| పేరు (ఆంగ్లం) | Swathisripada |
| పేరు (తెలుగు) | స్వాతిశ్రీపాద |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | శిశిర వసంతం,చుక్కాని చిరు దీపం,సుప్త క్షణాలు\ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | నిజామాబాద్ స్థానిక మహిళ, ఆంగ్లం మరియు తెలుగులో కవితలు, నవలలు, కథలు తెలుగులో వ్రాస్తుంది. తెలుగు నుండి ఆంగ్లానికి మరియు ఆంగ్లానికి తెలుగులోకి అనువదిస్తుంది. తెలుగులో 5 కవితా సంపుటాలు, 5 కథా సంకలనాలు, 5 నవలలు మరియు 32 అనువాదాలు ప్రచురించబడ్డాయి. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఇక్కడ కూడా ఒక సముద్రం పరచుకుని ఉంది |
| సంగ్రహ నమూనా రచన | ఇక్కడ కూడా ఒక సముద్రం పరచుకుని ఉంది. బుడి బుడి నడకలప్పుడే నేలచెరుగులు కలిపే సముద్రం ఇక్కడే కనిపించింది. |
స్వాతిశ్రీపాద
ఇక్కడ కూడా ఒక సముద్రం పరచుకుని ఉంది
ఇక్కడ కూడా ఒక సముద్రం
పరచుకుని ఉంది.
బుడి బుడి నడకలప్పుడే
నేలచెరుగులు కలిపే సముద్రం
ఇక్కడే కనిపించింది.
ఆకుపచ్చ కొండల మధ్య
నీలి నీలి సరస్సులా
ఇక్కడ పైకి మాత్రం
ఒకగొప్ప పెయింటింగ్ లా
కనువిందు చేస్తూనే ఉంటుంది.
సముద్రం చుట్టూ చంద్ర వంకలై పరచుకున్న తీరాలై
విగ్రహాల్లా నిలిచిన మనిషి తోలు కప్పుకున్న
మృగాలు
అక్కడక్కడ రెల్లుపూల పడవలై
గాలివాటు తుప్పలు
అలలు గుప్పిళ్ళతో ఒడ్డుకు విసిరే
నత్త గుల్లలూ ఆలి చిప్పలూ
కొన్ని సజీవం మరిన్ని నిర్జీవంగా.
అప్పుడప్పుడు పడవలు పుట్టుకు వస్తాయి
పనిమాలా ఆహ్వానించిన తుఫానుల బీభత్సం
విలయతాండవానికి అబద్ధపు సానుభూతుగా
అర్ధరాత్రి
అచ్చరకన్నెలై నక్షత్రాలు దిగివచ్చి
సముద్రంలో జలకాలాడినట్టు
ఈ మధ్యన పెరిగిన ఆధునికత.
కొమ్మ కొమ్మా గుసగుస
ఇదేమి పోయేకాలమో అంటూ
నడిరేయి విందులూ వినోదాల్లో
సముద్రమే నగ్నంగా ఉరకలెత్తుతుంది.
మసక వెన్నెలే సాక్ష్యం
అన్ని నిధి నిక్షేపాలతో
ఇక్కడకూడా ఒక సముద్రం పరచుకుని ఉంది.
———–