| పేరు (ఆంగ్లం) | Dr. Jyothirani |
| పేరు (తెలుగు) | డా. జ్యోతిరాణి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఆ వార్త (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | మానవతను మసి చేసిన మారణ హోమాలు! ‘నిర్భయ’ చట్టాలను ధిక్కరించిన నరమేధలు!! అహంకార మదోన్మత్తుల అత్యాచారాలు! అమాయకుల మాన ప్రాణ హరణాలు!! అమ్మాయి పుట్టిందని |
డా. జ్యోతిరాణి
ఆ వార్త
గుండెను అగ్ని గుండంగా
రగిలించిన వార్త!
అశ్రు వాహినులు ఆవిరై
బడబాగ్నులు భగ్గుమన్న వేళ! ఆ వార్త!! ఏమిటీ అన్యాయం?
ఎందుకీ అరాచకం!
జీవన్మరణ సమస్యల సంక్షోభవేళ !
దుర్మదాంధ శక్తుల పైశాచిక హేల!!
వరకట్న దహనాలు!
భ్రూణహత్యా పాతకాలు!!
మానవతను మసి చేసిన మారణ హోమాలు! ‘నిర్భయ’ చట్టాలను ధిక్కరించిన నరమేధలు!! అహంకార మదోన్మత్తుల అత్యాచారాలు! అమాయకుల మాన ప్రాణ హరణాలు!! అమ్మాయి పుట్టిందని
లక్ష్మి నట్టింటికి వచ్చిందని
మురిసిపోయిన కన్నవారి కళ్ళు
ఆవేదనకు ఆక్రోశాలకు ఆలవాలమై
ఆర్తనాదాలుగా అంతులేని అగాధాలుగా! అనుక్షణం భయం భయం!!
మింటినంటుతున్నవి కడుపు చిచ్చులు!
దుర్భర జీవితాల ఆత్మ ఘోషలు!!
ఎన్నాళ్లిలా? ఎన్నేళ్ళిలా?
మనిషి మనీషిగా మారేదెలా?
———–