వేముగంటి మురళి (Vemuganti Murali)

Share
పేరు (ఆంగ్లం)Vemuganti Murali
పేరు (తెలుగు)వేముగంటి మురళి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1972
మరణం
పుట్టిన ఊరుసిద్దిపేట
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2020/04/%e0%b0%a8%e0%b0%a1%e0%b1
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునేను సిద్దిపేటలో 1972లో జన్మించాను.

మా బాపు పద్యకవి కావడం వల్ల కొంత సాహిత్య జ్ఞానం అబ్బింది. నందిని సిధారెడ్డి, దేశపతి మిత్రుల వల్ల ప్రాపంచిక దృక్పథం తెలిసింది.

1993 నుండి కవిత్వం రాస్తున్న. ‘అలుకుబోనం’ నా మొదటి కవిత్వ సంపుటి. ‘వానపండుగ’ రాబోతున్న కవిత్వ పుస్తకం. ‘మెతుకు కథ’ సంపుటికి ఒక సంపాదకుడిని, ‘మునుం’ తెలంగాణ పుష్కరకవిత్వ పుస్తకానికి ప్రధాన బాధ్యుల్లో ఒకన్ని. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనడుస్తున్న భారతం (కవిత)
సంగ్రహ నమూనా రచనముఖానికి మాస్క్
దుఃఖానికి లేదు
ఆకలి ఎండినతీగల్లాంటి పేగుల్ని
మెలిపెడుతున్నది ఒంట్లో

వేముగంటి మురళి
నడుస్తున్న భారతం (కవిత)

ముఖానికి మాస్క్
దుఃఖానికి లేదు
ఆకలి ఎండినతీగల్లాంటి పేగుల్ని
మెలిపెడుతున్నది ఒంట్లో

నగరాల నరాల్లో
విచ్చలవిడిగా మండుతున్న భయం
పూరిగుడిసెలో
చల్లారిన కట్టెల పొయ్యి
అవయవాలు ముడుచుకొని ఉండడమే
పెద్ద శ్రమ

కరెన్సీ వైరస్ ను జోకొట్టలేదు
కాలాన్ని వెనకకు తిప్పలేదు
ప్రజలకు పాలకుల మధ్య డిస్టెన్స్ గీత మాత్రమే గీస్తుంది

తిరిగే కాలు మూలకు,
ఒర్రే నోరుకు రామాయణ తాళం
గదంతా ఆధ్యాత్మిక ధూపదీప యాగం
కంట్లో నిండుతున్న విశ్వాసాల పొగలు
ఎర్రబారిపోయింది పిచ్చి మనసు

రోడ్డుమీద ఒక పక్కకు పక్షుల రాకడ
మరోదిక్కు వలసొచ్చిన మనుషులు పోకడ

పిట్టలు ఎగరగలవు
కరువు అమాంతం నెత్తిమీద వాలుతుంది
భుజం మీద చినిగిన బోళ్ల సంచి
రొండికి పాలకు ఏడుస్తున్న పసిపిల్లగాడు
ఇది నడుస్తున్న భారతం
https://www.neccheli.com/2020/04/%e0%b0%a8%e0%b0%a1%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%82-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/

———–

You may also like...