| పేరు (ఆంగ్లం) | Sonayila Krishnaveni |
| పేరు (తెలుగు) | సొన్నాయిల కృష్ణవేణి |
| కలం పేరు | “అనామిక” |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అమ్మనై అడుగుతున్న(కవిత) |
| సంగ్రహ నమూనా రచన | అమ్మనై అడుగుతున్నా అమ్మకొడుకా ఆలోచించు రాఖీగట్టిన చెల్లకు రక్షగా నిలబడతవ్ మరి రోడ్డు మీద చెల్లినెందుకు రోతకూతలు కూస్తవ్ |
సొన్నాయిల కృష్ణవేణి
అమ్మనై అడుగుతున్న
అమ్మనై అడుగుతున్నా
అమ్మకొడుకా ఆలోచించు
రాఖీగట్టిన చెల్లకు రక్షగా నిలబడతవ్
మరి రోడ్డు మీద చెల్లినెందుకు రోతకూతలు కూస్తవ్
పక్క మీద నుంచి లేవంగనే
అమ్మ కాళ్ళని కళ్లకద్దుకుంటవ్
మరి… పిల్లనిచ్చిన అమ్మనెందుకు
అమ్మ నా బూతులు తిడతవ్
బువ్వ పెట్టే తల్లి భూతల్లంటవ్
మరి నీ పిల్ల తల్లినెందుకు
కట్నం కోసం కాటికంపుతవ్
వాకిట్లో మొలిసిన తులసిచెట్టును
ఆడబిడ్డని పూజిస్తవ్
మరి నీ కడుపున పుట్టిన బిడ్దనెందుకు
చెత్తకుప్పల పాల్జేస్తవ్
ఆపురూపమైనదమ్మ ఆడజన్మ అంటవ్
అంతట్లోకే అందాల ఆటబొమ్మ అని అపరాజిత
(స్త్రీవాద కవిత్వం) 10 అంగట్లో సరుకుని చేస్తావ్
విలువల వలువలు విప్పేస్తూ అంగాంగ ప్రదర్శనలు చేపిస్తవ్ షేవింగ్ క్రీంలూ, అండర్వేర్లూ, కంపు దేహాలను ఇంపు చేసే అత్తరుసీసాలూ అమ్ముకునే వస్తువులన్నీ మీయే గదా మరి అమ్మతనాన్నెందుకు అర్ధనగ్నంగా టీవీ తెరమీద ఆరేస్తవ్ అమ్మనై అడుగుతున్నా అమ్మకొడుకా ఆలోచించు 2016లో యూట్యూబ్ సామాజిక మాధ్యమాలలో వైరల్
———–