దాసరాజు రామారావు (Dasaraju Ramarao)

Share
పేరు (ఆంగ్లం)Dasaraju Ramarao
పేరు (తెలుగు)దాసరాజు రామారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1955
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిటీచరు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2020/01/%e0%b0%ae%e0%b1%81%e0%b0%97%
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు1955 లో జననం,సిద్ధిపేట ప్రాంతం.టీచరుగా 2013 లో రిటైర్మెంట్. శ్రీశ్రీ మహాప్రస్థానం ,ఉన్నవ మాలపల్లి సాహిత్య అవసరం ,అక్షరం విలువ నేర్పినయి.
45 ఏళ్ల సాహిత్య ప్రయాణం లో గోరుకొయ్యలు,పట్టుకుచ్చుల పువ్వు ,విరమించని వాక్యం కవిత్వ సంపుటాలు – ప్రోత్సాహకాలుగా ఉమ్మిడిశెట్టి ,సమైక్య సాహితి ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అవార్డులు.
మంజీరా రచయితల సంఘం లో శాశ్వత సభ్యున్ని.
ప్రధానంగా సాహిత్య సృజన – జీవన గమన ప్రేరణాత్మక ఆచరణ గ ఉండాలని నమ్ముతాను.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికముగింపు లేని సమయం(అనువాద కవిత)
సంగ్రహ నమూనా రచనముగింపు లేని సమయం నా చేతుల్లో వున్నది, ఓ నా ప్రభూ
నిమిషాలను లెక్కించేందుకు ఎవరూ లేరు….

దాసరాజు రామారావు
ముగింపు లేని సమయం

ముగింపు లేని సమయం నా చేతుల్లో వున్నది, ఓ నా ప్రభూ
నిమిషాలను లెక్కించేందుకు ఎవరూ లేరు

దివా రాత్రాలు వెళ్లిపోయి,వయస్సు మళ్లిపోయి
వికసించీ, వాడిపోయీ
పూల వోలె.
నువ్వు తెలుసుకోవాల్సింది
ఎట్లా వేచివుండటం.

నీ సంవత్సరాలు ఒకటొకటి అనుసరిస్తూ
ఒక సంపూర్ణమైన చిన్ని అడవి మల్లె కోసం.

మనకు సమయం లేదు కోల్పోవడానికి.
మరియు సమయం కలిగి లేం
మనం ఒక అవకాశం కోసం పాకులాడక తప్పదు
మనం చాలా పేదవాళ్లం ఆలసించినందుకు.

ఈ తీరున సమయం గడచిపోవడం అయితే
ప్రతి ఫిర్యాదుదారునికి సమయమిస్తాను నెగ్గడానికి.
నీ తదుపరి ఇవ్వడానికేమీ వుండదు ఆఖర్న.

దినపు అంతాన భయం వలన
నీ గేటు త్వరితంగా మూయబడుతుంది

అయిననూ నాకు తెలుసు, ఇంకనూ సమయ ముందని.

* రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్ల కవితకు అనుసృజన

———–

You may also like...