వారాల ఆనంద్ (Varala Anand)

Share
పేరు (ఆంగ్లం)Varala Anand
పేరు (తెలుగు)వారాల ఆనంద్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttps://aanandvarala.wordpress.com/
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరుతువులు (కవిత)
సంగ్రహ నమూనా రచనపూలనూ ఆకుల్నీ రాల్చీ రాల్చీ
బీడువారిన చెట్టు
బిక్కు బిక్కు మంటోంది

వారాల ఆనంద్
రుతువులు

పూలనూ ఆకుల్నీ రాల్చీ రాల్చీ
బీడువారిన చెట్టు
బిక్కు బిక్కు మంటోంది

రాలిన ఆకులూ పూరెమ్మల
గల గలల్తో భూమి
దిగాలు పడ్డది

గాలి ఒక్కసారిగా
రివ్వున వీచి
నేలను ఊడ్చేసుకు పోయింది

చెట్టు మొదలేమో
ధృడంగా నిలబడి రెప్ప వాల్చకుండా
అన్నింటినీ వీక్షిస్తోంది

ఇంతలో ఆకాశంలోంచి
నల్లటి మేఘమొకటి ఒకటి కిందికి దిగి
చెట్టును కావలించుకుని పలకరించింది

మబ్బు ఆత్మీయతకు కరిగిపోయి
చెట్టు బావురుమంది
తడి తడై పులకరించింది

కొమ్మ చివరన చిగురించడం మొదలెట్టింది

శిశిర వసంతాలు
చెట్టుకే కాదు
మనిషికీ అనివార్యమే

http://www.maganti.org/rachayitalu/varala/varalaindex.html

———–

You may also like...