Share
పేరు (ఆంగ్లం)Pupul Jiyakar
పేరు (తెలుగు)పుపుల్ జయకర్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుమన్మోహన్ జయకర్
పుట్టినతేదీ1915 సెప్టెంబరు 11
మరణం1997 మార్చి 29
పుట్టిన ఊరుఇతావ, ఉత్తర ప్రదేశ్
విద్యార్హతలు
వృత్తికళాకారిణి, రచయిత్రి.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుటెక్స్టైల్స్ అండ్ ఎంబ్రాయిడరీస్ ఆఫ్ ఇండియా
టెక్స్టైల్స్ అండ్ ఆర్నమెంట్స్ ఆఫ్ ఇండియా: ఏ సెలక్షన్ ఆఫ్ డిజైన్స్, విత్ జాన్ ఇర్విన్
ది ఎర్తెన్ డ్రమ్: యాన్ ఇంట్రడక్షన్ టు ది రిచ్యువల్ ఆర్ట్స్ ఆఫ్ రూరల్ ఇండియా
ది బుద్ధ: ఏ బుక్ ఫర్ ది యంగ్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

పుపుల్ జయకర్

ఈవిడ రచయితగానే కాకుండా ఇతర రంగాలలో కూడా విశేష ప్రతిభను ప్రదర్శించింది. స్వాతంత్ర్యానంతరం అంతరించి అవసాన దశకు చేరిన సాంప్రదాయ గ్రామీణ కళలను, హస్త కళలను పునరుజ్జీవింపజేయడంలో ఈమె విశేష కృషి చేసింది.1980 లలో ఈవిడ ఫ్రాన్స్, అమెరికా, జపాన్ దేశాలలో భారతీయ చిత్రకళా ప్రదర్శనలను ఏర్పాటు చేసి, పశ్చిమ దేశాలలో భారతీయ చిత్రకళకు అంతర్జతీయ కీర్తిని తెచ్చిపెట్టింది. గాంధీ, నెహ్రూ, ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి లకు ఈవిడ మంచి స్నేహితురాలు. అంతే కాకుండా వారి జీవిత చరిత్రలను కూడా గ్రంథస్తం చేసింది. భారతదేశ ముగ్గురు ప్రధాన మంత్రులు నెహ్రూ ఆయన కూతురు ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ లకు ఈవిడ ఆప్తురాలుగా మెలిగింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లకు సాంస్కృతిక సలహాదారుగా వ్యవహరించింది. 40 ఏళ్ళపాటు భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేసింది. మన దేశ సాంప్రదాయక కళలను ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటికి ఘనమైన కీర్తిని తద్వారా గిరాకీని తీసుకువచ్చింది.[1][2]

1950లో అప్పటి ప్రధాని నెహ్రూ కోరిక మేరకు మనదేశ చేనేత రంగంపై అధ్యయనం చేసింది. తర్వాత ఏర్పాటైన జాతీయ చేనేత సంఘమునకు అధ్యక్షురాలిగా సేవలు అందించింది. ఈ కాలంలోనే అంతరించిపోతున్న భారతీయ మధుబని చిత్రకళని పునరుజ్జింపజేసింది.[3] 1956 లో జాతీయ కళా నైపుణ్య సంగ్రహాలయం, 1984 లో భారత జాతీయ కళా, సాంస్కృతిక కేంద్రము భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ (ఐఎన్టిఏసిహెచ్) లను స్థాపించింది.[1] అంతే కాకుండా 1985లో ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రము (ఐజీఎన్సీఏ), 1990 లో జాతీయ కళాపోషణ కేంద్రము నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లను కూడా స్థాపించింది.[2][4] ఈమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వము ఈమెను 1967లో పద్మభూషణ్ పురస్కారం సత్కరించింది.[5]

———–

You may also like...