లక్ష్మీ కందిమళ్ల (Lakshmi Kandimalla)

Share
పేరు (ఆంగ్లం)Lakshmi Kandimalla
పేరు (తెలుగు)లక్ష్మీ కందిమళ్ల
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://sanchika.com/tag/lakshmi-kandimalla/
ఈ-పుస్తకాల వివరాలుhttps://kinige.com/book/Reppa+Chatu+Ragam
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరెప్పచాటు రాగం
సంగ్రహ నమూనా రచనలక్ష్మీ కందిమళ్లగారి కవిత్వాన్ని గత మూడేళ్లుగా ఫేస్ బుక్‌లోనూ కవిసంగమంలోనూ చదువుతున్నాను. కర్నూలులో జరుగుతున్న ప్రతి సాహిత్య సమావేశంలోనూ వినమ్రంగా కూర్చొని శ్రద్ధగా ఉపన్యాసాలు వింటుండే ఆమెను చూస్తున్నాను. ఇతరుల కవిత్వం మీద ఆమె చేస్తుండే వ్యాఖ్యలు గమనిస్తుంటాను. సరళమైన స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఆమెది. ఇప్పుడు పుస్తకరూపంలో తన కవిత్వాన్ని తీసుకు వస్తోంది. ఇదొక మంచిపరిణామం.

లక్ష్మీ కందిమళ్ల
రెప్పచాటు రాగం

లక్ష్మీ కందిమళ్లగారి కవిత్వాన్ని గత మూడేళ్లుగా ఫేస్ బుక్‌లోనూ కవిసంగమంలోనూ చదువుతున్నాను. కర్నూలులో జరుగుతున్న ప్రతి సాహిత్య సమావేశంలోనూ వినమ్రంగా కూర్చొని శ్రద్ధగా ఉపన్యాసాలు వింటుండే ఆమెను చూస్తున్నాను. ఇతరుల కవిత్వం మీద ఆమె చేస్తుండే వ్యాఖ్యలు గమనిస్తుంటాను. సరళమైన స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఆమెది. ఇప్పుడు పుస్తకరూపంలో తన కవిత్వాన్ని తీసుకు వస్తోంది. ఇదొక మంచిపరిణామం.
రాయలసీమ సాహిత్యంలో స్త్రీలు తక్కువ. కథతో కొందరైనా సాధన చేస్తున్నారు గానీ వచనకవిత్వంలోనైతే మరీ తక్కువ. గండికోట వారిజ, కళ్యాణదుర్గం స్వర్ణలత వంటి కొన్ని పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వారి సరసన యిప్పుడు లక్ష్మీ కందిమళ్ల చేరుతున్నారు.
‘రెప్పచాటు రాగం’ ఒక రకంగా దిగులు గీతాల పొత్తం. ఈమె కవిత్వం నిండా వైయ్యక్తికమైన వేదనలూ, ఆశలూ, కలలూ, నిరీక్షణలూ, మౌననివేదనలూ కనిపిస్తాయి. ఈ తరహా వ్యక్తీకరణల వల్ల యీ కవిత్వంలో నిరాశ ధ్వనిస్తోందేమోనని సందేహం అక్కర్లేదు. నిరాశ పక్కనే ఆశనూ, చీకటి వేదన పక్కనే మిణుగురు వెలుగునూ, కంటిచినుకు వెంట మౌనాలాపననూ, అంతుచిక్కని ఆలోచనలను అన్వేషణగానూ దఖలు పరచిందీమె. ఈమె కవిత్వం మనిషినీ ప్రకృతిని పెనవేసుకొని మనసు పలికే రాగాలకు అక్షరాలు అద్దుకొని కన్పిస్తుంది.

———–

You may also like...