పి. సుష్మ (P. Sushma)

Share
పేరు (ఆంగ్లం)P. Sushma
పేరు (తెలుగు)పి. సుష్మ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆమె కల (కవిత)
సంగ్రహ నమూనా రచనచరిత్ర గుమ్మాల ముందు
వేలాడుతున్న జీవిత చరిత్ర పరదాను
పొరలు,పొరలుగా తెరిచి చూసినప్పుడు
అలికిడి లేని ఆవేదనలే తడిగా కనిపిస్తాయి ….

పి. సుష్మ
ఆమె కల (కవిత)

చరిత్ర గుమ్మాల ముందు
వేలాడుతున్న జీవిత చరిత్ర పరదాను
పొరలు,పొరలుగా తెరిచి చూసినప్పుడు
అలికిడి లేని ఆవేదనలే తడిగా కనిపిస్తాయి
ఆ పచ్చదనపు వాసనను పోగొట్టాలని
చప్పుడు చేస్తూ పరిగెడదాం అనుకుంటాను
రాతి మనసు కలవారెవరో ఇనుప పగ్గాలతో సంకెళ్ళేసి లాగుతారు అని తెలియక నేను ఎన్నిసార్లుకొత్త రెక్కలు అతికించుకొని ఎగరాలనుకున్నా ఈ పితృస్వామ్యం నా రెక్కలను కత్తిరిస్తూనే ఉంది
కలకని,కలకని
తలదిండు కింద పళ్ళు బిగించి కన్నీళ్లతో కళ్లు మూసుకుంటాను మళ్ళీ ఎప్పుడు కలకనకూడదని
పోరాడి,పోరాడి అలసిన దేహం మీద
వలసగా వాలిన కొన్ని ఆలోచనలు
అసలు నువ్వు ఎవరు అంటూ
నన్ను నన్నుగా ఉండనివ్వదు
ఇప్పుడు నాకై నా ఆలోచన
అక్కడ కూడా నన్ను నేను వెతుక్కోనివ్వకుండా
ముసురుగా కురుస్తున్న అహంకారపు వర్షం
ఇంకెప్పటికీ ఆగదని తెలిసి
మళ్లీ కాళ్లు మడిచి కల కంటాను
కలత నిద్రలోని కన్నీళ్లే బాగున్నాయని
అక్కడే మళ్ళి రెక్కలు కట్టుకొని ఎగరొచ్చని
ఇంకెప్పుడైనా కావలనిపించింది రాదని తెలిస్తే కలలోనే వచ్చిందనుకుంటాను కట్టె కాలే వరకు కలల రెక్కలు కట్టుకొని ఊరేగుతుంటాను ఇప్పుడు నా జీవితాన్ని కూడా ఒక కలా అనుకుంటాను..

———–

You may also like...