| పేరు (ఆంగ్లం) | Kondapalli Koteswaramma |
| పేరు (తెలుగు) | కొండపల్లి కోటేశ్వరమ్మ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 08/05/1918 |
| మరణం | 09/19/2019 |
| పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | కమ్యూనిస్టు ఉద్యమకారిణి, మహిళా హక్కుల పోరాటయోధురాలు, రచయిత్రి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | నిర్జన వారధి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Books-Kondapalli-Koteswaramma/s? https://www.flipkart.com/books/kondapalli-koteswaramma~contributor/pr?sid=bks, https://zubaanbooks.com/bookauthor/kondapalli-koteswaramma/, |
| పొందిన బిరుదులు / అవార్డులు | సాహితీ సత్కారం,తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2013 |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | ఈమె కృష్ణా జిల్లా పామర్రులో 1918, ఆగష్టు 5న పుట్టింది. ఆమెకు బాల్యవివాహం అయి ఏడేళ్ళ వయసు వచ్చేసరికల్లా భర్త మరణించి బాల్యవితంతువు అయ్యింది. |
కొండపల్లి కోటేశ్వరమ్మ
జీవిత విశేషాలు
ఈమె కృష్ణా జిల్లా పామర్రులో 1918, ఆగష్టు 5న పుట్టింది. ఆమెకు బాల్యవివాహం అయి ఏడేళ్ళ వయసు వచ్చేసరికల్లా భర్త మరణించి బాల్యవితంతువు అయ్యింది. తల్లిదండ్రులు తమ తప్పు సరిదిద్దుకునేందుకు ఆమెని చదివించారు. కుటుంబంలో పరిస్థితులు ఆమెను చిన్నతనంలోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితురాలిని చేశాయి. క్రమేపీ అప్పుడప్పుడే విస్తరిస్తున్న కమ్యూనిస్టు ఉద్యమంతోనూ సంబంధాలు పెరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య ఆమెని వివాహం చేసుకుంటానని ముందుకువచ్చాడు. గ్రామస్తులు వితంతు పునర్వివాహం అని దీన్ని వ్యతిరేకిస్తున్నా కుటుంబ సభ్యుల సమ్మతిపై సీతారామయ్యతో కోటేశ్వరమ్మ వివాహం జరిగింది.
సీతారామయ్యతో వివాహానంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో మరింత చురుకుగా ఆమె పనిచేసింది. పురుషులు, వేశ్యలు తప్ప మహిళలు నాటకాల్లో స్త్రీ పాత్రలు వెయ్యని రోజుల్లో మాభూమి, కన్యాశుల్కం వంటి నాటకాల్లో ఆమె నటించింది. పార్టీ కార్యకర్తగా ఎంతో కృషిచేసింది. ఈ దశలో ఆమెకు కుమార్తె కరుణ, కుమారుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. పార్టీ పనుల వల్ల ఆమె జైలుశిక్ష కూడా అనుభవించింది. 1948 తర్వాత కమ్యూనిస్టు పార్టీని భారత ప్రభుత్వం నిషేధించినప్పుడు బందరు, ఏలూరు, విశాఖపట్టణం, పూరీ, నాగ్పూర్, రాయచూర్, గోంధియా వంటి ప్రాంతాలు సంచరిస్తూ, భర్త, పిల్లలకు దూరమై అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీకి పనిచేసింది. నిషేధం ఎత్తేశాకా పార్టీ కార్యకర్తగా ఊరూరా తిరిగి జెండా భుజాన వేసుకుంది.
https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE
———–