గంగిశెట్టి లక్ష్మీనారాయణ (Gangishetty Lakshminarayana)

Share
పేరు (ఆంగ్లం)Gangishetty Lakshminarayana
పేరు (తెలుగు)గంగిశెట్టి లక్ష్మీనారాయణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2020/09/%e0
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులైనా , తెలుగు మీద అభిమానంతో మద్రాసు ప్రెసిడెన్సీలో ఎం . ఏ . చదివారు . ఆ తరువాత పూనా దక్కన్ కళాశాల లోను, ఉస్మానియా లోనూ భాషాశాస్త్రం అభ్యసించారు. ఉస్మానియా నుండి తనకిష్టమైన ‘ప్రాచీన చరిత్ర, సంస్కృతి, పురాతత్త్వం’ లో మరో ఎం.ఏ. చేశారు. 6వ శతాబ్ది నుండి 16వ శతాబ్ది దాకా ఉన్న తెలుగు శాసనాల సామాజిక-సాంస్కృతిక అధ్యయనం మీద పి హెచ్ డి పట్టం పొందారు.

71లో బెంగళూరు క్రైస్తవ కళాశాలలో సుమారు ఆరేళ్ళు తెలుగు లెక్చరర్ గా పనిచేసి, ఆపై తొలి ప్రపంచ మహాసభల ఫలంగా ఏర్పడ్డ పూర్వపు అంతర్జాతీయ తెలుగు సంస్థలో డెప్యూటీ డైరెక్టర్ గా 11 ఏళ్ల పాటు ఉద్యోగించి, ఆపై తెలుగు విశ్వవిద్యాలయం లో కలిసి, 15 ఏళ్ళపాటు తులనాత్మక అధ్యయన కేంద్రం కేంద్రాధిపతిగా, ఆచార్యునిగా పనిచేసి 2005లో ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సెలర్ గా నియమితులై, దానికి అప్పటిదాకా లేని యు.జి. సి. గుర్తింపును తీసుకురావడంతోపాటు, 5 విభాగాలు మాత్రమే ఉన్న సంస్థను మూడేళ్ళలో 23 విభాగాలకు పెంచి, తుళు తో కలిపి 7 భాషల్లో సుమారు వంద ప్రచురణలు వెలువరించి, ఇతర దాక్షిణాత్య రాష్ట్రాలలో 3 కేంద్రాలను, సుమారు 110 దూరవిద్యా కేంద్రాలను నెలకొల్పి, 5 సం.రాల ఇంటిగ్రేటెడ్ కోర్సులను తొలిసారిగా రాష్ట్రవిశ్వవిద్యాలయాలలో ప్రారంభించడంతో పాటు అనేక కొత్త కోర్సు రూపాలను ప్రవేశపెట్టారు. తెలుగుతో పాటు, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, మలయాళ, తుళు విభాగాలను ప్రారంభిస్తూ, వాటిల్లో అనువాదానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చారు.

అనువాదమంటే చాల ఇష్టం.  అనువాదం  చేసిన వాటిల్లో సర్వజ్ఞ, జ్ఞాన పీఠీ ఇందిరా గోస్వామి అనువాదం -‘విషాద కామరూప’, ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ ముఖ్యమైనవి. పర్వ అనువాదానికి 2005లో  కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. విశ్వనాథ సత్యన్నారాయణ గారి “కావ్యానందం” ను కన్నడం లోకి అనువదించారు. ఇతరరచనలు కూడా ఉన్నాయి. వారి మార్గదర్శకత్వంలో కొన్ని ఉత్తమ పరిశోధనలు జరిగాయి.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజాబిల్లి ఎప్పుడూ ఆడ నే! (మార్గె పియర్సీ-అనువాద కవిత)
సంగ్రహ నమూనా రచనజాబిల్లి ఎప్పుడూ ఆడ నే!

ఈ రేజర్ బ్లేడ్ల నడుమ లోయలో

నా ఆడతనాన్ని

అలానే దుస్తుల్లా మార్చుకొంటూండాలని ఉంది…

గంగిశెట్టి లక్ష్మీనారాయణ
జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! (మార్గె పియర్సీ-అనువాద కవిత)

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే!
ఈ రేజర్ బ్లేడ్ల నడుమ లోయలో
నా ఆడతనాన్ని
అలానే దుస్తుల్లా మార్చుకొంటూండాలని ఉంది…
ఏం, ఎందుక్కూడదు?
మగాళ్ళెప్పుడూ తమ మగతనాన్ని తొడుక్కొనే ఉంటారా?
ఆ ఫాదరీ, ఆ డాక్టరు, ఆ మాష్టారు
అందరూ విలింగతటస్థభావంలో నత్తగుల్లల్లా తమ వృత్తులకు హాజరవుతున్నామంటారా?
నిజానికి నేను పనిలో ఉన్నప్పుడు
ఏంజిల్ టైగర్ లా స్వచ్ఛంగా ఉంటాను
చూపు స్పష్టంగా ఉంటుంది
మెదడు వేడెక్కి పనిచేస్తుంటుంది
పిచ్చిపిచ్చిగా గురగురలాడే ఆకలిపంది కూనలు నిశ్శబ్దమై పోతాయి
…….
…..జాబిల్లి ఎప్పుడూ స్త్రీనే!
సూర్యమే!? హాయైన ఎండలో ఆడవాళ్లు
గంతులేస్తూ ఎక్కివెళ్ళే సీమల్లో మాత్రమే స్త్రీ!…

ఓ స్త్రీ అరుస్తోంది, వింటున్నా…
ఓ స్త్రీ రక్తమోడుస్తోంది, చూస్తున్నా…
నోటినుంచి, లోగర్భం లోంచి, ఎద రొమ్ముల్లోంచి
దైన్య దైనందిక దుఃఖశోష నల్లరక్తపు మడుగు
బలవంతుల రుచులకలవాటైన నీరవ నిశ్శక్తత
రక్తమోడుస్తోంది…
అది సాధారణదృశ్యమై పోయింది…
వంటింటి రొట్టె మా కండరాల మీద కాలాలి
కింద, తెరుచుకొని రోదించే ఈ క్షీరమాంస జంతువుల ఎముకలపై కుంపట్లు వెలగాలి
మా తల్లుల పేర్లు చెప్పాలనుంది
నేనెక్కుతూ వెళ్లే ఈ రాతి బాటపై
పొగమంచుకు జారే రాళ్లలాటి
తల్లుల పేర్లు చెప్పాలని ఉంది….
….
కత్తి మొనను కంఠంపై మోపినా
నేనెప్పుడూ మగాణ్ణి కావాలనుకోలేదు,
అనుకోను కూడా!…
నేను నేను గానే, స్వేచ్ఛగా ఉండాలనుంది.
……
జాబిల్లి రాకకోసం ఎదురుచూస్తున్నా
ఊరూ వాడా ఉక్కుకార్ఖానాలతో
బొగ్గు గనుల్తో, బందిఖానాలతో……
గడ్డికోత కొడవళ్ళ ధ్వనితో
నా వెనకే, ఊపిరాడక కొట్టుకొంటున్నా,
నేనిక్కడే బాసింపట్టు వేసుకు వేచిఉన్నా..
https://www.neccheli.com/2020/09/%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%8e%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%82-%e0%b0%86%e0%b0%a1-%e0%b0%a8%e0%b1%87-%e0%b0%85%e0%b0%a8/

———–

You may also like...