| పేరు (ఆంగ్లం) | Raghu Seshabhattar |
| పేరు (తెలుగు) | రఘు శేషభట్టర్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | సాంత్వన కావాలి (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | కోమలత్వం లేని కవనాలు అనాకారి సహచరి మొరటు నవ్వుల్లాంటివి తళతళలాడే కాగితాన్ని సూదిమొనలా తాకుతాయ్…. |
రఘు శేషభట్టర్
సాంత్వన కావాలి (కవిత)
కోమలత్వం లేని కవనాలు
అనాకారి సహచరి మొరటు నవ్వుల్లాంటివి
తళతళలాడే కాగితాన్ని సూదిమొనలా తాకుతాయ్
కాలాన్ని పోగేసి ఒక కలేదో రాయాలని వొచ్చినట్టు
కుండీలో కొత్తమట్టి లేత మొక్కల వేళ్ళు నొక్కినట్టు
నయా లాలస ఏదో గాలిలో పొగలా తిరుగుతోంది
నీటిమడుగులో తడిసిన పసిచేపలా నానుతోంది
ఎంత చిల్లిపడితే మనసు అంత
అనుభవ ధార కార్చుతుందని
ఇవాళే వానమరక తడిమి చెప్పింది
జ్ఞానపుష్పాల కోసం విపణిలో వెతకటం
అమ్మబడిన పూలన్నీ పరిమళాలే ఇస్తాయని నమ్మటం
ఉత్త అసంబద్ధ దుగ్ధ కదా
కొంత సాంత్వన కావాలి –
పొంతనలేని ఈ వింత వలయాల నుంచి
అవి చేసే విషపూరిత గాయాల నుంచి
దూకి ఎగరాలి –
దూది కప్పిన ఈ మురుగు దారుల నుంచి
మనిషి పరిచిన భ్రమల పొరల నుంచి
https://www.facebook.com/raghu.seshabhattar.71
———–