రమాదేవి కులకర్ణి (Ramadevi Kulakarni)

Share
పేరు (ఆంగ్లం)Ramadevi Kulakarni
పేరు (తెలుగు)రమాదేవి కులకర్ణి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆకలి దేవో
సంగ్రహ నమూనా రచనఏ అథ్లెట్లు పనికిరారు
ఏ యుద్ధవీరులు
వీరిముందు అనలేరు
ఆ యుద్ధం ఆకలిపై
తమ పొట్ట తిప్పలుకై….

రమాదేవి కులకర్ణి
ఆకలి దేవోభవ

ఏ అథ్లెట్లు పనికిరారు

ఏ యుద్ధవీరులు

వీరిముందు అనలేరు

ఆ యుద్ధం ఆకలిపై

తమ పొట్ట తిప్పలుకై

కూడు గూడు లేక

ముసలి ముతక పిల్లాజెల్ల

అందరినీ ఏస్కోని

మైళ్లకు మైళ్ళు దారి పడితే

నీ పాదముద్రలు ఏసిన

ఎర్రటి రక్త చందనములు

భూతల్లికి పెట్టిన బొట్లు

గుండెపగిలి ఆమె కార్చిన కన్నీళ్లు

చావుకన్నా భయంకరమైన

నీ ఆకలి కేకలు

నభోమండలాన్ని చీల్చుకొని

పైపైకి మంటలా ఎగిసిపడి

క్షుధాగ్ని ముందు చల్లారిపోయెనా ఏమీ

పొట్ట చేతబట్టుకుని బతుకొచ్చిన

ఓ వలస జీవీ… !!

నీ నోటికి బుక్కెడు బువ్వ కాలేకపోయంది

నీవు నమ్ముకొని వచ్చిన ఈ పట్నం

ఏ దేవుడైన కానరాకపోతాడా

నీ కడుపు గోస వినకపోతాడా

నీ పరుగును పొదుముకోక పోతాడా

పిచ్చిగానీ…

ఆకలిదేవోభవ అన్న ఆ  అరుపు

అన్నదాతలారా ఆలకించండి

పట్నం గొడ్డుబోలేదని చెప్పండి..!!



———–

You may also like...