| పేరు (ఆంగ్లం) | R.Santa Sundari |
| పేరు (తెలుగు) | ఆర్. శాంతసుందరి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | ఆర్.గణేశ్వరరావు |
| పుట్టినతేదీ | 04/08/1947 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు అసురుడు (మూలం: ఆనంద నీలకంఠన్) కథాభారతి కథ కాని కథ అజేయుడు (మూలం: ఆనంద నీలకంఠన్) ఇంట్లో ప్రేమ్‌చంద్: ప్రేమ్‌చంద్ జీవితచరిత్ర (మూలం:శివరాణీదేవి) రెక్కల ఏనుగులు ప్రేమ్‌చంద్ బాలసాహిత్యం – 13 కథలు సేపియన్స్ (మూలం: యువల్ నోఆ హరారీ) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కారం గార్గీ గుప్తాద్వివాగీశ్ అవార్డు |
| ఇతర వివరాలు | ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేస్తున్నారు.ఇంతవరకూ కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు .ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి.ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది.ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఆడదానికే ఎందుకు? |
| సంగ్రహ నమూనా రచన | ఆ వీధులే కదా ఇవి ఇంతకు ముందే కొందరు మగపిల్లలు నడిచివెళ్ళిన వీధులు? గోల గోలగా అల్లరి చేస్తూ తుళ్ళుతూ తూలుతూ కబుర్లు చెప్పుకుంటూ? |
ఆర్. శాంతసుందరి
ఆడదానికే ఎందుకు?
ఆ వీధులే కదా ఇవి
ఇంతకు ముందే కొందరు మగపిల్లలు నడిచివెళ్ళిన వీధులు?
గోల గోలగా అల్లరి చేస్తూ
తుళ్ళుతూ తూలుతూ
కబుర్లు చెప్పుకుంటూ?
ఆ వీధుల్లోనే ఆడపిల్లలూ వెళ్తున్నారు
అసలు మాటా మంతీ లేకుండా
ఎవరి కళ్ళైనా తమ మీద పడేలోపున
అక్కణ్ణించి చల్లగా జారుకోవాలని.
ఈ ఇళ్ళు కూడా అవే కదా
ఒకప్పుడు చిన్నారి ఆడపిల్లలు ఉన్న ఇళ్ళు?
శిల్ప,గుంజన్,మీతా
ఆడుకుంటూ ఉండేవాళ్ళు
నవ్వుతూ ఆ పేటలోని ఒక్కొక్కరినీ నవ్విస్తూ
కానీ వాళ్ళందరినీ పంపివేశారు పరాయి ఇళ్ళకి
ఈ ఇళ్ళు వాళ్ళవి కాదు మరి
వాళ్ళందరివీ వేర్వేరు ఇళ్ళు
అందుకే వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడికి
ఇక్కడ వాళ్ళ అన్నదమ్ములుంటారు
మరి వాళ్ళ ఇళ్ళుగా ఇవి !
ఈ ప్రసూతి గృహాలు కూడా అవే
కొడుకు పుట్టాడనగానే
బంధువర్గం నవ్వులు మార్మోగుతాయి
గర్భంలో ఉన్నది అమ్మాయయితే
చీకటి కారాగృహమౌతుంది ఇదే గది!
అందరినీ తమ గమ్యం దాకా దింపుతుంది
ఈ బస్సు అదే కదా?
అందరి దృష్టిలో ఎంత మంచిదో ఇది
అది రావటం చూసి విప్పారతాయి అందరి ముఖాలూ
కానీ ఇందులోనే జరిగింది అత్యాచారం
ఆ యువతి మీద
ఎందుకు లోకంలో ఉన్న వస్తువులన్నీ
మారిపోతాయి ఒక స్త్రీ విషయంలో మాత్రం?
మరి స్త్రీ మాత్రం ఎవరి కోసమూ మారదే ?
https://www.neccheli.com/2019/12/%e0%b0%85%e0%b0%a8%e0%b1%81%e0%b0%b8%e0%b1%83%e0%b0%9c%e0%b0%a8-%e0%b0%86%e0%b0%a1%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%87-%e0%b0%8e%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81/
———–