వనితారాణి నోముల (Vanitharani Nomula)

Share
పేరు (ఆంగ్లం)Vanitharani Nomula
పేరు (తెలుగు)వనితారాణి నోముల
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిఉపాధ్యాయురాలు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు“సప్త పర్ణిక”
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆమె (కవిత)
సంగ్రహ నమూనా రచనఆమె స్రవించే రుధిరధారలు.
అవే సృష్టి మూలపు బీజభాండాగారాలు..

వనితారాణి నోముల
ఆమె (కవిత)

ఆమె స్రవించే రుధిరధారలు.
అవే సృష్టి మూలపు బీజభాండాగారాలు..
ఆమె అనుభవించే అంటుశూలాల నెప్పులు.. ఓ మనిషి.
అవి నీవెన్నటికి ఎరుక(గ) లేని
చండ్ర నిప్పుల గాయాలు..
ఆమె ఆక్రoదనలు..
రక్తపు జీరల నడుమ నలిగే
నరక కూపపు నకళ్ళు..
ఆమెకు నిద్ర కరువయిన రాత్రుళ్ళు..
రక్తపు ముద్దకు ఆయువు నీకై
ధారపోసిన మంజూషలు
ఆమె అర్పించే క్షీర(క్త)ధారలు..
అవి నీపాలిట అమృత తుల్యాలు..
ముట్టు ముట్టు అంటూ మూలిగేవు,
ఆ ముట్టులోనే రా
నీ పుట్టుక గుట్టు..

ఆమె తప్పించుకునే నెలసరులు..
అవి నీ జననానికై
ఆమె దాచే నలతలు..
తెలుసుకో..
ముందు నీ మూలాలు..
కొలుచుకో..
కోరి నిను భువిపైకి
తెచ్చిన మాతృవేల్పు పాదాలు..
ఋణపడిపో..
ఆమె స్రవించే ఆ ఎరుపు వన్నెలకు..

———–

You may also like...