పేరు (ఆంగ్లం) | Jwalitha |
పేరు (తెలుగు) | జ్వలిత |
కలం పేరు | – |
తల్లిపేరు | దెంచనాల ఈశ్వరమ్మ |
తండ్రి పేరు | దెంచనాల బ్రహ్మయ్య |
జీవిత భాగస్వామి పేరు | తుంగతుర్తి జనార్ధనరావు |
పుట్టినతేదీ | 03/11/1959 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | కవయిత్రి, కథా రచయిత్రి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | జ్వలితార్ణవాలు (వ్యాస సంపుటి) సుదీర్ఘ హత్య (కవిత్వం) ఆత్మాన్వేషణ (కథలు) పరివ్యాప్త (కవితా సంకలనం) అగ్నిలిపి కాలాన్ని జయిస్తూ నేను మర్డర్ ప్రొలాంగేర్ గాయాలే గేయాలై ఖమ్మం కథలు (1911-2016) (సంపాదకత్వం) మొదలైనవి. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | జ్వలిత కౌసల్య (పుస్తకం) |
సంగ్రహ నమూనా రచన | దశరథ మహారాజుగారి పట్టమహిషి, శ్రీరామచంద్రులవారి కన్నతల్లి. కౌసల్య గుండెల్లో ఏదైనా ఒక ఆవేదన వుంటుంది అంటే ఎవరూ నమ్మరు. కానీ ఆవిడ నిప్పులు మూటగట్టుకుని కూర్చుంది. |
జ్వలిత
జ్వలిత కౌసల్య (పుస్తకం)
దశరథ మహారాజుగారి పట్టమహిషి, శ్రీరామచంద్రులవారి కన్నతల్లి. కౌసల్య గుండెల్లో ఏదైనా ఒక ఆవేదన వుంటుంది అంటే ఎవరూ నమ్మరు. కానీ ఆవిడ నిప్పులు మూటగట్టుకుని కూర్చుంది.
వనవాసానికి బయలుదేరుతూ ఆశీస్సుల కోసం వచ్చిన కన్నకొడుకుని చూడగానే ఆ మూట భగ్గుమంది. పేరుకి పట్టమహిషినే కానీ మీ నాన్నగారి నిర్వాకంలో నా బతుకు దాసి కన్నా కనాకష్టం అయిపోయింది. నువ్వు రాజువైతేనన్నా సుఖపడదామనుకున్నాను. అది కూడ అడియాసే అయ్యిందా – అని బోరున విలపించింది. వాల్మీకి ఏ దాపరికమూ లేకుండ కౌసల్య కడుపుమంటని సరాసరి ఇరవై శ్లోకాల్లో వర్ణించాడు.
వీటిని చదివి అనుమాండ్ల భూమయ్యగారు కదిలిపోయారు. అనువదించారు. అదే బాణీలో మరిన్ని భావాలను మెదిపి ఆ ఘట్టాలన్నింటినీ జ్వలిత కౌసల్య అనే లఘుకావ్యంగా రచించారు.
వీరి కావ్యాలన్నింటా తేటగీతులూ ఆటవెలదులే. జ్వలిత కౌసల్యలో ముత్యాల సరాలూ ముగింపులో ఒక శార్దూలం వున్నాయి. వీరి పద్య నిర్మాణశైలి వచనానికి దగ్గరగా వుంటుంది. అయితే వారి బాణీలో చదువుతొంటే పద్యం నడక హాయిగానే వుంటుంది.
https://kinige.com/book/Jwalitha+Kousalya
———–