| పేరు (ఆంగ్లం) | A.G.Krishna Murthy | 
| పేరు (తెలుగు) | ఎ.జి.కృష్ణమూర్తి | 
| కలం పేరు | ఏజీకే | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 04/28/1942 | 
| మరణం | 02/05/2016 | 
| పుట్టిన ఊరు | వినుకొండ | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | డిప్యూటీ మేనేజర్ | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | ఇదండీ నా కథ | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | https://sahithibooks.com/product-category/ | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | ముద్రా కమ్యూనికేషన్స్ | 
| సంగ్రహ నమూనా రచన | ఓన్లీ విమల్’ అన్నది అందరికీ, ఎప్పటికీ గుర్తు ఉండే సృజనాత్మక ప్రకటన. ఫ్రాంక్ సియాయిస్ సొంత ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత, రిలయన్స్ ప్రత్యర్థులు ఆయన క్లయింట్లు అయిన కారణంగా రిలయన్స్ స్వయంగా ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నెలకొల్పాలనీ, దానికి ‘ముద్ర’ అని పేరు పెట్టాలనీ ఏజీకే చేసిన సూచనను ధీరూభాయ్ అంబానీ ఆమోదించారు. | 
ఎ.జి.కృష్ణమూర్తి
ముద్రా కమ్యూనికేషన్స్
‘ఓన్లీ విమల్’ అన్నది అందరికీ, ఎప్పటికీ గుర్తు ఉండే సృజనాత్మక ప్రకటన. ఫ్రాంక్ సియాయిస్ సొంత ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత, రిలయన్స్ ప్రత్యర్థులు ఆయన క్లయింట్లు అయిన కారణంగా రిలయన్స్ స్వయంగా ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నెలకొల్పాలనీ, దానికి ‘ముద్ర’ అని పేరు పెట్టాలనీ ఏజీకే చేసిన సూచనను ధీరూభాయ్ అంబానీ ఆమోదించారు. ఆయన రూ. 35 వేల నగదు తోను ఒకే ఒక క్లయింట్ తోను వ్యాపార ప్రకటనా సంస్థ స్థాపించారు. కేవలం తొమ్మిదేళ్ళల్లో ముద్రా భారతదేశంలో ఉన్న పెద్ద వ్యాపార ప్రకటనా సంస్థలలో మూడవ స్థానాన్ని, స్వదేశీ వ్యాపార ప్రకటనా సంస్థలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది. 1980లో ముద్ర వెలిసింది. ఒక వెలుగు వెలిగింది. కార్పొరేట్‌రంగంలో అడ్వర్టయింజింగ్ జీనియస్‌గా ఏజీకే గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా విమల్ షోలు నిర్వహించి విమల్ విజయ పరంపరను కొనసాగిం చడంలో ఏజీకేది అద్వితీయమైన పాత్ర. ‘ఐ లవ్ యూ రస్నా’ కూడా ఆయన సృష్టే.
ప్రభుత్వంలో చిన్న గుమస్థా ఉద్యోగంతో ప్రారంభించిన ఎ. జి. కె. తెలుగువారు గర్వించదగ్గ అతి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ధీరూభాయ్ అంబానీకి అతి చేరువలో ఉండి ఈ సంస్థని ఇంత త్వరగా ఉన్నత స్థాయికి లేవనెత్తి ఆయనచేత శభాష్ అనిపించుకున్నారు.
రచయితగా
ఈయన అనుభవాలని పుస్తకాల రూపంలోనూ, పత్రికా శీర్షికల ద్వారానూ రాసి యువతని ఉత్తేజ పరుస్తున్నారు. కృష్ణమూర్తి తెలుగు పత్రికలో వారం వారం అనే శీర్షికను, ఆంగ్ల పత్రికలలో ఏజికె స్పీక్ (AGK Speak) అనే శీర్షికను వ్రాస్తుంటాడు. ఆయన ‘ధీరూభాయిజమ్’ అనే పేరుతో తెలుగులో, ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. ‘ఎదురీత’ పేరుతో మరో పుస్తకం రాశారు. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఆయన రచనలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. ‘ఇదండీ నా కథ’ అనేది ఏజీకే ఆత్మకథ. అదే ఆయన చివరి రచన. అంచెలంచెలుగా ఎదుగుతూ యాడ్స్ రంగ దిగ్గజ వ్యక్తుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కృష్ణమూర్తి తెలుగు, ఆంగ్లంలో 15కి పైగా పుస్తకాలు రచించారు. 2013లో ఇఫ్ యు కాన్ డ్రీమ్ పేరుతో తన ఆత్మకథను పుస్తక రూపంలో విడుదల చేశారు.
https://te.wikipedia.org/wiki/%E0%B0%8E.%E0%B0%9C%E0%B0%BF.%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF
———–
 
					 
																								 
																								