
మురిపాల ముద్దులొలికే
మన చిట్టి పసిడి కూనల
అలౌకిక చిరునవ్వులే కదా ?


జీవిత అనుభవాలను
పండించుకుని తిరిగి
పసితనాన్ని వెలిగించే
పండు ముసలి బోసి నోటి
ఆనందాల ముసి ముసి
నవ్వులని చూసి మురిసిపోలేదా?


మౌనంగా రేఖల్ని విప్పుకుంటూ
మొగ్గలన్నీ విచ్చుకుంటూ
సుగంధాలు పరిమళిస్తూ
పువ్వులుగా నవ్వటం కనలేదా ?


మట్టిని తొలుచుకుని
వేసిన ప్రతి విత్తనం అంకురంగా
నిలిచినందుకు జన్మనిచ్చిన రైతన్న
కళ్ళల్లో వెలుగుల నవ్వులను
ఎపుడైనా చూడకలిగారా ?


ఆకలి కడుపులకు న్యాయంగా
కడుపు నిండా పట్టెడన్నం
దొరికిన పండుగ రోజున
తృప్తినిండిన నగుమోమును
చూడకుండా ఉండగలమా ?


గుక్కపెట్టి ఆకలితో ఏడ్చే
చిన్నారిని గుండెకు హత్తుకుని
పాలిచ్చే కన్నతల్లి ఎదలో పొంగే
తనివితీరని తృప్తికి మోములో
వెలిగే అమృత నవ్వు చూశారా?


లోకపు రీతులు పట్టని
రంగుల సీతాకోక చిలుకల్లాంటి
చిన్నారులు ఆడుతూ గంతులేస్తూ
వెండి వెన్నెలను పండిస్తూ
నవ్వుల సెలఏరులవటంగమనించారా?


ఆశయం కోసం అమరులైన
వీరులు కలగన్న అందమైన లోకపు
ఆనవాళ్లను తమ నిర్జీవ పెదాలపై
కనిపించీ కనిపించని చిరునవ్వులను ఎపుడైనా దర్శించారా ?


కులం మతం నలుపు తెలుపు
నవాబు గరీబు తేడాలెరగని
ఎల్లలు లేక ఏ భాషకు చెందని
మనిషితనం వెల్లివిరిసే
చెరగని నిండైన చిరునవ్వులు
విశ్వమందున మానవుల
శాశ్వత చిరునామా కావాలి

———–

You may also like...