గంటేడ గౌరునాయుడు (Ganteda Naidu)

Share
పేరు (ఆంగ్లం)Ganteda Naidu
పేరు (తెలుగు)గంటేడ గౌరునాయుడు
కలం పేరుక్రాంతి/గౌన
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/8/1954
మరణం1/8/1983
పుట్టిన ఊరుదళాయిపేట గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅవతలి ఒడ్డు
ఆసరసాల
ఇది చేదు కథ కాదు
ఏటిపాట
ఒక రాత్రి రెండు స్వప్నాలు
కాటు
కొండమల్లె
గెంజిమెతుకులు
చొక్కాగుడ్డ కోసం
జీవసూత్రం
తిరుగుడు గుమ్మి
దేవుడూ వర్ధిల్లు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనా తిత్తవ (కవిత)
సంగ్రహ నమూనా రచనబురద కుమ్మి బురద బుక్కినోళ్ళ మాట
మట్టి వాసనే వేస్తుంది మరి
నా కవిత్వ పాదాలను ముట్టుకుంటే
వేళ్ళకు మట్టి అంటకుండా ఎలా వుంటుంది…..

గంటేడ గౌరునాయుడు
నా తిత్తవ (కవిత)

బురద కుమ్మి బురద బుక్కినోళ్ళ మాట

మట్టి వాసనే వేస్తుంది మరి

నా కవిత్వ పాదాలను ముట్టుకుంటే

వేళ్ళకు మట్టి అంటకుండా ఎలా వుంటుంది

నా పదాలను పలకరిస్తే పశువులను పలకరించినట్టు

నా పలుకులను పరామర్శిస్తే

చేలనూ నాగేటి చాళ్ళనూ పరామర్శించినట్టు

నా మాటలు సాటవల సందళ్ళు

సామెతల సందిళ్ళు

నా పాటలు సెమట పూల పందిళ్ళు

చలిమంటల కుందిళ్ళు

గైని తీసి నా తల్లి బాస కళ్ళంలో అడుగుపెడితే

తెలుస్తుంది నా పలుకుబడి

నివ్వెర పరుస్తుంది నా నానుడి

నా నాడుల్లో నాగావళి అలల జడి

జంఝావతి అలజడి

వంశధార వరద ఉధృతి అంచనా వేయాలనుకుంటే

వొడ్డున నిలబడి చూస్తే చాలదు

లోతు చూడాలంటే ఈత తెలియాల్సిందే

మట్టిని గురించిన ఎరుకలేని వాడికి

సేద్యం ఎలా సాధ్యమవుతుంది?

పదం పదును తెలియనోడికి

పద్యం ఎలా పట్టుబడుతుంది?

కవిత్వం ఒక బెడ్డ దుక్కి

ఆ రహస్యం పోతనకు తెలుసు

మడిసెక్కలో మొక్కల్ని

మెదడు ముక్కలో మహావాక్యాలని

ఏకకాలంలో రచించే ప్రతీవాడూ ఒక పోతన

నిత్య కృషీవలుడు నిరంతర స్వాప్నికుడూ కదా కవీ!

నేను కవిని

మట్టిలోంచి మొలకెత్తిన వాణ్ణి

మట్టి కోసం ఎలుగెత్తిన వాణ్ణి

చెట్టు చిగురు చూసి కాయ వగరు

అలల తీరు చూసి ఏటి పొగరు చెప్పగల వాణ్ణి

వేళ్ళతో భూమిని చివుళ్ళతో ఆకాశాన్ని వొడిసిపట్టి

చూపుల్ని సూదులు చేసి

చినుకుల దారాలతో కలిపి కుట్టేవాణ్ణి

నేను కవిని

మట్టి గుండె చప్పుడు నా భాష

మర్మమెరగని మోటుదనం నా యాస

యాస నా నేల శ్వాస

నా పలుకు పంచదార

నా పేరు కళింగోర

గురజాడ అడుగుజాడలో నా నడక

గిడుగు నీడలో నా పడక

తూర్పులో పొడిచిన తొలి వెలుగు రేక

నా భుజాన కస్తవా!

ఇదిగిదిగీ నా తిత్తవ.

 

https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B1%87%E0%B0%A1_%E0%B0%97%E0%B1%8C%E0%B0%B0%E0%B1%81%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81

———–

You may also like...