| పేరు (ఆంగ్లం) | Nirmala Nandigama |
| పేరు (తెలుగు) | నిర్మల నందిగామ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | ఖమ్మం |
| విద్యార్హతలు | ఎం ఏ |
| వృత్తి | అసిస్టెంట్ ప్రొఫసర్ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/author/Nandigama+Nirmala+Kumari |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఆకాశం లో సగం నేను (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | ఆకాశం లో సగం నువ్వు అవకాశాల్లో శూన్యం నాకు నా ఉనికి ప్రశ్నార్ధం అయినప్పుడు….. |
నిర్మల నందిగామ
ఆకాశం లో సగం నేను (కవిత)
ఆకాశం లో సగం నువ్వు
అవకాశాల్లో శూన్యం నాకు
నా ఉనికి ప్రశ్నార్ధం అయినప్పుడు
నా కాయం అంగట్లో సరుకయినప్పుడు
నా అశ్రువు మరొక ప్రాణానికి
ఆయువు అయినప్పుడు
విధి నన్నొక ఆట వస్తువు చేసినప్పుడు
పుట్టుక నన్నొక మర యంత్రం గా మార్చినప్పుడు చిత్ర హింసల కొలిమిలో
ఛిద్రమైనప్పుడు
ఒకరోజు వార్తగా ముగిసిన
నిర్భయల వ్యధ ఇంకా
కాల పరీక్ష నాళికలో
కంచికి చేరని కథగా మారిందిప్పుడు !
చెరచడానికి సరిపోయిన వయసు
శిక్షించడానికి అడ్డట !
రేపు వాడు విడుదలై
మరో ఉన్మాదానికి తాళ్ళు పేనే
తలారి కాబో తాడని ముందే తెలిస్తే
కన్న పాపానికి
నన్ను నేనే దహించు కునేదాన్ని.
అపరాజిత (స్త్రీవాద కవిత్వం) 18
ఎక్కడమ్మా నువ్వు లేనిది !
అంటూ పాడుకోడానికి బాగానే ఉంటది
కానీ ఇక్కడ ఎన్నికల వైకుంఠపాళీ లో
అబలలు ఎప్పుడూ
పాము నోటికే చిక్కుతారెందుకో !
అద్దంలో చందమామ ను
చూపించి తినిపించిన గోరుముద్దలు
అప్పుడప్పుడూ
నా గొంతులో వడ్లగింజల్లా మారినప్పుడు!
ఒక జననం వాయిదా అయి
నా పుట్టుక ఒక అసంకల్పితం అయి
నా ఉనికి ఒక అసహజ ముగింపు అయి
నా శరీరం అంగట్లో
హోర్డింగుల మీద వ్యాపార సరుకయి !
నెరవేరని వాగ్దానాలు
మెలి పెడుతున్నప్పుడు
నా అస్తిత్వం పురిట్లోనే నలిపేస్తున్నప్పుడు
నాకో రక్షణ కవచం కావాలి
పునరపి జననం పునరపి మరణం
బీజాక్షరంగా మారిన ఈ నేలలో
మళ్ళీ పుట్టేందుకు భయంగా ఉంది.
నాకెందుకో
ఇంకో గ్రహం వెతుక్కోవాలని ఉంది
అక్కడయినా అమ్మతనాన్ని
స్తన్యం గా మార్చి నూతన శిశువును
కనాలని ఉంది.
———–