| పేరు (ఆంగ్లం) | U.A. Narasimha Murthy | 
| పేరు (తెలుగు) | యు.ఎ.నరసింహ మూర్తి | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 02/10/1944 | 
| మరణం | 04/27/2015 | 
| పుట్టిన ఊరు | విజయనగరం జిల్లా | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | సాహితీవేత్త | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | – | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | సాహితీ సేవలు | 
| సంగ్రహ నమూనా రచన | గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తిపంతులు లాంటి ఎందరో సాహితీ ప్రముఖులపైన, వారి రచనలపైన ‘ఈనాడు’ దినపత్రికలో ఎన్నో వ్యాసాలు రాశారు. | 
యు.ఎ.నరసింహ మూర్తి
గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తిపంతులు లాంటి ఎందరో సాహితీ ప్రముఖులపైన, వారి రచనలపైన ‘ఈనాడు’ దినపత్రికలో ఎన్నో వ్యాసాలు రాశారు. విశ్లేషణ, విమర్శ, ఆసక్తికరమైన కథనాలు రాయడంలో నర్సింహమూర్తికి ప్రత్యేక శైలి ఉంది. కవిత్వ దర్శనం, యశోధర, నోబుల్ సాహిత్య ఉపన్యాసాలు, కన్యాశుల్కం ఇతర భాషలతో తులనాత్మక పరిశీలన, విశ్వనాథ సంగీత దర్శనం లాంటి అనేక గ్రంథాలు రాశారు. చాసో కథాశిల్పం గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, సాహితీమూర్తిగా అజోవిభో అవార్డులు దక్కాయి. గురజాడ 150వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం నరసింహమూర్తికి గురజాడ సాహితీ పురస్కారం అందజేసింది. ప్రతిష్ఠాత్మకమైన రవీంద్రనాథ్ ఠాగూర్ ఫెలోషిప్ తెలుగువారిలో ఈయనకొక్కరికే దక్కింది. ‘కన్యాశుల్కం-పందొమ్మిదో శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు’ పేరిట దేశ మంతటా నాటక విషయంపై పర్య టించి, భారతీయ భాషా నాటకా లలో 19వ శతాబ్దపు కన్యాశుల్కం నాటకపు విశిష్టతను తులనాత్మక పరిశీలన చేశారు.‘తెలుగు వచన శైలి’ విశ్లేషణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించింది.నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల పుర స్కార ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసి ప్రచురణ చేశారు. ‘విశ్వనాథ సౌందర్య దర్శనం’, గిడుగు రామ్మూర్తి రచనలను సరళ భాషలో తిరిగి రాశారు. నరసింహ మూర్తి గారు రచించిన ‘నన్నెచో డుడి కుమార సంభవం’ ఉత్తమ విమర్శకునిగా గుర్తింపు తెచ్చింది. గురజాడ 150వ జయంతి రాష్ట్ర వ్యాప్త ఉత్సవాల్లో భాగంగా గుర జాడ పురస్కారం పేరిట లక్ష రూపాయల నగదు పురస్కారం పొందారు. అజో-విభో సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందించింది. విజయభావన ‘అధ్యయన భారతి’ బిరుదాన్ని సమర్పించింది.27.04.2015 న కన్నుమూశారు.
నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల పుర స్కార ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసి ప్రచురణ చేశారు. ‘విశ్వనాథ సౌందర్య దర్శనం’, గిడుగు రామ్మూర్తి రచనలను సరళ భాషలో తిరిగి రాశారు. నరసింహ మూర్తి గారు రచించిన ‘నన్నెచో డుడి కుమార సంభవం’ ఉత్తమ విమర్శకునిగా గుర్తింపు తెచ్చింది. గురజాడ 150వ జయంతి రాష్ట్ర వ్యాప్త ఉత్సవాల్లో భాగంగా గుర జాడ పురస్కారం పేరిట లక్ష రూపా యల నగదు పురస్కారం పొందా రు. అజో-విభో సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందించి, మాస్టారి సేవలను సమున్నతంగా గౌర వించింది. విజయభావన ‘అధ్యయన భారతి’ బిరుదాన్ని సమర్పించి సత్కరించింది.
https://te.wikipedia.org/wiki/%E0%B0%AF%E0%B1%81.%E0%B0%8E._%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF
———–