| పేరు (ఆంగ్లం) | Anuradha Yalamarthy |
| పేరు (తెలుగు) | యలమర్తి అనూరాధ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | కృషాజిల్ల |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | https://www.neccheli.com/2020/07/%e0%b0%b0 |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Books-Yalamarthi-Anuradha/s?rh=n%3A976389031%2Cp_27%3AYalamarthi+.Anuradha, |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | రైన్ కోటు (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | గోడకు వేలాడదీయబడి బిక్కు బిక్కు మంటూ చూస్తూ ఎడారి జీవితాన్ని గడిపేస్తూ.. |
యలమర్తి అనూరాధ
రైన్ కోటు
గోడకు వేలాడదీయబడి
బిక్కు బిక్కు మంటూ చూస్తూ
ఎడారి జీవితాన్ని గడిపేస్తూ..
గాలివాన నేనున్నా అనాలి
విప్పుకున్న గొడుగులా
అప్పుడే ఊపిరి పోసుకున్న బిడ్డలా
ఉత్సాహంగా ఉరకటానికి సిద్ధమవుతుంది
కష్టాన్నంతా తనమీద వేసుకుంటూ
వెచ్చదనం అంతా నీ సొంతం చేస్తుంది
కన్నీళ్లను కనుపాపల్లో దాచుకుంటూ
గూటిలో గువ్వలా తన ఒడిలో కాపాడే
తల్లి మనసుకు ఏం తీసిపోదు
చినుకు చినుకు కి చిత్తడవుతున్నా
చిరునవ్వుతో నిన్ను హత్తుకుంటూనే
నిలువెల్లా రక్షణ కవచం అవుతూనే
శ్వాస ఆగుతుందేమోనని కలవర పడుతూనే
వర్షం ఆగితే మళ్లీ అది చలనం లేని బొమ్మే గా!
https://www.neccheli.com/2020/07/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b1%81-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/
———–